India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తనకు బెయిల్ సందర్భంగా విధించిన షరతును సవరించాలని కోరుతూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాకాణిని ప్రతి ఆదివారం దర్యాప్తు అధికారి ముందు హాజరవ్వాలని, పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసే వరకు నెల్లూరు రావడానికి వీల్లేదని హైకోర్టు షరతు విధించింది. ఈ షరతును సవరించాలని కోరగా.. తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబును గురువారం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆహ్వానం పలికారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఎంకి స్వాగతం పలికారు. ఎంపీని సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు.
కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 23న సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుందని నెల్లూరు ఎస్పీ కృష్ణ కాంత్ తెలిపారు. గత డిసెంబర్, జనవరి నెలలో ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ జరిగిందన్నారు. అందులో అర్హత పొందిన వారి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ 23వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
నెల్లూరు జిల్లాలోని HMలు, టీచర్లు స్పౌజ్, మ్యూచువల్ ప్రాతిపదికన లీప్ యాప్‌లో అంతర్ జిల్లాల బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో డాక్టర్ ఆర్.బాలాజీ రావు సూచించారు. అంతర్ జిల్లాల బదిలీలు, అర్హత వివరాల కోసం deonellore.50.webs.comను చూడాలన్నారు. బదిలీలకు ప్రభుత్వ, జిల్లా పరిషత్, కార్పొరేషన్, మున్సిపల్ పాఠశాల టీచర్లు అర్హులని చెప్పారు.
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం దుకాణాల పక్కనే పర్మిట్ రూమ్స్ ఏర్పాటుకు అవకాశం కల్పించింది. దీంతో నెల్లూరు జిల్లాలో 200 పర్మిట్ రూములు ఏర్పాటు కానున్నాయి. పర్మిట్ రూమ్స్ ఏర్పాటుకు పట్టణాల్లో రూ.7 లక్షలు, రూరల్ ప్రాంతాల్లో రూ.5 లక్షలు(ఏడాదికి) చెల్లించాలి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు.
కందుకూరుకు చెందిన అఖిల్, దివ్య ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇటీవల ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. తమకు పెద్దల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు. నెల్లూరు ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. తమ తల్లిదండ్రులకు పోలీసులు రెండుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా ఇంకా తమను బెదిరిస్తున్నారని వాపోయారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని కోరారు.
సీతారామపురం ఎంపీడీవో నిధులు <<17278356>>గోల్‌మాల్ <<>>చేశారని Way2Newsలో ఆగస్ట్ 2వ తేదీన వార్త ప్రచురితమైంది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆత్మకూరు DLPO టి.రమణయ్య రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, విత్ డ్రా వివరాలపై ఆరా తీశారు. మండలంలో పనిచేస్తున్న ఎంపీడీవో లాంగ్ లీవు పెట్టి రూ.11 లక్షల నిధులను గోల్‌మాల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జడ్పీ సీఈవో మోహన్ రావు ఆదేశాల మేరకు విచారణ జరిగింది.
సీతారామపురం MRO పీవీ కృష్ణారెడ్డిపై కలెక్టర్ ఆనంద్ బుధవారం సస్పెన్షన్ వేటు వేశారు. గ్రామంలో 40 సెంట్లు పొలానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా మ్యుటేషన్ చేశారని బాధితుడు నరసింహ కలెక్టర్‌కు గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం MRO తప్పిదం తేలడంతో కలెక్టర్ చర్యలు చేపట్టారు.
సోమశిల జలాశయానికి వరద వస్తోంది. ప్రస్తుతం 30,257 క్యూసెక్కుల కృష్ణా జలాలు వస్తున్నాయని ఈఈ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా 52.180 టీఎంసీల నీటిమట్టం నమోదైంది. రైతుల అవసరాల కోసం పెన్నా డెల్టాకు 1,850, కండలేరుకు 9,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 201 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. వరద ఇలాగే కొనసాగితే సెప్టెంబర్ మొదటి వారానికి 70 TMCలు చేరే అవకాశం ఉంది.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పై విడుదలవుతారని మంగళవారం వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎదురు చూశారు. కానీ సాయంత్రం 5:30 గంటల వరకు గూడూరు కోర్టులో బెయిల్ పత్రాలు సమర్పించలేదు. కాకాణి విడుదల కోసం ఎదురుచూస్తున్న ఆయన కుమార్తె పూజిత రెడ్డితో పాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైసీపీ నేతలు ఎదురుచూపులు చూశారు.
Sorry, no posts matched your criteria.