Nellore

News February 22, 2025

నెల్లూరు జిల్లాలో ఇలాళ్టి ముఖ్య ఘటనలు

image

✒ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథం: నెల్లూరు కలెక్టర్
✒ త్వరలోనే కొత్త రేషన్ కార్డుల మంజూరు: మంత్రి నాదెండ్ల
✒ కందుకూరు: RTCబస్‌లోనే అనంత లోకాలకు
✒ నెల్లూరులో 40 కిలోల వెండి స్వాధీనం
✒ బుచ్చి గోదాములో మంత్రుల తనిఖీలు
✒ నెల్లూరు: మహిళా అధికారుల ఫైట్ (వీడియో)
✒ నెల్లూరు జిల్లా ఎస్పీ హెచ్చరిక
✒ కావలిలో బాలికను వేధించిన నిందితుడికి జీవిత ఖైదు
✒ నెల్లూరు: వెబ్ ‌సైట్లో ఇంటర్ హాల్ టికెట్లు

News February 22, 2025

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథం: కలెక్టర్ 

image

నెల్లూరులో రేపు(ఆదివారం) గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుందని ఆయన తెలిపారు. అభ్యర్థులు 15 నిమిషాలు ముందే పరీక్షా కేంద్రానికి రావాలని కోరారు. 

News February 22, 2025

పెంచలకోన నరసింహ స్వామికి విశేష పూజలు

image

రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. 

News February 22, 2025

నెల్లూరు: గ్రూప్-2 పరీక్షలకు 7 పరీక్ష కేంద్రాలు కేటాయింపు

image

ఈనెల 23న ఆదివారం జరగనున్న గ్రూప్-2 పరీక్షలకు జిల్లాలో ఏడు పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ భాస్కరరావు తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ -1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ -11 పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలు, చిరునామాను తెలుసుకునేందుకు 0861 2331261 కంట్రోల్ రూమ్ నంబర్ ఏర్పాటు చేశామన్నారు.

News February 22, 2025

నెల్లూరు: వెబ్ ‌సైట్లో ఇంటర్ హాల్ టికెట్లు 

image

ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల హాల్ టికెట్లను వెబ్సైట్లో వచ్చినట్లు జిల్లా ఇంటర్ ఆర్ఐవో ఆదూరు శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. https@//bie.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి కానీ, విద్యార్థి ఆధార్ కార్డు నంబర్, డేట్ ఆఫ్ బర్త్ మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 నుంచి కూడా హాల్ టికెట్లను విద్యార్థులు పొందవచ్చు అన్నారు.

News February 22, 2025

కావలిలో బాలికను వేధించిన నిందితుడికి జీవిత ఖైదు

image

బాలికను వేధించిన కేసులో నిందితుడికి జీవితఖైదు, రూ.27వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు జిల్లా పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్చునిచ్చారు. కావలిలోని ఓ బట్టల షాపులో పనిచేసే బాలికకు సాయి కిషోర్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిశాడు. అనంతరం దారుణంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక కుటుంబసభ్యులు కావలి పోలీసులకు 2017లో ఫిర్యాదు చేశారు. కేసు విచారించి జడ్జి శిక్ష ఖరారు చేశారు.

News February 21, 2025

నెల్లూరుకు చేరుకున్న మంత్రి నాదెండ్ల 

image

మంత్రి నాదెండ్ల మనోహర్ కాసేపటి క్రితం నెల్లూరకు చేరుకున్నారు. ఆయనకు టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్‌తోపాటూ పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు స్వాగతం పలికారు. మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తువాత నెల్లూరుకు రావడం ఇదే తొలిసారి. ఈ మేరకు ఆయన 22న సంగం మండలంలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. 

News February 21, 2025

పెంచలకోన నరసింహస్వామి సన్నిధిలో మంత్రి ఆనం

image

రాపూరు మండలం పెంచల లక్ష్మీనరసింహస్వామిని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. వారితోపాటు వెంకటగిరి ఎమ్మెల్యే కుడిగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

News February 21, 2025

నిన్ను మిస్ అవుతున్నా గౌతమ్: జగన్

image

ఇవాళ మాజీ మంత్రి, దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి మూడో వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ‘నా ప్రియ మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి 3వ వర్ధంతి సందర్భంగా నేను ప్రేమగా స్మరించుకుంటున్నాను. నేను నిన్ను మిస్ అవుతున్నాను, గౌతమ్’. అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

News February 21, 2025

నెల్లూరు: స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా, తడ మండలం బోడి లింగాలపాడు వద్ద జాతీయ రహదారిపై విద్యార్థులను తీసుకెళ్తున్న నారాయణ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా.. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ప్రాణాపాయం లేకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.