India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఖాళీల ఆధారంగా 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు(HC) అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ASI) హోదాకు పదోన్నతి కల్పిస్తూ ఎస్పీ దామోదర్ బుధవారం ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా పదోన్నతులు పొందిన వారిని తన కార్యాలయంలో ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ పదోన్నతి పొందడం ఒక గౌరవ కారణమన్నారు.
జిల్లాలో 2025-26 సంవత్సరమునకు గాను 10 వేల హెక్టార్లలో డ్రిప్, స్ప్రింక్లర్స్ పరికరాలు సరఫరా చేసేందుకు నిర్ణయించినట్లు ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ రైతులలో అర్హులైన వారిని గుర్తించేందుకు ఈనెల 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు గ్రామ సభను నిర్వహిస్తున్నట్లు పీడీ తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రకాశం జిల్లాలో గీత కులాల వారికి నూతన బార్ పాలసీ గెజిట్ నోటిఫికేషన్‌ను ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆయేషా బేగం బుధవారం విడుదల చేశారు. ఈ మేరకు గీత కార్మికులతో ఎక్సైజ్ సూపరిడెంట్ సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో గీత కులాల వారికి 3 బార్లు కేటాయించడం జరిగిందని, ఒంగోలుకు 1, మార్కాపురం మున్సిపాలిటీకి 2 మంజూరయ్యాయన్నారు. 20వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని, 29వ తేదీ వరకు గడువు ఉంటుందన్నారు.
కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున, సిబ్బంది ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ పనులు సాగుతున్న గ్రామాలలో వేగవంతంగా పనులు పూర్తి చేయాలన్నారు.
ఒంగోలులో నేటి నుంచి 24 వరకు కళా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్ర నాయక్ తెలిపారు. మంగళవారం ఒంగోలులోని పీవీఆర్ హైస్కూల్ ఆవరణంలో కళా ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్‌ను వారు విడుదల చేశారు. బుధవారం కళా ఉత్సవాల ప్రారంభోత్సవానికి సినీ రంగ ప్రముఖులు వందేమాతరం శ్రీనివాస్, గోరేటి వెంకన్న, తమ్మారెడ్డి భరద్వాజ, ఏపూరి సోమన్న పలువురు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు.
డ్వాక్రా సంఘాల మహిళలు చేస్తున్న పొదుపు డబ్బుల్లో 75% ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, మిగిలిన 25% డబ్బులను అంతర్గత రుణాలకు ఇవ్వాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం బ్యాంకర్లకు సూచించారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డీఆర్డీఏలోని పొదుపు సంఘాల మహిళలకు రుణాల మంజూరుపై బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మైక్రో క్రెడిట్ ప్లాన్స్‌ను త్వరితగతిన ఆమోదించాలని కలెక్టర్ అన్నారు.
జిల్లాలోని ప్రతి ఎంపీడీవో వారానికి 4 సచివాలయాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలోని ఎంపీడీవోలతో కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన ప్రధాన బాధ్యత ఎంపీడీవోలదే అన్నారు. జిల్లాలో క్లాప్ మిత్రా జీతాల సమస్య పరిష్కరించాలన్నారు.
దోర్నాల-శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిన్నారుట్ల సమీపంలో మంగళవారం ఓ బైక్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న కొంగా సుబ్బారెడ్డి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై మహేష్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరు కడప జిల్లా సిద్ధవటం మండలానికి చెందిన వారిగా గుర్తించారు.
జిల్లాలో ఉద్యానవన పంటల సాగుకు సంబంధిత అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. మంగళవారం ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. ఉద్యానవన పంటలకు అనుకూలమైన భూములను గుర్తించాలన్నారు. రైతులను ప్రోత్సహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు.
జిల్లాలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జేసీ గోపాలకృష్ణ అన్నారు. విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జేసీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన రీ సర్వే ప్రక్రియ, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడారు.
Sorry, no posts matched your criteria.