Andhra Pradesh

News March 16, 2024

జిల్లాలో 5 ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

అనంతపురం జిల్లాలో 5 ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయినట్లు ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన స్థానంలో వాతావరణం విభాగం శాస్త్రవేత్త నారాయణస్వామి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తాడిపత్రి మండలంలోని తేరన్నపల్లిలో 41.22, హుస్సేన్ పురం 40.29, కళ్యాణదుర్గం 40.16, విడపనకల్లు 40.12, యల్లనూరు 39.90 ఉష్ణోగ్రత నమోదు అయిందన్నారు. ఎండాకాలంలో తగిన జాగ్రత్తలు చేపట్టాలన్నారు.

News March 16, 2024

బీజేపీలో చేరిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు

image

రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి శనివారం విజయవాడలో బీజేపీలో చేరారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాపు రామచంద్రారెడ్డితో పాటు ఆయన సతీమణి కాపు భారతి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

News March 16, 2024

ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు ఎమ్మెల్యే

image

నెల్లూరు నగర శాసనసభ్యుడు డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ను నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఇప్పటికే ఆయన నరసరావుపేటలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 2008లో కార్పొరేటరుగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014, 19 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ సారి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవబోతున్నారు.

News March 16, 2024

కుప్పంలో చంద్రబాబుపై భరత్ గెలుస్తాడా…?

image

వైసీపీ కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్‌జె.కె.భరత్‌ను అధికారికంగా శనివారం నియమించారు. 2019 ఎన్నికల్లో ఆయన తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి చంద్రబాబుపై పోటీ చేసి ఓడిపోయారు. ఆయన మరణాంతరం కుమారుడు భరత్‌కు సీఎం జగన్ నియోజకవర్గ బాధ్యతలు ఎమ్మెల్సీ పదవీ కట్టబెట్టారు. 2024 ఎన్నికల్లో భరత్ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొననున్నారు.

News March 16, 2024

ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేపథ్యం

image

ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి మండలం తుమ్మలగుంటలో 1973లో జన్మించారు. ఏపీ అభివృద్ధిలో PhD పూర్తి చేశారు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి సహకారంతో 2007లో తుడా ఛైర్మన్ గా పనిచేశారు. 2014లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి తొలిసారి వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే తిరిగి ఎన్నికయ్యారు. ఇప్పుడు ఒంగోలు ఎంపీగా పోటీ చేయనున్నారు.

News March 16, 2024

రెండోసారి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్ప

image

చిత్తూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా రెండోసారి రెడ్డప్పను అధిష్ఠానం ఖరారు చేసింది. 2019 ఎన్నికలలో ఆయన ఎంపీగా గెలుపొందారు. ఈయన పుంగనూరు నియోజకవర్గం సోమల మండలానికి చెందినవారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడు. గతంలో లీడ్ క్యాప్ ఛైర్మన్‌గా పనిచేశారు. రెండోసారి ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 16, 2024

తూ.గో.: ‘చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం’

image

కాపునేత ముద్రగడ పద్మనాభంపై ఏపీ కాపు సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీరాములు నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపు కులద్రోహిగా.. చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం మిగిలిపోతారని దుయ్యబట్టారు. ఏ షరతు లేకుండా వైసీపీ కండువా కప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాపుల ఎదుగుదల కోరుకునే వారు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలని హితవు పలికారు.

News March 16, 2024

BREAKING: చంద్రబాబుతో మాజీ మంత్రి గంటా భేటీ

image

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళగిరి పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఇంకా టికెట్ ఖరారు కాని నేపథ్యంలో చంద్రబాబును కలిసి విశాఖ జిల్లాలోని టిక్కెట్ కేటాయించాలని గంటా కోరినట్లు ప్రచారం జరుగుతుంది. ఇంతకుముందు చీపురుపల్లిలో పోటీ చేయాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 16, 2024

ఏలూరు: ‘చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం’

image

కాపునేత ముద్రగడ పద్మనాభంపై ఏపీ కాపు సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీరాములు నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపు కులద్రోహిగా.. చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం మిగిలిపోతారని దుయ్యబట్టారు. ఏ షరతు లేకుండా వైసీపీ కండువా కప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాపుల ఎదుగుదల కోరుకునే వారు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలని హితవు పలికారు.

News March 16, 2024

శ్రీకాకుళం: అంతరాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ఠ నిఘా

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ తెలిపారు. ఒడిశా సరిహద్దు వెంబడి దాదాపు 112 కి.మీ మేర శ్రీకాకుళం జిల్లా ఉందని, ఇరు రాష్ట్రాల మధ్య జిల్లా వెంబడి 52 రహదారుల ద్వారా రాకపోకలు జరుగుతున్నాయని వీటిలో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇవి కాకుండా నిరంతరం పెట్రోలింగ్ బృందాలు తిరుగుతున్నాయని అన్నారు.