India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి 1100 కాల్ సెంటర్‌ను ఉపయోగించుకోవాలని నెల్లూరు కలెక్టర్ ఆనంద విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులను, వాటి సత్వర పరిష్కారం కోసం కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పౌరుల సమస్యలను సంబంధిత విభాగాలకు పంపి సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 1100 కు ఉచితంగా కాల్ చేయవచ్చని వెల్లడించారు.

నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న ఓ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతి చెందిన విద్యార్థిని తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాసపాళెం గ్రామానికి చెందిన హేమశ్రీగా తెలుస్తోంది. తమ బిడ్డను తమకు తెచ్చివ్వాలంటూ తల్లిదండ్రుల ఆర్త నాదాలు అందరిని కన్నీరు పెట్టిస్తున్నాయి.

నెల్లూరు మైపాడు గేట్ సెంటర్ వద్ద స్మార్ట్ స్ట్రీట్‌లో భాగంగా కంటైనర్లతో 240 షాపులు అందుబాటులోకి తెస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. ‘తొలివిడతలో 120 షాపులు ప్రారంభిస్తాం. వీటిని మెప్మా మహిళలకు కేటాయిస్తాం. ఒక్కో షాప్ ఏర్పాటుకు రూ.4 లక్షలు అవుతోంది. మెప్మా ద్వారా రూ.2లక్షల సబ్సిడీ, బ్యాంకు ద్వారా రూ.2లక్షల లోన్ తీసిస్తాం. బ్యాంకు లోనులో రూ.లక్ష చొప్పున నేను సాయం చేస్తా’ అని నారాయణ హామీ ఇచ్చారు.

నెల్లూరు(D) ఉలవపాడు(M) చాకిచెర్ల సమీపంలో నిన్న జరిగిన <<17348140>>ఘోర ప్రమాదంలో <<>>మృతుల సంఖ్య ఐదుకు చేరింది. పల్నాడు(D) కొత్తగణేశునిపాడుకు చెందిన చిన వెంకటేశ్వర్లు తన పిల్లల పుట్టు వెంట్రుకలు తీయడానికి తుపాన్ వాహనంలో తిరుమలకు బయల్దేరారు. మార్గమధ్యలో వీరి వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన వెంకటేశ్వర్లు భార్య సుభాషిణి, కుమారుడు అభినవ్ కృష్ణ, తల్లి వెంకట నరసమ్మ, మామ శ్రీనివాసరావు, వదిన రుక్మిణి చనిపోయారు.

నెల్లూరు వెంకటేశ్వరపురంలోని భగత్ సింగ్ కాలనీలో శనివారం సాయంత్రం లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. CM చంద్రబాబు వర్చువల్ విధానంలో పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారాయణ లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందజేశారు. తొలి విడతలో 633 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చామని, మిగిలిన వారికి రెండో విడతలో ఇస్తామని నారాయణ అన్నారు.

చెల్లెలిపై ప్రేమతో ఆస్తులు, అంతస్తులు ఇచ్చిన ఘటనలు చూసింటాం. కానీ అకాల మరణం చెందిన చెల్లెలు కోసం గుడి కట్టిన ఘటన ఇది. వెంకటాచలం(M) కాకుటూరుకు చెందిన చెంచయ్య, లక్ష్మమ్మకు 5గురు సంతానం. వారిలో శివ ప్రసాద్, సుబ్బలక్ష్మి 2011లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సుబ్బలక్ష్మి చనిపోగా, శివ కోలుకున్నారు. చెల్లెలిని మరిచిపోలేని అన్న ఏకంగా గుడి కట్టి, చెల్లెలి విగ్రహాన్ని ప్రతిష్ఠించి రోజూ పూజలు చేస్తున్నారు.

రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన దేవస్థానం పాలకమండలి నియామకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఎట్టకేలకు 8 ఏళ్ల తరువాత దేవాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన 20 రోజుల్లోపు ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

నెల్లూరులో నామినేటెడ్ పదవుల సందడి మొదలు కాబోతోంది. ఆలయ పాలకమండలి ఛైర్మన్లకు, సభ్యులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, వేదగిరి నరసింహస్వామి దేవస్థానం, మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంతో పాటు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ఆలయ కమిటీలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో చైర్మన్ పదవులను, బోర్డు మెంబర్స్ పదవులను దక్కించుకునేందుకు ఆశావాహులు పోటీ పడుతున్నారు.

అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమకు ప్రతీకగా భావించే రాఖీ పండగ సందడి నెల్లూరులో మొదలైంది. ఎటు చూసినా అందమైన డిజైన్ల రాఖీలే దర్శనమిస్తున్నాయి. అన్నదమ్ములకు రాఖీలు కట్టేందుకు మహిళలు దుకాణాలకు క్యూ కట్టారు. దీంతో నెల్లూరులోని పలు దుకాణదారులు రాఖీల రేట్లు అమాంతం పెంచేశారు. రూ.30 నుంచి రూ.500 వరకు రాఖీల రేట్లు ఉన్నాయి. వెండి రాఖీలు సైతం మార్కెట్లో దర్శనమిస్తున్నాయి.

నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో బెయిల్ వచ్చింది. కనుపూరు చెరువులో అక్రమంగా గ్రావెల్ తవ్విన కేసులో అయన A1గా ఉన్నారు. ఈ కేసులో ఆయనకు గురువారం బెయిల్ మంజూరు చేస్తూ నాలుగో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. పోలీసుల విచారణకు సహకరించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ కేసులో ప్రస్తుతం ఆయన సెంట్రల్ జైలులో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.