India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూళ్లూరుపేట మండలం కొన్నెంబట్టు గ్రామం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. సూళ్లూరుపేట నుంచి బైకుపై వస్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దొరవారి సత్రం మండలం పోలిరెడ్డి పాలెంకు చెందిన ధనుంజయ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మృతుడు గతంలో వాలంటీర్‌గా దొరవారి సత్రం మండలంలో పనిచేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఇప్పటికే అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో ముందస్తుగా NDRF బృందాలు నెల్లూరుకు చేరుకున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఇప్పటికే అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో ముందస్తుగా NDRF బృందాలు నెల్లూరుకు చేరుకున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
నెల్లూరు జిల్లాకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 45 నుంచి 65 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు. కాగా మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్లరాదని ఇప్పటికే అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఉమ్మడి నెల్లూరు జిల్లా అభివృద్ధిలో కీలకం కానున్న మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్( మిథాని) పరిశ్రమ ఏర్పాటుకు త్వరగతిన చర్యలు తీసుకోవాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు విన్నవించారు. గురువారం రాజ్ నాథ్ సింగ్‌ను ఎంపీ వేమిరెడ్డి కలిశారు. అనంతరం మిథాని పరిశ్రమ ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించారు.
వెంకటగిరికి చెందిన కానిస్టేబుల్ చిరంజీవి(29) విజయవాడలోని ఇంటెలిజెన్స్ విభాగంలో APSPగా పనిచేస్తున్నారు. ఆయన యనమలకుదురులో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి భార్య గాయత్రితో గొడవపడడంతో ఆమె పక్కింటికి వెళ్లింది. బుధవారం ఉదయం ఆమె వచ్చి చూడగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిల్లకూరు(మం) కడివేడు సమీపంలో బుధవారం రాత్రి ఓ వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. చిల్లకూరు ఎస్ఐ సురేశ్ రెడ్డి వివరాల ప్రకారం.. కడివేడు వద్ద బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో బైక్ వెనుక కూర్చున్న కడివేడు గ్రామానికి చెందిన మాధవ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన విందులో నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పవన్ బుధవారం రాత్రి ఢిల్లీలో ప్రత్యేక డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ విందులో పవన్ ఆహ్వానం మేరకు ఎంపీ పాల్గొన్నారు.
భూమాతను నమ్ముకున్న ఓ కర్షకుడు పొలంలోనే ప్రాణాలను విడిచిన ఘటన పెళ్లకూరు మండలంలో ఇవాళ జరిగింది. పిన్నెపల్లెకు చెందిన రమణయ్య (58) పొలం దుక్కుతున్న సమయంలో కరెంటు వైర్లు ట్రాక్టర్ సైలెన్సర్‌కు తగిలాయి. దీంతో ఆ రైతు అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదు చేసుకున్న SI నాగరాజు మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి రైతు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ తుఫానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. గరిష్ఠంగా గంటకు 75KM వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. కృష్ణపట్నం పోర్టుకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.
Sorry, no posts matched your criteria.