India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విజయవాడలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లకు పరిపాలనకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించాలని తెలియజేశారు.
సంగం పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్లకు మూడో విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఏడుకొండలు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫిట్టర్ విభాగంలో సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈనెల 26వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. గ్రామాలలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధి హామీ సిబ్బందిని తొలగిస్తున్నారని నియోజకవర్గాలలో 700 మందిని ఇప్పటికే తొలగించినట్లు పేర్కొన్నారు. తొలగించిన సిబ్బందిని వెంటనే తిరిగి చేర్చుకోవాలని లేకుంటే నియోజకవర్గాల వారీగా పార్టీ తరఫున ప్రతి ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.
రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మొదటిసారి జరిగిన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఆనం మాట్లాడుతూ.. దేవాదాయ శాఖలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రక్షాళన చేయాలని ఆయన తెలిపారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో నెల్లూరు జిల్లా రెండో స్థానంలో నిలించింది. ఈ పోటీల్లో 13 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనగా విజయనగరం జట్టు మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రీడల్లో ప్రతిభ కనపరిచిన పలువురు విద్యార్థులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
నెల్లూరు క్లబ్ ఎన్నికలకు సంబంధించి పాలకవర్గ ఎన్నికల ప్రక్రియ వాడివేడిగా ప్రారంభమైంది. నెల్లూరు క్లబ్ సంబంధించి మొత్తం 18 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారి వసంత కృష్ణ ప్రసాద్ పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నట్లు ఆమోదముద్ర వేశారు. సోమవారం నామినేషన్ ఉపసంహరణ కార్యక్రమం జరగనుంది.
గూడూరు రైల్వే స్టేషన్‌కు దక్షిణంగా ఉన్న రైలు పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం పోలీసులు గుర్తించారు. ఘటనా ప్రదేశానికి వెళ్లి మృతుడిని గూడూరు ఇందిరమ్మ కాలానికి చెందిన నాగూర్‌గా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు చెప్పారు.
➽ YCP జడ్పీటీసీపై కేసు నమోదు
➽ పూలదొరువు విద్యార్థికి డాక్టరేట్
➽ నాయుడుపేటలో వ్యక్తి అనుమానాస్పద మృతి
➽ నెల్లూరు: డీటీలకు తహశీల్దార్లుగా పదోన్నతి
➽ నెల్లూరులో బెదిరింపు కాల్స్
➽ బుచ్చి: పసిపాపకు కమిషనర్ ఫిదా..
➽ ఎమ్మెల్యే సోమిరెడ్డిపై కాకాణి సెటైర్లు
➽ కోవూరు: వస్త్ర దుకాణంలో మహిళా దొంగలు
ఓ దినపత్రికలో నెల్లూరు జిల్లా ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న నయీమ్ ఖాన్ ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. తన మొబైల్ నంబరుకు ఆగంతకులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోన్ చెల్లించాలని, లేని పక్షంలో అసభ్యకర ఫొటోలు పంపిస్తామంటున్నారని వాపోయారు.
నెల్లూరులో ఈనెల 8వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వినయ్ కుమార్ తెలిపారు. ఆరోజు ఉదయం 10 గంటలకు నెల్లూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో శ్రీరామ్ ఫైనాన్స్, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంకు ప్రతినిధులు మేళా నిర్వహిస్తారన్నారు. ఏదైనా డిగ్రీ చదివి 18 – 30 సంవత్సరాల్లోపు వయసున్న వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు విద్యార్హత సర్టిఫికెట్లతో మేళాకు హాజరుకావాలని తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.