India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిత్యం ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. అందులో భాగంగా ఆగస్టు 5న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, 6న హోం మంత్రి అనితతో కలిసి బీద రవిచంద్ర, 7న పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ 12న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వినతులు స్వీకరించేందుకు అందుబాటులో ఉంటారు.
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలోని ఎంకేఆర్ హైస్కూలు ప్రాంగణంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు జరగనున్నాయి. రోజూ సాయంత్రం 4 గంటల నుంచి ఫ్లడ్ లైట్ల వెలుగులో పోటీలు నిర్వహిస్తామని నిర్వాహకులు రవి, విజయ్ తెలిపారు. క్రీడాభిమానులు తరలి రావాలని కోరారు.
నెల్లూరు నగరంలోని 48వ డివిజన్ పొర్లుకట్ట ప్రాంతంలో పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇంటింటికీ తిరిగి నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెలకు రూ.4 వేల పింఛన్ అందజేసే ఏకైక రాష్ట్రం ఏపీ అని కొనియాడారు. ఆయన వెంట నగర కమిషనర్ సూర్యతేజ, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలోని ఓ గ్రామంలో చిన్నారిపై లైంగిక దాడికి యత్నించాడు. ఆరేళ్ల చిన్నారిపై కామాంధుడు ఈశ్వరయ్య అఘాయిత్యానికి పాల్పడ్డారు. జరిగిన విషయం చిన్నారి తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈశ్వరయ్యపై ఎస్ఐ రవిబాబు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నెల్లూరు జిల్లాలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో పలువురు సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ ఆశాఖ డీఐజీ కిరణ్ కుమార్ ఉత్త ర్వులు జారీ చేశారు. కోవూరు, ఆత్మకూరు, వెంకటగిరి స్థానాల్లో డిప్యుటేషన్‌పై గత కొంత కాలంగా పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్లను రెగ్యులర్ స్థానాలకు బదిలీ చేశారు. బదిలీ చేసిన సబ్ రిజిస్టర్లు వారి కేటాయించిన స్థానాల్లో విధులు నిర్వహించాలని సూచించారు.
నెల్లూరు(D) ఉలవపాడు యువకుడు ఒంగోలులో నర్సింగ్ చదువుతున్నాడు. అతని ప్రవర్తనను స్నేహితులు హేళన చేశారు. ఇదే సమయంలో అతడికి హిజ్రాలు పరిచయం కావడంతో ఇంటికి రావడం, తల్లిదండ్రలతో మాట్లాడటం మానేశాడు. మిస్సింగ్ కేసు ఉండటంతో నిన్న అతడిని ఉలవపాడు స్టేషన్‌కు తీసుకొచ్చారు. 150 మంది హిజ్రాలు అక్కడికి చేరుకుని గొడవ చేశారు. ఎవరితో వెళ్లాలి అనే నిర్ణయం అతడికి వదిలేయగా హిజ్రాలతో వెళ్లడంతో తల్లిదండ్రులు విలపించారు.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గురువారం తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ మొదలైంది. తొలిరోజే అందరికీ నగదు అందజేయాలన్న లక్ష్యంతో సచివాలయ అధికారులు ఉదయాన్నే ఇంటింటికీ తిరుగుతున్నారు. లబ్ధిదారులకు రూ.4 వేలు చొప్పున పింఛన్ ఇస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఖాజా నగర్ 6వ వార్డు టీడీపీ నాయకులు బచ్చా భాయ్, ఉస్మాన్ రహమద్ బాషా, షఫీతో కలిసి నగదు పంపిణీ చేశారు.
ఆగష్టు 1న పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నెల్లూరు 18వ డివిజన్ లోని ఆనం వెంకటరెడ్డి నగర్ లో గురువారం ఉదయం 7 గంటలకు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి స్వయానా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పెన్షన్లు అందజేయనున్నారు.
ఉన్నత విద్యను విదేశాలలో పొందేందుకు ఆర్థిక సహాయం కల్పించే కేంద్ర ప్రభుత్వ పథకం వివరాలను రాజ్యసభలో బుధవారం రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు కోరారు. కేంద్ర ప్రభుత్వంలోని సామాజిక న్యాయం, సాధికారత మంత్రి రాందాస్ అథవాలే సమాధానమిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈ పథకం అందిస్తారని చెప్పారు. గత ఆరు సంవత్సరాల్లో 457 మంది విద్యార్థులు లబ్ధి పొందినట్లు చెప్పారు.
వరికుంటపాడు మండలం తిమ్మా రెడ్డిపల్లి సమీపంలో బంతి తోటలో హీరోయిన్ల అశ్లీల చిత్రాలతో ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. భోగ్యంవారిపల్లికి చెందిన ఓ రైతు తన పొలంలోని పంటకు దిష్టి తగలకుండా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ తోట నేషనల్ హైవే పక్కనే ఉండటంతో అటుగా వెళ్లే ప్రయాణికులు ఈ ఫ్లెక్సీలను చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.