Nellore

News February 2, 2026

నెల్లూరు: ఈ స్కూటీ దొంగ మీకు తెలుసా..?

image

చిత్తు కాగితాలు ఏరుకునే ఓ వ్యక్తి కొడవలూరు మండలం గండవరం గ్రామంలో 29వ తేదీన స్కూటీని దొంగలించినట్లు కొడవలూరు ఎస్సై కోటిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యక్తి స్కూటీని అపహరించినట్లు CC ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరికైనా తెలిస్తే వెంటనే 9440796328 ఫోన్ నెంబర్‌కి సమాచారం అందించాలని కోరారు.

News February 2, 2026

కందుకూరు: నేడు కూడా పాత రేట్ల ప్రకారమే భూముల రిజిస్ట్రేషన్

image

ఫిబ్రవరి 1 నుంచి భూముల మార్కెట్ విలువ పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో జనవరి 31 తేదీ వరకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కిటకిటలాడాయి. అయితే అందుకు సంబంధించిన GO ఇంకా రాకపోవడంతో పాత రేట్ల ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జీవో రావడానికి ఇంకో రెండు రోజులు సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. 31వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేయించుకోలేని వాళ్లు భలే ఛాన్సులే అని సంబరపడుతున్నారు.

News February 2, 2026

నెల్లూరు జిల్లాకు కొంత ఊరట.. కొంత నిరాశ!

image

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఈసారి నెల్లూరు జిల్లాకు నిరాశే మిగిలింగి. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వేలైన్, మరే కొత్తదానికి అదనంగా నిధులు ఇవ్వలేదు. చెన్నై-బెంగళూరు కారిడార్(CBIC) పరిధిలోని నెల్లూరు క్రిస్ సిటీని రూ.621Crతో రాష్ట్రప్రభుత్వం డెవలప్ చేస్తుంది. ఇప్పటికే రూ.531 Crను కేంద్రం విడుదల చేసింది. మిగిలిన పనుల పూర్తికి రూ.90 Cr కేటాయించే అవకాశం ఉంది.

News February 2, 2026

ఆత్మకూరు: ప్రేమిస్తున్నట్లు చెప్పి.. గర్భవతిని చేసి..

image

ఆత్మకూరులోని ఉలవదిబ్బ ప్రాంతంలో నివసించే సంతోష్ అనే యువకుడిపై పోలీసులు ఫొక్సో కేసు నమోదు చేశారు. గుంతకల్లుకు చెందిన సంతోష్ ఆత్మకూరులో బేల్దారు పనిచేస్తూ ఉంటాడు. వారి సమీపంలో ఉండే ఇంటర్ చదివే ఓ దళిత యువతిని ప్రేమిస్తున్నట్టు చెప్పి గర్భవతి చేశాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా ఎస్సై జిలానీ విచారణ జరిపి సంతోష్‌పై ఫొక్సో కేసు నమోదు చేశారు.

News February 2, 2026

కావలి: మందుకు బానిసై.. రైలు కిందపడి వ్యక్తి సూసైడ్

image

కావలి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉదయగిరి బ్రిడ్జి సమీపంలో మద్యానికి బానిసై ఓ వ్యక్తి రైలు కిందపడి వ్యక్తి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. జలదంకి మండలం అన్నవరానికి చెందిన కలిచేటి మాధవ(52) మద్యానికి బానిసయ్యాడు. మద్యాన్ని మానకపోవడంతో కుటుంబసభ్యుల మధ్య గొడవ జరిగేది. ఆదివారం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి మృతి చెందాడు. రైల్వే ఎస్సై వెంకట్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 2, 2026

నెల్లూరు: సెమీకండక్టర్స్ తయారీకి అపారమైన నిల్వలు

image

కేంద్ర బడ్జెట్లో సెమీకండక్టర్స్ మిషన్ 2.O కింద రూ. 40 వేల కోట్లను కేటాయించింది. అయితే సెమీకండక్టర్స్ తయారీలో అవసరమైన ముఖ్యమైన ఖనిజం సిలికాన్. జిల్లాలోని చిల్లకూరు మండలంలో అపారమైన సిలికా గనులు నెలకొన్నాయి. దీంతో సెమీ కండక్టర్స్ తయారీలో వీటి ఉపయోగం అపారంగా ఉండడంతో జిల్లాకు మరింత ఆదాయ వనరుగా మారనుందనేది తెలుస్తోంది.