Nellore

News February 24, 2025

కావలిలో మున్సిపల్ కార్మికుల పోస్ట్ కార్డులు ఉద్యమం

image

కావలి మున్సిపల్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు ద్వారా అప్కాస్ రద్దు, ప్రైవేటు ఏజెన్సీ వద్దని, తమను పర్మినేoట్ చేయాలని కోరుతూ సోమవారం కార్మికులు పోస్ట్ కార్డులు ప్రదర్శిస్తూ ఉద్యమాన్ని చేపట్టారు.  సీఐటీయూ నేత పి.పెంచలయ్య మాట్లాడుతూ.. గతంలో ప్రైవేటు కాంట్రాక్టులో ఉన్నప్పుడు కార్మికులు జీతాల కొసం ఇబ్బందులు పడ్డారన్నారు. మళ్లీ సీఎం ఆ నిర్ణయాన్ని అమలు చేయడం మంచిది కాదని అన్నారు.

News February 24, 2025

అసెంబ్లీలో జగన్ లేకపోతే సందడే లేదు: MLA సోమిరెడ్డి

image

పులివెందులలో ఓడిపోతాననే భయంతోనే జగన్ అసెంబ్లీకి వస్తున్నారని MLA సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి 60 రోజులు రాకపోతే సభ్యత్వం రద్దవుతుందనే భయం జగన్‌కు ఉందని, అసెంబ్లీలో ఆయన లేకపోతే సందడే లేదన్నారు. ఓ వైపు జగన్, మరోవైపు కాకాణి పదే పదే బట్టలిప్పుతాన్నంటున్నారని హో మంత్రి వారి మీచ చర్యలు తీసుకోవాలన్నారు. జగన్ కేవలం ఫ్లోర్ లీడర్ అన్న సోమిరెడ్డి.. ఆయనకు దురాశ పనికి రాదని ఎద్దేవా చేశారు.

News February 24, 2025

నెల్లూరు: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

image

భార్య పుట్టింటికి వెళ్లిందన్న మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు నగరం కపాడిపాలెంలో చోటుచేసుకుంది. కపాడిపాలెంకు చెందిన శ్రావణ్ కారు డ్రైవర్‌గా భార్య సుమాంజలి నర్స్‌గా పని చేస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం. ఇటీవల వారి మధ్య చిన్నపాటి గొడవ జరగ్గా భార్య పుట్టింటికి వెళ్లింది. మనస్తాప చెందిన శ్రావణ్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

News February 24, 2025

నెల్లూరు: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 మెయిన్స్

image

నెల్లూరు జిల్లాలో ఆదివారం జరిగిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఎగ్జామ్స్ కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ తిరుమణి శ్రీపూజ తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మొత్తం 7 కేంద్రాలలో జరిగిన పరీక్షలకు 86.4% మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 4102 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 3546 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 556 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.

News February 23, 2025

నెల్లూరు నుంచి గ్రూప్-2కు తక్కువగా హాజరైన అభ్యర్ధులు.!

image

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షలకు 13 జిల్లాల్లో 92 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే అత్యధికంగా విశాఖ జిల్లా వారు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా నుంచి అత్యల్పంగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలో 3546 మంది పరీక్షలకు హాజరై 86.4గా నమోదైన సంగతి తెలిసిందే. పరీక్షలు జరుగుతాయా.. లేదా అన్న మీమాంస కూడా పరీక్షకు రాకపోవడానికి ఓ కారణమని కొందరు భావిస్తున్నారు.

News February 23, 2025

నెల్లూరు: ప్ర‌శాంతంగా ముగిసిన CM ప‌ర్య‌ట‌న

image

నెల్లూరులోని వీపీఆర్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ఆదివారం టీడీపీ నాయకుడు బీద ర‌విచంద్ర కుమారుడి వివాహం జ‌రిగింది. ఈ వేడుక‌కు సీఎం చంద్ర‌బాబు నాయుడు ముఖ్య అతిథిగా వచ్చారు ఈ సంద‌ర్భంగా నెల్లూరులో జిల్లా ఎస్పీ ప‌టిష్ఠ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేశారు. దీంతో అంద‌రికీ జిల్లా ఎస్పీ దన్యవాదాలు తెలియ‌జేశారు.

News February 23, 2025

నెల్లూరులో చికెన్ ధరలు ఇవే..

image

బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో చికెన్ ధరలు తగ్గిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాలలో చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. బ్రాయిలర్ ధర రూ.93 ఉండగా, స్కిన్ లెస్ చికెన్ ధర రూ.190గా ఉంది. అదే విధంగా లేయర్ చికెన్ ధర రూ.127గా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. మీ ఊరిలో ధరలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.

News February 23, 2025

నేడు నెల్లూరుకు రానున్న CM

image

CM చంద్రబాబు ఆదివారం నెల్లూరుకు రానున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 12.10 గంటలకు కనుపర్తిపాడు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు హెలీకాప్టర్‌లో చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి గొలగమూడి సమీపంలోని వీపీఆర్‌ కన్వెన్షన్‌లో టీడీపీ నాయకుడు బీద రవిచంద్ర కుమారుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి హెలీప్యాడ్‌ చేరుకుని 2.15 గంటలకు ఉండవల్లి చేరుకుంటారు.

News February 23, 2025

నెల్లూరు:‘ఇంటర్ పరీక్షలు పక్కాగా నిర్వహించండి’

image

మార్చి 1వ తేదీ నుంచి జిల్లాలో ప్రారంభం కానున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలని నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ్ భాస్కర్ అన్నారు. శనివారం డీకే బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీఫ్, అడిషనల్ చీఫ్ సూపరిటెండెంట్ డిపార్ట్మెంట్ అధికారుల శిక్షణ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆర్ఐఓ శ్రీనివాసులు మాట్లాడుతూ.. 53,200 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారన్నారు.

News February 23, 2025

శ్రీరాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి

image

నెల్లూరు నగరం దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శనివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి హరిహరనాథ్ శర్మ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించుకున్నారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుందరేశ్వర స్వామిని దర్శించారు. అనంతరం అమ్మవారికి నవావరణ పూజ నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.