India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో డిప్యూటీ MROలుగా ఉన్న పలువురు MROలుగా పదోన్నతి పొందారు. వారిలో శైలకుమారి, శిరీష, శ్రీనివాసులు, హరికృష్ణ తిరుపతి జిల్లాకు వెళ్లారు. కృష్ణప్రసాద్ ఇందుకూరుపేటకు, లక్ష్మీనారాయణ అల్లూరుకు, శ్రావణ్ కుమార్ కావలికి, స్వర్ణ గుడ్లూరుకు, స్వప్న మర్రిపాడుకు, సారంగపాణి పొదలకూరుకు, సురేశ్ బాబు బోగోలుకు, కోటేశ్వరరావు దగదర్తి తహశీల్దార్లుగా పదోన్నతి పొందారు.
నెల్లూరు జిల్లాలో మరో వైసీపీ జడ్పీటీసీ సభ్యుడిపై కేసు నమోదైంది. కలువాయి చెరువులో చేపల అక్రమ వేటకు సంబంధించి జడ్పీటీసీ సభ్యుడు బులగాకుల అనిల్ కుమార్ రెడ్డితో పాటు మరో నలుగురిపై కేసు నమోదైంది. అక్రమ వేటపై వచ్చిన ఫిర్యాదుతో జులై 8న ఫిషరీస్ ఏడీ విచారణ జరిపారు. అప్పట్లో 20 మందిపై కేసు నమోదు కాగా తాజాగా మరో ఐదుగురిపై కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో అనిల్ కుమార్ రెడ్డి ఉన్నారు.
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు
శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నెల్లూరులోని వేదాయపాళెం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ శాంతిభద్రతలపై వారు సమీక్షించారు.
నెల్లూరు జిల్లాలో 12మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా పదోన్నతులు కల్పిస్తూ జిల్లా కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు డిప్యూటీ తహశీల్దార్లను తిరుపతి జిల్లాకు కేటాయించగా, మరో 9మందిని నెల్లూరు జిల్లాకు కేటాయించారు. వారు సంబంధిత జిల్లా కలెక్టర్ వద్ద రిపోర్టు చేసి సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
జిల్లాలో 42 మంది MROలకు పోస్టింగ్ ఇస్తూ కలెక్టరు కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు సిటీకి MROగా షఫీ మాలిక్, కోవూరు-నిర్మలనంద బాబా, బుచ్చి-వెంకటేశ్వర్లు, వెంకటాచలం-శ్రీనివాసులు, మనుబోలు-సుబ్బయ్య, టీపీ గూడూరు-పద్మజ, సంగం-సోమ్లా నాయక్, ఆత్మకూరు-సుధీర్, ఉదయగిరి-సుభద్ర, కొడవలూరు-స్ఫూర్తి, విడవలూరు-చంద్రశేఖర్, దుత్తలూరుకు MRO నాగరాజు నియమితులయ్యారు.
భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రాపూర్ సీఐ విజయకృష్ణ తెలిపారు. జూన్ నెలలో రాపూరు మండలం గోనుపల్లికి చెందిన రామచంద్రయ్య తన భార్య కవితను కుటుంబ కలహాల నేపథ్యంలో గొంతునులిమి హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాడు. కవిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా.. భర్తే నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వెల్లడించారు.
నెల్లూరులో జరిగిన అనుమానాస్పదమృతి కేసును పోలీసులు హత్యగా నిర్ధారించారు. సొంత తమ్ముడే అన్నను హత్య చేశాడని విచారణలో వెల్లడైంది. నెల్లూరు నగరంలోని తిప్పరాజువీధికి చెందిన బి.చంద్ర, ముత్యాలు దంపతులు తమ కుమారులు రాజేశ్(34), ఈశ్వర్‌తో కలిసి ఉంటున్నారు. గురువారం రాజేశ్ మద్యం ఫూటుగా తాగి ఇంటికి వెళ్లాడు. ఈక్రమంలో అన్నదమ్ముల మధ్య వివాదం నెలకొంది. ఈశ్వర్ చపాతి కర్ర, కత్తితో అన్న రాజేశ్‌పై దాడికి పాల్పడ్డాడు.
BSNL 4జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిందని జనరల్ మేనేజర్ ఎస్.పుగలేంది ఒక ప్రకటనలో తెలిపారు. అయినప్పటికీ చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ తమ మొబైల్ సేవలను 2జీ, 3జీ సిమ్ తో మాత్రమే ఉపయోగిస్తున్నారన్నారు. వినియోగదారులు 4జీకి అప్‌గ్రేడ్ చేసుకోవాలని తెలియజేశారు. ఈ ఉచిత సిమ్లను బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లోనూ, బీఎస్ఎన్ఎల్ ఫ్రాంచైజీలు, రిటైలర్లు, ఏజెంట్ల వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు.
పార్లమెంట్ పరిధిలోని పబ్లిక్ అండర్ టేకింగ్‌ల కమిటీ ( COPU) సభ్యుడిగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు ప్రభాకర్ రెడ్డి కమిటీ సభ్యుడిగా సేవలు అందించనున్నారు. సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో టీడీపీ కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రాభివృద్ధికి అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి బి.సి జనార్ధన్ రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి సమీక్ష జరిపారు. హాజరైన నెల్లూరు పార్లమెంట్ స్థాయి నేతలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులకు సూచించారు. సైకో పాలనలో ఐదేళ్లుగా రాష్ట్రం నిర్లక్ష్యానికి గురయ్యి అభివృద్ధి పడకేసిందన్నారు. తిరిగి రాష్ట్రాన్ని బాగు చేసుకుందామన్నారు.
Sorry, no posts matched your criteria.