India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన రాష్ట్రస్థాయి చైర్మన్ పదవులతో పాటు కొంతమంది డైరెక్టర్ల పేర్లను కూడా ప్రకటించింది. ఏపీ మార్క్‌ఫెడ్ డైరెక్టర్‌గా తిరుపతి పార్లమెంటు పరిధిలోని సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరసా వెంకటరత్నం పేరును ప్రకటించారు. దీంతో ఆయనకు సుళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, ఇతర టీడీపీ నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
టీడీపీ ప్రభుత్వం 20 మందికి తొలి విడతలో నామినేటెడ్ పదవులు కేటాయించింది. వీరిలో నెల్లూరు జిల్లా కీలక నేత అబ్దుల్ అజీజ్‌ను వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా నియమించింది. కాగా గత ఎన్నికలలో MLA సీటు త్యాగం చేయగా.. తాజా పదవితో ప్రాధాన్యం కల్పించింది. ఈ పదవి అజీజ్ విధేయతకు దక్కిన గౌరవంగా పార్టీ శ్రేణులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అటు వేణములపాటి అజయ్ కుమార్ APTIDCO ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
నెల్లూరు జిల్లాలోని 108 వాహనాల్లో పైలెట్, ఈఎంటీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ ఎస్. విజయ్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 25వ తేదీలోపు నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, దిశ మహిళా పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న 108 కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.
మనుబోలు మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డుపై ఓ ట్రావెల్ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం విజయవాడ నుంచి చెన్నైకి 18 మంది ప్రయాణికులతో వెళ్తుండగా.. యాచవరం రోడ్డు దాటాక బస్సు టైరు పగిలిపోయింది.దీంతో బస్సు అదుపుతప్పి మరో వైపు వెళ్లిపోయింది. ఆసమయంలో వేరే వాహనాలు ఉండకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు అన్నారు. బస్సును క్రేన్ సాయంతో పక్కకు తొలగించినట్లు బస్సు సిబ్బంది తెలిపారు.
ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాలెం సచివాలయంలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ నరసింహారెడ్డి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం జిల్లాలో జరిగిన రెవెన్యూ అధికారుల బదిలీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ అతనికి ఆత్మకూరు మండలంలోని రామస్వామిపల్లి వీఆర్వో గా పోస్టింగ్ ఇస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్వో మృతి ఉన్నతాధికారులకు తెలియకపోవడంతోనే ఇలా జరిగి ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది.
శాంతిభద్రతల పరిరక్షణ, నేర నిర్మూలనలో జిల్లా పోలీసులు సమర్దవంతంగా పనిచేస్తున్నారని జిల్లా ఎస్పీని గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి అభినందించారు. సోమవారం పోలీసుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రధమస్థానంలో సాధించిందన్నారు. అంతేకాకుండా ముత్తుకూరు పరిధిలో జరిగిన దోపిడీ కేసును గంటల వ్యవధిలో చేధించడంలో అద్భుతంగా పనిచేశారన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఉదయగిరి ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని బండగానిపల్లి గ్రామానికి చెందిన భేరి తిరుపాల్ రెడ్డి సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్‌లో ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలంతో పోస్ట్ చేశారనిఅన్నారు. అందుకు గాను ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు.
కలిగిరి మండలం లక్ష్మీపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. కుమ్మరి కొండూరు నుంచి బైక్‌పై వస్తున్న రామస్వామి పాళెం గ్రామానికి చెందిన వడ్డే శ్రీనివాసులు, వంకదారి మాలాద్రిని లక్ష్మీపురం సమీపంలో ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వెంకటగిరి పోలేరమ్మ జాతర సందర్భంగా ఈ నెల 25న మధ్యాహ్నం 3 గం. నుంచి 26న రాత్రి 7 గంటల వరకు డ్రై డే మద్యం దుకాణాలు బంద్ చేయాలని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ కోరారు. అలాగే అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు సూచించారు. బందోబస్తు, భద్రత చర్యలు పకడ్బందీగా ఉండాలని ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు.
జిల్లాలో ఆదివారం పలువురు అధికారులు బదిలీ అయ్యారు. వారిలో ఆరుగురు MROలు, 55-డిప్యూటీ MROలు, 17-రీసర్వే డిప్యూటీ తహశీల్దార్లు, 70-సీనియర్ అసిస్టెంట్లు, 27 మంది జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. వారితోపాటూ ప్రధానంగా జడ్పీ సీఈవో కన్నమనాయుడు, డిప్యూటీ సీఈవో చిరంజీవులు, డీపీవో సుస్మితారెడ్డి, డీఆర్డీఏ పీడీ కేవీ సాంబశివారెడ్డి, డ్వామా పీడీ వెంకట్రావు, డీఎఫ్ఓ ఆవుల చంద్రశేఖర్ బదిలీ అయ్యారు.
Sorry, no posts matched your criteria.