India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులకు కీలక సూచన చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లోని సమచారాన్ని RDO కార్యాలయాల్లోని కంట్రోల్ రూంకు లేదా కలెక్టరేట్‌కు తెలియజేయాలన్నారు. కంట్రోల్ రూం నంబర్లు తిరుపతి కలెక్టరేట్ 0877-2236007 గూడూరు RDO ఆఫీసు 08624-252807, సూళ్లూరుపేట RDO ఆఫీసు 08623-295345ను సంప్రదించాలన్నారు.
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపులో దారుణం జరిగింది. నెల్లూరు హిజ్రాల లీడర్ హాసిని పార్లపల్లిలోని గుడిలో నిన్న రాత్రి పూజలు చేశారు. తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రెండు కారుల్లో వచ్చి కత్తులతో పొడిచి పరారయ్యారు. 108లో అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 9 పీజీ సీట్లను కేంద్ర వైద్యారోగ్య శాఖ కేటాయించింది. 2024- 25 సంవత్సరానికి గాను ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్ విభాగాల్లో ఈ సీట్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నెల్లూరు మెడికల్ కళాశాలకు సమాచారం అందించింది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి వల్లే ఇది సాధ్యమైనందని టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సైబర్ మోసానికి గురైతే గోల్డెన్ అవర్‌ను మిస్ చేసుకోవద్దని ఎస్పీ కృష్ణకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ఒక వ్యక్తి అకౌంట్ నుంచి డబ్బు మాయమైన గంటలోపు ఉండే సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారన్నారు. ఆ సమయంలో ఫిర్యాదు చేస్తే డబ్బులు ఫ్రీజ్ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీంతో బాధితుడికి డబ్బులు తిరిగి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేయాలన్నారు.
నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్ శంకరన్ హాల్లో ఇవాళ నిర్వహించిన రాజ్యంగ దినోత్సవం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలబడిందంటే దానికి కారణం భారత రాజ్యాంగమేనని అన్నారు. ప్రతిఒక్కరూ కూడా రాజ్యాంగ స్ఫూర్తితో దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ పిలుపునిచ్చారు.
ప్రేమ వివాహం చేసుకుని రక్షణ కల్పించాలని నూతన వధూవరులు ఆదివారం ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్‌ను ఆశ్రయించారు. దుత్తలూరు మండలం నాయుడుపల్లి పంచాయతీలోని ఎస్సీ కాలనీకి చెందిన నల్లి పోగు షాలినీ(19), అదే ఎస్సీ కాలనీకి చెందిన మున్నంగి జాషువా (26) ఈ ఇద్దరు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు ఒకటే కావడంతో పెద్దలు అంగీకరించరని తెలిసి వివాహం చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల ఇస్రో రెండు రాకెట్ ప్రయోగాలను చేపట్టనుంది. డిసెంబర్ 4న పీఎస్ఎల్వీ సీ59, డిసెంబర్ 24న పీఎస్ఎల్వీ సీ60 రాకెట్లను ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. శ్రీహరికోట షార్ లోని ప్రయోగ వేదికకు సంబంధించిన మొబైల్ సర్వీస్ టవర్, ఇంటిగ్రేషన్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు జరుగుతున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 27,28 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొదని హెచ్చరించారు. సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్ 0861-2331261 ను సంప్రదించాలని సూచించారు.
నెల్లూరు జిల్లా SP కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమానికి 77 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఇచ్చినట్లు SP వెల్లడించారు. వాటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
కావలి మండలంలోని బట్లదిన్నె గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఆదివారం రాత్రి పూరిల్లు దగ్ధం అయ్యింది. ఇంటిలో ఒంటరిగా మంచంపై ఉన్న 65 ఏళ్ల వృద్ధురాలు నాగమ్మ సజీవదహనం అయ్యారు. రాత్రి కావడంతో ఇల్లు కాలిపోతున్నా సకాలంలో ఎవరూ స్పందించలేకపోయారు. గుర్తించి చూసేసరికే అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్ధం అయ్యింది. మంచంపై ఉన్న వృద్ధురాలు కాలి బూడిదయ్యింది.
Sorry, no posts matched your criteria.