India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు. గురువారం నగరంలోని చిన్నబజార్ పోలీసు స్టేషన్ను సందర్శించారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పచ్చదనం పెంచాలని, పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మహిళలు, బాలికలు తప్పిపోయిన కేసులలో తక్షణమే స్పందించి, ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాలన్నారు. అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదన్నారు.

నెల్లూరు జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం మనుబోలు వద్ద ఓ ఇంటర్ విద్యార్థి తనువు చాలించగా, గురువారం నార్త్ రాజుపాలెంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఒకరు పరీక్షలు రాయలేనని, మరొకరు ట్యాబ్ దొంగతనం ఆరోపణలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

నెల్లూరు చేపల పులుసుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజా చేపలతో చేసే ఈ పులుసును ఎవరైనా లొట్టలేసుకుంటూ తినాల్సిందే. మన నెల్లూరు చేపల పులుసును ఇతర దేశాలకు సైతం సరఫరా చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. నెల్లూరు చేపల కూరలతో మెట్రోపాలిటన్ సిటీలో కూడా వ్యాపారాలు కొనసాగుతున్నాయి. టేస్ట్తోపాటూ దీనిలోని సహజ పోషక లక్షణాలు హృదయ రోగులకు ఎంతో మేలు చేస్తాయి.
# నేడు ప్రపంచ ఆహార దినోత్సవం.

కూతురిపై తాగిన మైకంలో అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రికి కోర్టు జీవిత ఖైదు విధించింది. జలదంకి మండలానికి చెందిన బాలరాజు 2019 జూన్ 24న ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురిపై అత్యాచారం చేశారు. ఆమెకు గర్భం రావడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో అతడికి జీవిత ఖైదుతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

నెల్లూరు జిల్లాలో బుధవారం నుంచి నెల రోజులు APIICఆధ్వర్యంలో ఇండస్ట్రీ పార్టనర్ షిప్ డ్రైవ్ నిర్వహిస్తామని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కందుకూరు సబ్ కలెక్టరేట్లో సంబంధిత వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. స్థానిక పరిశ్రమల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, నూతన పెట్టుబడులకు ప్రోత్సాహం, యువతకు ఉపాధి అవకాశాల సృష్టే లక్ష్యంగా డ్రైవ్ జరుగుతుందన్నారు.

నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా) వైస్ ఛైర్మన్(వీసీ)గా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఆయన వీసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నుడా పరిధిలో పదుల సంఖ్యలో లేఅవుట్లకు అనుమతులు ఆగిపోయాయి. వీసీ నియామకంతో వీటికి మోక్షం లభించే అవకాశముంది.

నెల్లూరు జిల్లాలో రైతులకు ఎకరాకు 3బస్తాల చొప్పున యూరియానే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 6బస్తాలు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన 94 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. అధికారులు 74 వేల మెట్రిక్ టన్నులకే ప్రతిపాదనలు పంపారు. 20వేల మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడితే యూరియా కోసం రైతులు అవస్థలు పడక తప్పదు.

నెల్లూరు జిల్లా సంగం జడ్పీ స్కూల్ సోషల్ టీచర్ సుబ్రహ్మణ్యం, పదో తరగతి విద్యార్థి యశ్వంత్కు అరుదైన అవకాశం దక్కింది. కర్నూలులో పీఎం మోదీ ఆధ్వర్యంలో గురువారం జరగనున్న జీఎస్టీ రీఫార్మ్ 2.0 సభకు వీరిద్దరూ ఎంపికయ్యారు. జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలను ప్రధాని సభా ప్రాంగణంలో వీరిద్దరూ వివరించనున్నారు. ఈక్రమంలో కర్నూలుకు బయల్దేరి వెళ్లారు.

తనపై దౌర్జన్యం జరిగిందని లింగసముద్రం తహశీల్దార్ స్వయంగా ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు అదేరోజు FIR ఎందుకు చేయలేదన్న విమర్శలు చెలరేగుతున్నాయి. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న అధికారి ఫిర్యాదు ఇస్తే అది కూడా FIR కాకపోవడం చర్చనీయాంశమైంది. లింగసముద్రం SI నారాయణ తీరు పట్ల తహశీల్దార్ సైతం అసహనం వ్యక్తం చేశారు. బాధితుల పట్ల పోలీసులు బాధ్యతగా వ్యవహరించకపోతే ఎలా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈనెల 16న కర్నూలు జిల్లాలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు జిల్లా నుంచి 250 బస్సులను అధికారులు కేటాయించారు. కర్నూలు(D) ఓర్వకల్లు మండలంలోని నన్నూరు వద్ద నిర్వహించే ఈ సభకు నెల్లూరు డిపో 1నుంచి 40, నెల్లూరు డిపో 2 నుంచి 50, ఆత్మకూరు డిపో నుంచి 31, కందుకూరు డిపో నుంచి 35, కావలి డిపో నుంచి 40, ఉదయగిరి డిపో నుంచి 29, రాపూరు డిపో నుంచి 25 వరకు బస్సులు కేటాయించారు.
Sorry, no posts matched your criteria.