India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరులో పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణాల దరఖాస్తుల పై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి నారాయణ తెలియజేశారు. ఇందుకోసం ఆగస్టు 1వ తేదీన గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో రాష్ట్ర పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ విద్యుల్లత, ఇతర అధికారులతో పాటు తాను పాల్గొంటున్నట్లు తెలిపారు.
వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని సీతారామపురం డిఆర్ఓ కెవి ప్రసాద్ హెచ్చరించారు. ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉదయగిరి రేంజర్ ఉమామహేశ్వర్ రెడ్డి సూచనలతో సీతారామపురం మండలం చింతోడు, బోడసిద్ధాయపల్లి, గుండుపల్లి గ్రామాల ప్రజలకు అటవీ చట్టాలపై మంగళవారం అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న తమ దృష్టికి తీసుకురావాలని వారు సూచించారు.
నెల్లూరు నగరంలోని కార్పొరేషన్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి, దర్గామిట్ట సీఐ అల్తాఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఫోన్ నిందితుడు శివకృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం కోర్టుకు హాజరు పరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధించింది.
కావలి రూరల్ మండలం ఆముదాలదిన్నె వాసి ఉప్పాల శివ కోటయ్య మంగళవారం బెంగుళూరులో కారు ప్రమాదంలో మృతి చెందాడు. శివ కోటయ్య తెలుగుదేశం పార్టీకి వీర అభిమానిగా, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానిగా గ్రామంలో సుపరిచితుడు. కుటుంబ సభ్యులు హుటాహుటీన బెంగుళూరుకు తరలి వెళ్లారు. విషయం తెలుసుకున్న పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
చిల్లకూరు మండలం ఓ గ్రామంలోని బాలికపై <<13737798>>వృద్ధుడు<<>> అత్యాచారయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ గ్రామంలో ఓ విద్యార్థిని ఒకటో తరగతి చదువుతోంది. ఇంటర్వెల్ సమయంలో బడి బయటకు వచ్చిన పాపను 70 ఏళ్ల వృద్ధుడు ఇంటికి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పొక్సో కేసు నమోదు చేశారు.
నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఈవోలు సస్పెండ్ అయ్యారు. జొన్నవాడ దేవస్థానంలో ఈఓగా పనిచేసిన వెంకటేశ్వర్లు, గిరి కృష్ణ, కందుకూరు గ్రూప్ ఆఫ్ టెంపుల్ ఈవోలు జానకమ్మ, కెవిఎ ప్రసాద్, ఇరుగాలమ్మ గుడి ఈవో మల్లికార్జున్ రెడ్డి సస్పెండ్ అయినవారిలో ఉన్నారు.
బుచ్చిరెడ్డిపాలెం జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో నిధుల దుర్వినియోగంపై అధికారులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు. గతంలో ఈఓలుగా పనిచేసిన గిరి కృష్ణ, వెంకటేశ్వర్లును సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. సమాచారం లేకుండా హెడ్ క్వార్టర్స్‌ను వదిలి వెళ్లకూడదని ఆదేశించారు.
సూళ్లూరుపేట సమీపంలో నాయుడుపేట- సూళ్లూరుపేట హైవేపై టోల్‌ప్లాజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందువైపు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. హైవే పోలీసులు ఇక్కడికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూశారు. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు రొట్టెల పండగకు చెన్నైకి చెందిన వృద్ధ దంపతులు వచ్చారు. డబ్బు, ఫోన్లు పోగొట్టుకున్నారు. చెన్నైకి వెళ్లేందుకు ఛార్జీకి డబ్బు కోసం భిక్షాటనకు సిద్ధపడ్డారు. గుర్తించిన హెడ్ కానిస్టేబుల్ మస్తాన్ వృద్ధులకు భోజనం పెట్టి మరో రూ.500 ఇచ్చి చెన్నైకి పంపించారు. జరిగిన విషయాన్ని కుమారుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రంజన్‌కు వివరించారు. కుమారుడు జరిగిన విషయం నగదు ఇచ్చి ఎస్పీ జి.కృష్ణకాంత్‌కు లేఖ రాశారు.
మైనర్ బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు మైనర్ యువకులపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నాయుడుపేట మండల పరిధిలోని ఓ గిరిజన కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్ బాలురులు బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లి పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేసింది. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.