Prakasam

News September 12, 2024

ప్రకాశం జిల్లా నేటి TOP NEWS

image

➤ దోర్నాల మండలంలో పర్యటించిన ప్రకాశం జిల్లా కలెక్టర్
➤ ఆసుపత్రిలో తల్లి మృతి.. బిడ్డను అమ్మేసిన తండ్రి
➤ కనిగిరి: రూ.66 వేలు పలికిన లడ్డూ
➤ కురిచేడు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
➤ కొత్తపట్నం: నమ్మించి సహజీవనం.. మరో పెళ్లిక యత్నం
➤ గిద్దలూరు: గణేష్ లడ్డూ పాడిన ముస్లిం సోదరులు

News September 11, 2024

ప్రకాశం: APSSDC ఉద్యోగ ప్రకటన

image

విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్‌కు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉద్యోగాలు కల్పించనుంది. ప్రకాశం జిల్లాలో ఆసక్తి ఉన్నవారు ముందుకు వస్తే.. విజయవాడలో రోజూవారీ వేతనంపై పని కల్పిస్తామని జిల్లా అధికారి రవితేజ చెప్పారు. అభ్యర్థులు సంబంధిత డాక్యుమెంట్స్‌తో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద ఉన్న NAC ట్రైనింగ్ సెంటర్‌ను సంప్రదించాలి.

News September 11, 2024

గణేశుడి లడ్డూను పాడిన ముస్లిం సోదరులు

image

ప్రకాశం జిల్లాలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్ వద్ద వినాయకుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా గణనాథుడి లడ్డూను వేలం వేశారు. ముస్లిం సోదరులు షరీఫ్, నజీర్ రూ.33800లకు లడ్డూను దక్కించుకున్నారు. మతసామరస్యానికి ఇది నిదర్శనమని పలువురు వారిని అభినందించారు.

News September 11, 2024

ప్రకాశం: ఆ వాహనాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

image

ప్రకాశం జిల్లాలో ఉచిత ఇసుక తరలించేందుకు వాహనాల నంబర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మైనింగ్ జిల్లా శాఖ అధికారి జగన్నాథ రావు, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ సుశీల ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 11 నుంచి ఉచిత ఇసుక నూతన పాలసీ విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ మేరకు వాహనదారులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ లేని వాహనాలు ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 11, 2024

ప్రకాశం: ఆసుపత్రిలో తల్లి మృతి.. బిడ్డను అమ్మేసిన తండ్రి

image

చిన్నగంజాం మండలానికి చెందిన ఓ మహిళ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ శిశువుకు జన్మనిచ్చి మరణించింది. అదే వార్డులో ప్రసవించిన అనంతరం శిశువుని పోగొట్టుకున్న మరో మహిళకు ఆ బిడ్డను శిశువు తండ్రి 1,90,000 అమ్మేశాడు. ఈ ఘటనపై కొత్తపేట పోలీసు స్టేషన్‌లో జీరో FIR నమోదు అయింది. తదుపరి విచారణ నిమిత్తం కొత్తపేట పోలీసులు చిన్నగంజాం పోలీసు స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు.

News September 11, 2024

కురిచేడు: రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి

image

ప్రయాణిస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తూ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కురిచేడు మండలం పొట్లపాడు సమీపంలో చోటుచేసుకుంది. నంద్యాల నుంచి గుంటూరు వెళుతున్న రైలు నుంచి పడి చనిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మృతుడు వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

News September 11, 2024

కొత్తపట్నం: నమ్మించి సహజీవనం.. మరో పెళ్లికి యత్నం

image

కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామానికి చెందిన పులి నాగార్జున ఓ యువతిని ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడేవాడు. 10ఏళ్ల తర్వాత ఇటీవల ఆమె వద్దకు వెళ్లి నమ్మించి సహజీవనం చేశాడు. కొద్ది రోజుల క్రితం మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు పూనుకున్నాడు. దీనిపై ఆమె ప్రశ్నిస్తే హంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడటంతో యువతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నాగార్జునతోపాటు, మరో అయిదుగురిపై కేసు నమోదు చేశారు.

News September 11, 2024

ప్రకాశం: జిల్లాలో రైతుల చూపు నర్సరీల వైపు

image

ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు నర్సరీల నుంచి నారు, మొక్కలు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గతంలో పడినంత కష్టం లేకుండా ప్రైవేట్‌ నర్సరీల నుంచి తెచ్చుకుంటున్నారు. దీని వల్ల సమయం, ఖర్చు కలిసివస్తుందని, నారు ఒకే ఎత్తులో ఉంటుందని, నాణ్యతగా ఉంటాయని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 2023-24 మధ్య మిరప 95,129 ఎకరాల్లో, టమోటా 1746 ఎకరాల్లో సాగైనట్లుగా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు.

News September 11, 2024

నేడు దోర్నాలకు రానున్న కలెక్టర్

image

ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం దోర్నాల మండలంలో పర్యటించనున్నట్లు మంగళవారం అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు మండలంలోని చిన్న గుడిపాడు సమీపంలో గల ఆర్డీటి కార్యాలయంలో నిర్వహించే పీఎం-జన్ మన్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొననున్నట్లు తెలిపారు.

News September 10, 2024

వరద బాధితులకు రూ.10.60 కోట్లు విరాళం: మంత్రి గొట్టిపాటి

image

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో సీఎంను ఆ శాఖ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారు ఒకరోజు జీతాన్ని సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. దాదాపు 10.60 కోట్ల రూపాయలను వరద బాధితుల సహాయార్థం అందించారని మంత్రి చెప్పారు. అలాగే విద్యుత్ పునరుద్ధరణలో ఉద్యోగులు అద్భుతంగా పనిచేశారని అన్నారు.