Nellore

News May 31, 2024

వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు

image

NLR: అపార్ట్‌మెంట్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తోన్న వ్యభిచార కేంద్రంపై నెల్లూరు దర్గామిట్ట పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకురాలితో పాటు ముగ్గురు విటులను అరెస్ట్ చేశారు. నెల్లూరు నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంకు ప్రాంతానికి చెందిన శ్రీలత 9 నెలల క్రితం టెక్కేమిట్టలోని ఓ అపార్ట్‌మెంట్లో ఫ్లాటు అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్ అల్తాఫ్ హుస్సేన్ దాడి చేశారు.

News May 31, 2024

సూళ్లూరుపేట ఘటనపై మహిళా కమిషన్ సీరియస్

image

సూళ్లూరుపేటలో స్నేహితుడిని కట్టేసి యువతిపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి సీరియస్ అయ్యారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్‌తో మాట్లాడి.. యువతికి ప్రభుత్వ వసతి సదుపాయం కల్పించి, కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు.

News May 30, 2024

నిప్పుల కొలిమిలా నెల్లూరు

image

భానుడు ప్రతాపంతో నెల్లూరు జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఎండ తీవ్రతతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. మధ్యాహ్నం సమయానికే రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వృద్ధులు చిన్నారులు ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా నెల్లూరులో ఈరోజు 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News May 30, 2024

నెల్లూరు: 75 మార్కులు వచ్చినా ఫెయిల్

image

కష్టపడి పదో తరగతి పరీక్షలు రాసిన ఓ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన కుషల్ శ్రీనివాస్ ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. అన్ని సబ్జెక్టుల్లో 90కి పైగా మార్కులు వచ్చాయి. హిందీలో 15 మార్కులే వచ్చాయి. రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోగా 75 మార్కులు వచ్చాయి. మెరుగైన మార్కులు వచ్చినా ఫెయిల్ చేయడంపై విద్యార్థి తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

News May 30, 2024

నెల్లూరు: విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు: SP

image

ఎన్నికల ఫలితాల రోజు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. వాట్సప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే మెసేజ్‌లు పంపితే గ్రూప్ అడ్మిన్ మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరు గెలిచినా పాజిటివ్‌గా ఉండాలని అన్నారు. అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని అన్నారు.

News May 30, 2024

అనంతసాగరం: పెన్నా నదిలో మృతదేహం లభ్యం

image

అనంతసాగరం మండలం, సోమశిలలోని శివాలయం ఎదురుగా ఉన్న పెన్నా నదిలో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహం వద్ద ఆధార్ కార్డు లభ్యం అవ్వడంతో మృతురాలిది కడప జిల్లా, రాజంపేట మండలం, బాలరాజుపల్లికి చెందిన పంగ అంకన్నగారి చెన్నమ్మ (74) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

ఆరో రౌండ్‌తో తేలనున్న పొదలకూరు లెక్క

image

సర్వేపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో పొదలకూరు మండలం హాట్ టాపిక్ గా మారింది. ఈ మండలమే విజేత ఖరారులో కీలకం కానుంది. పొదలకూరు మండలంలో 73 పోలింగ్ కేంద్రాలున్నాయి. సూరాయపాళెంతో మొదలై బ్రాహ్మణపల్లి ఈవీఎంతో ఈ మండలం కౌంటింగ్ ముగుస్తుంది. ఐదు రౌండ్ల వరకు పూర్తిగా పొదలకూరు మండలానికి సంబంధించిన ఈవీఎంల కౌంటింగే జరుగుతుంది. ఆరో రౌండ్ కు కేవలం మూడు ఈవీఎంలు మిగులుతాయి.

News May 30, 2024

నెల్లూరు: ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై స్నేహితుడి అత్యాచారం

image

ప్రేమికుడిని కట్టేసి, ప్రియురాలిపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన సూళ్లూరుపేటలో జరిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన యువతి, యువకుడు ప్రేమించుకుంటున్నారు. యువకుడికి ఏడుమలై, బాలాజీ అనే స్నేహితులున్నారు. ఆ యువతి జన్మదినం సందర్భంగా.. గుడికి వెళ్దామని చెప్పి మార్గమధ్యంలో ఏడుమలై, బాలాజీ కలిసి ఆ యువకుడి చొక్కాతో అతణ్ని కట్టేశారు. బాలాజీ కాపలాగా ఉండగా ఏడుమలై యువతిని (20) బెదిరించి అత్యాచారం చేశాడు.

News May 30, 2024

నెల్లూరు: వేర్వేరు ఘటనల్లో ఈత కొడుతూ ఇద్దరి దుర్మరణం

image

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. విడవలూరు(M) వెంకటనారాయణపురం వాసి మురళీకృష్ణ స్నేహితులతో కలిసి పైడేరువాగు వంతెన వద్ద ఈతకొడుతూ నీటిలో మునిగి మృతిచెందాడు. ఇందుకూరుపేట(M), రాముడుపాలేనికి చెందిన రామయ్య,గీతల కుమార్తె భవ్యశ్రీ(12) నెల్లూరు వెంగళరావునగర్‌లో గల స్విమ్మింగ్‌ఫూల్‌లో ఈతకొడుతూ నీటిలో మునిగిపోయింది. బాలికను సిబ్బంది బయటకుతీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

News May 30, 2024

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని నెల్లూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీవ్ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ జిల్లా ఎన్నికల అధికారులతో ఎన్నికల ఓట్ల లెక్కింపు, లా అండ్ ఆర్డర్ సమస్యలు తదితర అంశాలపై ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు కలెక్టర్ అందులో పాల్గొని పలు అంశాలను వివరించారు.