Nellore

News July 28, 2024

మనుబోలులో వ్యక్తిపై కత్తులతో దాడి.. పరిస్థితి విషమం

image

మనుబోలు గ్రామానికి చెందిన మొలకల శశిధర రెడ్డిపై గూడూరు మండలం వెందోడు గ్రామానికి చెందిన మద్దాలి హర్ష వర్ధన్ రెడ్డి తన స్నేహితులతో కలిసి కత్తులతో దాడికి పాల్పడ్డారు. దీంతో శశి ధరరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దాడికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News July 28, 2024

పొదలకూరు పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

image

తమకు ప్రాణహాని ఉందని మమ్మల్ని రక్షించాలంటూ ఓ ప్రేమజంట పొదలకూరు పోలీసులను ఆశ్రయించింది. ప్రేమికులు దిండు మనోజ్, పులి మాధురి మాట్లాడుతూ.. పదేళ్లుగా ప్రేమించుకొని గూడూరులోని నరసింహస్వామి దేవస్థానంలో పెళ్లి చేసుకున్నామన్నారు. తమ తల్లిదండ్రులు ఏ క్షణంలోనైనా దాడి చేసి హత్య చేస్తారన్న భయంతో పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించామన్నారు. ఎస్పీ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని ప్రేమ జంట కోరింది.

News July 28, 2024

గొప్పలు కాదు.. దాడులు అరికట్టండి: వైసీపీ

image

నెల్లూరు జిల్లాలో అత్యాచార ఘటనపై వైసీపీ మండిపడింది. ‘కావలిలో 9 సంవత్సరాల బాలికపై మహబూబ్ బాషా అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను గాలికొదిలేశారు. మీకు మీరు డబ్బా కొట్టుకుంటూ గొప్పలు చెప్పుకోవడం కాదు. రాష్ట్రంలో పసిపిల్లలు, మైనర్ బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టండి’ అంటూ ట్వీట్ చేసింది.

News July 28, 2024

మెము రైళ్లు రద్దు

image

విజయవాడ, బిట్రగుంట మధ్య ప్రయాణించే మెము రైళ్లను ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు జులై 29 నుంచి ఆగస్టు 2 వరకు నం.07978 విజయవాడ-బిట్రగుంట, నం.07977 బిట్రగుంట-విజయవాడ రైలును జులై 29 నుంచి ఆగస్టు 4 వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.

News July 28, 2024

చుంచు ఎలుక కరచి వ్యక్తి మృతి.. నెల్లూరు జిల్లాలో ఘటన

image

నెల్లూరు రూరల్ మండలం ములుమూడిలో చుంచు ఎలుక కరచి మణికాల రాగయ్య (55) అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. మంచంపై నిద్రిస్తుండగా ఎలుక కాలు, చేతిపై కరిచింది. కుటుంబసభ్యులు వెంటనే అతనిని స్థానిక సౌత్ మోపూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడ నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.

News July 28, 2024

కావలి పరిధిలో బాలికపై అత్యాచారం.. కేసు నమోదు

image

కూతురు వయసున్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కావలి నియోజకవర్గంలో జరిగింది. బాలిక ఇంటికి తరచూ వస్తూ పోతున్న మృగాడు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కావలి రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 28, 2024

సోమిరెడ్డి పై విచారణ జరిపించాలి: కాకాని

image

సీఎం చంద్రబాబు తమపై విచారణ జరిపించడంతో పాటు, సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకుపై కూడా విచారణ జరిపించేందుకు సిద్ధంకావాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. SNJ డిస్టీలరీస్‌ను సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు తాను ప్రారంభించారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే టీడీపీ ప్రభుత్వంలోనే ఇది ప్రారంభమైందన్నారు. ఎవరు లైసెన్స్ ఇచ్చారనే విషయాన్ని సోమిరెడ్డి తెలుసుకోవాలన్నారు.

News July 27, 2024

సోమిరెడ్డి పై విచారణ జరిపించాలి: కాకాని

image

సీఎం చంద్రబాబు తమపై విచారణ జరిపించడంతో పాటు, సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకుపై కూడా విచారణ జరిపించేందుకు సిద్ధంకావాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. SNJ డిస్టీలరీస్‌ను సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు తాను ప్రారంభించారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే టీడీపీ ప్రభుత్వంలోనే ఇది ప్రారంభమైందన్నారు. ఎవరు లైసెన్స్ ఇచ్చారనే విషయాన్ని సోమిరెడ్డి తెలుసుకోవాలన్నారు.

News July 27, 2024

సోమశిల, కండలేరు జలాల విడుదల చేయాలి: సోమిరెడ్డి

image

సోమశిల, కండలేరుకు కృష్ణాజలాల విడుదలకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి లేఖ రాశారు. 146 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన సోమశిల, కండలేరులో నీటినిల్వలు 9.6 టీఎంసీలు 6.19 టీఎంసీలకు చేరుకున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతున్న నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సోమశిల, కండలేరుకు నీటిని తరలించాలని కోరారు.

News July 27, 2024

నెల్లూరు: రేపటి నుంచి ఏపీపీయస్సీ పరీక్షలు

image

నెల్లూరు నగర సమీపంలోని పొట్టేపాలెం వద్ద అయాన్ డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రంలో ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిపార్ట్మెంటల్ పరీక్షలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు డిఆర్ఓ లవన్న తెలిపారు. శనివారం నెల్లూరు కలెక్టరేట్లో ఎస్ ఆర్ శంకరన్ హాలులో డిపార్ట్మెంటల్ పరీక్షల కోసం ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ పరీక్షపై సమన్వయ అధికారులతో మాట్లాడారు.