India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కావలి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని కావలి-SV పాలెం రైల్వే స్టేషన్ మధ్యలో వెళ్తున్న హౌరా మెయిల్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి జారిపడి మృతి చెందినట్లు రైల్వే SI వెంకట్రావు శనివారం తెలిపారు. మృతుడి వయసు సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటాయన్నారు. మృతుడి శరీరంపై తెలుపు రంగు చొక్కా, బులుగు రంగు ప్యాంటు ఉన్నాయన్నారు. మృతదేహాన్ని కావలి ఏరియా వైద్యశాలకు తరలించామన్నారు.

ఉదయగిరి (M) కుర్రపల్లిలో మేకలు దొంగతనం చేసేందుకు యత్నించిన ముగ్గురిని గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గ్రామానికి చెందిన గోర్తుల వినోద్ కుమార్‌కు చెందిన మేకల దొడ్డిలో మేకలను దొంగలించేందుకు వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల ప్రాంతానికి చెందిన ముగ్గురు దొంగలు ఆటోలో వచ్చారు. మేకలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా కుక్కలు అరవడంతో గ్రామస్థులు వారిని పట్టుకుని ఆటోతో సహా పోలీసులకు అప్పగించారు.

తండ్రి అప్పు తీర్చలేదని కూతురిని వ్యాపారి కిడ్నాప్ చేశాడు. ప్రకాశం(D) చీమకుర్తి(M)కి చెందిన శ్రీనివాసరావు గతంలో బేల్దారి పనులకు తిరుపతి వెళ్లాడు. ఆ సమయంలో ఈశ్వర్ రెడ్డి నుంచి రూ.5లక్షలు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదు. దీంతో శ్రీనివాసరావు కూతురిని ఈశ్వర్ రెడ్డి కిడ్నాప్ చేశాడు. శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు రంగంలోకి దిగి ఈశ్వర్‌రెడ్డిని కావలి వద్ద పట్టుకున్నారు.

నెల్లూరులో పలు వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్ పదవులకు కలెక్టర్ ఆనంద్ రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు రూరల్/అర్బన్ ఓసీ మహిళకు, కోవూరు ఎస్టీ జనరల్, కావలి ఓసీ మహిళకు ఖరారైంది. ఆత్మకూరు ఓసీ జనరల్, ఉదయగిరి బీసీ జనరల్, సర్వేపల్లి ఓసీ జనరల్, రాపూరు బీసీ మహిళ, కందుకూరు ఎస్సీ మహిళకు అవకాశం దక్కింది. త్వరలోనే ఛైర్మన్ల పేరు వెల్లడించనున్నారు.

స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్లను తయారు చేశామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో జాతీయ పతాకాన్ని అయన ఆవిష్కరించారు.

నెల్లూరులోని కలెక్టరేట్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కలెక్టరేట్లో ఉన్న గాంధీజీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఆనంద్ పూలమాలలు వేసి, 100 అడుగుల స్తూపం వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో జిల్లా ప్రజలకి మెరుగైన పాలన అందించాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ కార్తీక్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవాళ నుంచి ప్రారంభం కాబోతుంది. నెల్లూరు జిల్లాలో సుమారు 642 ఆర్టీసీ బస్సులు ఉంటే.. వాటిలో 429 బస్సులు ద్వారానే ఈ పథకం అమలు కాబోతుంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లో మాత్రమే మహిళలు ఉచితంగా ప్రయాణం చేయనున్నారు. మిగిలిన సర్వీసులో ఎక్కితే చార్జీలు తీసుకుంటారు. గుర్తింపు కార్డు తప్పనిసరి.

భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నిశాఖల అధికారుల అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ ఆదేశించారు. డిజాస్టర్ మేనేజ్మంట్ కమిటీ సమావేశం గురువారం సాయంత్రం నిర్వహించారు. గతంలో ఏయే ప్రాంతాలు వర్ష ముంపునకు గురయ్యాయో ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆయన ఆదేశించారు.

పులివెందుల, ఒంటిమిట్టలో వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడంతో జగన్‌కు ప్రస్టేషన్ వచ్చిందని.. అదే ఊపులో మాట్లాడుతున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు సంతపేటలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తొలిసారి పులివెందుల, ఒంటిమిట్ట ఓటర్లు స్వేచ్ఛగా ఓటేశారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఓటర్లు గెలిపించారని కొనియాడారు. చంద్రబాబు వయస్సుకు జగన్ గౌరవం ఇవ్వాలని హితవు పలికారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కవాతు రిహార్సల్స్‌ను SP జి.కృష్ణకాంత్ పరిశీలించారు. పెరేడ్ బాగుందని, ఇదే స్పూర్తితో రేపు కూడా పెరేడ్ రెట్టింపు ఉత్సాహంతో చేయాలన్నారు. జెండా వందనానికి విచ్చేసే ముఖ్య అతిథి, అతిథులు గౌరవార్ధం ఇచ్చే వందన సమర్పణ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. భద్రతా పరంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.