Prakasam

News April 7, 2026

భూగర్భ జలాలు పెంచి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం: మంత్రి స్వామి

image

టంగుటూరు మండలం వల్లూరు సోమవారం మంత్రి స్వామి, జిల్లా కలెక్టర్ రాజాబాబు జలధార కార్యక్రమంలో పాల్గొన్నారు. చెరువులో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. జలధారతో భూగర్భ జలాలు పెంచడం సీఎం చంద్రబాబు సంకల్పమని మంత్రి స్వామి అన్నారు. కరువు ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో భూగర్భ జలాలు పెంచి జిల్లాను సస్యశ్యామలంగా చేస్తామన్నారు.

News April 7, 2026

విద్యార్థిని పట్ల అనుచిత ప్రవర్తన.. టీచర్ సస్పెండ్

image

కురిచేడు ZPHSలో అసిస్టెంట్(PS) ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న రఘువీర్‌పై సోమవారం సస్పెండ్ వేటు పడింది. ఆయన ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో MEO, HM విచారణ చేపట్టారు. ఈ ఆరోపణలు నిజం అని తేలడంతో ప్రకాశం DEO C.V.రేణుక ఆయన్ను సర్వీస్ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News April 6, 2026

భూగర్భ జలాలు పెంచి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం: మంత్రి స్వామి

image

టంగుటూరు మండలం వల్లూరు సోమవారం మంత్రి స్వామి, జిల్లా కలెక్టర్ రాజాబాబు జలధార కార్యక్రమంలో పాల్గొన్నారు. చెరువులో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. జలధారతో భూగర్భ జలాలు పెంచాలని సీఎం చంద్రబాబు సంకల్పమని మంత్రి స్వామి అన్నారు. కరువు ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో భూగర్భ జలాలు పెంచి జిల్లాను సస్యశ్యామలంగా చేస్తామన్నారు.

News April 6, 2026

ప్రకాశం: పిడుగుపాటుతో మరో ఇద్దరి మృతి

image

మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలంలో పిడుగుపాటుకు గురై <<19582036>>ఇద్దరు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. దర్శి(M) చామంతి పూడిలో పిడుగు పడి ఆవుల మల్లికార్జున అనే యువకుడు మృతి చెందాడు. అలాగే ముండ్లమూరు మండలం వేములబండ గ్రామ పొలాల్లో రావులపల్లి శివ కృష్ణ మృతి చెందాడు. వీరితో కలిపి మొత్తం నలుగురు మృతి చెందగా.. ఐదుగురికి గాయాలు. కొన్ని చోట్ల ఎద్దులు కూడా మృతి చెందాయి.

News April 6, 2026

పుల్లలచెరువు మండలంలో పిడుగుపాటుకు ఇద్దరి మృతి

image

పుల్లలచెరువు మండలంలో సోమవారం పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. మొక్కజొన్న ఫ్యాక్టరీలో పిడుగు పడటంతో బిహార్‌కు చెందిన కన్నయ్య అనే వ్యక్తి మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పుల్లలచెరువు (M) ఎండ్రపల్లిలో నాగయ్య అనే వ్యక్తి కూడా పిడుగుపాటుకు మృతి చెందాడు. ఈ రెండు ఘటనలపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 6, 2026

పుల్లలచెరువు: పిడుగుపాటుకు గురై ఒకరు మృతి

image

పుల్లలచెరువులో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా గ్రామంలో పిడుగుపాటుకు ఒక యువకుడు మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News April 6, 2026

ప్రకాశం: అలర్ట్.. ఆ పరీక్ష రద్దు.!

image

ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) రెగ్యులర్ నియామకాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15న నిర్వహించిన ‘ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్’ ఉద్యోగ రాత పరీక్షను రద్దు చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఇన్‌ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి, DLSA ఛైర్‌ పర్సన్ రాజ్యలక్ష్మి తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాలతో మరలా పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో చెబుతామన్నారు.

News April 6, 2026

తమిళనాడు బోట్లను AP బార్డర్‌లోకి రానివ్వం: మంత్రి స్వామి

image

తమిళనాడు, కడలూరు, పాండిచ్చేరిలకు చెందిన సోనాబోట్లు ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చి ఇక్కడి మత్య సంపదను దోచుకెళ్తున్నాయని మంత్రి స్వామి అన్నారు. ఏపీ మత్య సంపద మనవారికే దక్కే విధంగా 4 హైస్పీడ్ బోట్లతో గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు CM చంద్రబాబు నాయుడు తెలిపారన్నారు. తమిళనాడు బోట్లు ఏపీలోకి ప్రవేశించకుండా గస్తీ తిరిగేబోటులో ఉన్న పోలీసులకు తుపాకులు అందజేసే అవకాశం ఉందన్నారు.

News April 6, 2026

తమిళనాడు బోట్లను AP బార్డర్‌లోకి రానివ్వం: మంత్రి స్వామి

image

తమిళనాడు, కడలూరు, పాండిచ్చేరిలకు చెందిన సోనాబోట్లు ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చి ఇక్కడి మత్య సంపదను దోచుకెళ్తున్నాయని మంత్రి స్వామి అన్నారు. ఏపీ మత్య సంపద మనవారికే దక్కే విధంగా 4 హైస్పీడ్ బోట్లతో గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు CM చంద్రబాబు నాయుడు తెలిపారన్నారు. తమిళనాడు బోట్లు ఏపీలోకి ప్రవేశించకుండా గస్తీ తిరిగేబోటులో ఉన్న పోలీసులకు తుపాకులు అందజేసే అవకాశం ఉందన్నారు.

News April 6, 2026

మార్కాపురం అటవీ శాఖలో ఉద్యోగాలు

image

మార్కాపురం అటవీ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్‌లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం పలికారు. మార్కాపురం జిల్లాలో పనిచేయుటకు ఏదైనా డిగ్రీ కలిగి, MS ఆఫీస్, టైప్ స్కిల్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీటెక్ చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. దరఖాస్తులను ఏప్రిల్ 7వ తేదీలోపు సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు మార్కాపురం అటవీ శాఖ కార్యాలయానికి రావాలన్నారు.