Prakasam

News September 10, 2024

ప్రకాశం: దారుణం.. చిన్నారిపై బాబాయి అత్యాచారం!

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం మన్నేటికోటలో దారుణం జరిగింది. 9 ఏళ్ల చిన్నారిపై వరుసకు బాబాయి అయ్యే వ్యక్తి మానవ మృగంలా అరాచకానికి పాల్పడ్డాడు. తినుబండారాల పేరుతో మాయమాటలు చెప్పి చిన్నారిని తీసుకెళ్లిన కార్తీక్ (20) అత్యాచారానికి తెగబడ్డాడు. బాలిక కేకలు వేయడంతో ఆ కీచకుడు పరారయ్యాడు. ఫిర్యాదు అందుకున్న ఉలవపాడు పోలీసులు చిన్నారిని కందుకూరు ఆసుపత్రికి తరలించారు.

News September 10, 2024

అద్దంకి : ఇద్దరు మంత్రుల చొరవ.. రాత్రికి రాత్రే రక్ష

image

భారీ వర్షాలు, వరదలకు బాపట్ల జిల్లాలోని పెదపులివర్రు, పెనుమూడి, రుద్రవరం, రావిఅనంతారం గ్రామాల్లో కుడికరకట్ట చాలాచోట్ల బలహీనపడింది. దీంతో మంత్రులు అనగాని, గొట్టిపాటి అధికారులతో చర్చించి పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికుల సాయంతో 100కి పైగా ట్రాక్టర్ల మట్టిని 15వేలకుపైగా బస్తాల్లో నింపి రాత్రికి రాత్రి కరకట్టపై రక్షణ కవచంలా ఏర్పాటు చేశారు.

News September 10, 2024

ముండ్లమూరు: బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

image

ముండ్లమూరు మండలం మారెళ్ళకు చెందిన ఓ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసి గర్భివతిని చేసిన కేసులో నిందితుడు శ్రీరామ్ జాన్ హైడ్ (చెర్రీ)ని అరెస్ట్ చేసినట్లు దర్శి DSP లక్ష్మీనారాయణ తెలిపారు. గత నెల 20న బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై నాగరాజు కేసు నమోదుచేశారు. అప్పటినుంచి నిందితుడు తప్పించుకొని తిరుగుతుండగా సోమవారం అరెస్ట్ చేసినట్లు వివరించారు.

News September 10, 2024

ప్రకాశం: నేడు సంక్షేమ సహాయకులకు కౌన్సెలింగ్

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సంక్షేమ సహాయకులకు నేడు బదిలీల కౌన్సెలింగ్ జరగనుంది. ఒంగోలులోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మానాయక్ తెలిపారు. మొత్తం 312 మంది ఉద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.

News September 9, 2024

ప్రకాశం: మంత్రి ఆదేశాలు.. అధికారుల చర్యలు

image

కురిచేడు మండలం గంగదొనకొండ గ్రామంలో ఈ నెల 2న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులకు గురైంది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామానికి చెందిన ఓ ఓ వ్యక్తి ఆదివారం అద్దంకి వెళ్లి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు ఫిర్యాదుచేశారు. స్పందించిన ఆయన సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులు నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

News September 9, 2024

మస్కట్‌లో మార్కాపురం మహిళకు ఇబ్బందులు

image

మార్కాపురానికి చెందిన షేక్ మక్బుల్ బీ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాలని నిర్ణయించుకొని HYDకు చెందిన ఓ ఏజెంట్‌ను ఆశ్రయించింది. మస్కట్‌లోని ఓ సేట్ ఇంట్లో పని ఉందని ఏజెంట్ గత నెల 25న పంపించారు. అక్కడికెళ్లాక పనిచూపించకుండా.. ఒక గదిలో బంధించి ఒక పూటే ఆహారం ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారు. పంపించాలని కోరితే రూ.1.50లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని ఓ సెల్ఫీ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంది.

News September 9, 2024

సీఎం సహాయ నిధికి రూ.కోటి విరాళం: దామచర్ల

image

వరద బాధితుల సహాయార్థం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు కోటి రూపాయల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో శిద్దా రాఘవరావు, ఆయన సోదరులు, గోరంట్ల రవికుమార్, సుధానగుంట నరసింహారావు, వెంకట రామయ్య మరియు నిడమానూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

News September 8, 2024

కడవకుదురు: కరెంట్ షాక్‌తో నాలుగు గేదెలు మృతి

image

కడవకుదురు హై స్కూల్ వెనుక పక్క పొలాలలో నుంచి వెళుతున్న 11కేవీ వైర్ తెగి పడటంతో నాలుగు గేదెలు ఒక మేక అక్కడికక్కడే మృతి చెందాయి. సింగంశెట్టి రామాంజనేయులుకు సంబంధించిన నాలుగు గేదెలు బొమ్మన సుబ్రహ్మణ్యానికి సంబంధించిన ఒక మేక చనిపోయింది. గ్రామస్థులు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌కి సమాచారం అందజేయగా సంఘటన స్థలాన్ని ఏఈ పరిశీలించినారు

News September 8, 2024

యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పనులు పునరుద్ధరణ – గొట్టిపాటి

image

వరద ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదివారం పేర్కొన్నారు. ఇప్పటికీ వరద ప్రాంతంలో 2.70 లక్షల కనెక్షన్ లో పునరుద్ధరించామన్నారు. మరో ఏడు వేల కనెక్షన్ ను పెండింగ్‌లో ఉన్నాయన్నారు. విద్యుత్తు పునరుద్ధరణ చేయు ఆటంకంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికి విద్యుత్ సరఫరా అందించే లక్ష్యంగా సిబ్బంది పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

News September 8, 2024

ఒంగోలు: 9న జరిగే మీకోసం కార్యక్రమం రద్దు

image

ప్రతి సోమవారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంతో పాటు డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని ఈనెల 9న సోమవారం తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ప్రకటించారు. వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అధికారులు, సిబ్బంది విజయవాడ వెళ్లారని, ఈ నేపథ్యంలో “మీకోసం” కార్యక్రమాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.