India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి వైసీపీ MP విజయసాయిరెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో ఎన్నికల ముందు వరకు వైసీపీలో కొనసాగిన ఎంపీ మాగుంట అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో TDPలో చేరారు. ఒంగోలు ఎంపీగా విజయాన్ని సైతం అందుకున్నారు. అయితే ఎంపీ మాగుంట పుట్టినరోజు సందర్భంగా విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
సంచలన కేసులను క్లియర్ చేసిన ఘనత ప్రకాశం ఎస్పీ దామోదర్‌కు ఉంది. గతంలో ఆయన మన జిల్లాలోనే ప్రొబేషనరీ డీఎస్పీగా పనిచేశారు. ఆ సమయంలో దేశంలో సవాల్‌గా మారిన హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్‌ను కటకటాల్లోకి నెట్టారు. ఇలా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఆయనను ఉండి MLA రఘురామకృష్ణ రాజు(RRR) హత్యాయత్నం కేసు దర్యాప్తు అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఈ కేసులో మాజీ సీఎం జగన్ హస్తం ఉందని RRR ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తీర ప్రాంతంలో ఉండే ప్రజలు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం పాకల, ఊళ్లపాలెం గ్రామాలలోని పునరావాస కేంద్రాలను పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తీర ప్రాంతంలో ఉండే ప్రజలు వర్షాలకు బయటకు రావద్దన్నారు.
ప్రకాశం జిల్లాలో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మద్దిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికకు ఎడవల్లి హనుమంతరావు అనే వ్యక్తి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారం చేయబోయాడు. జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్ఐ శివరామయ్య వెల్లడించారు.
భారీ వర్షాల దృష్ట్యా మంగళవారం కూడా ప్రకాశం జిల్లాలోని అన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఏవైనా సంక్షేమ హాస్టళ్లు ప్రమాదకర స్థితిలో ఉంటే వాటిలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులను తక్షణమే ఇతర హాస్టల్లోకి, సమీపంలోని సురక్షిత భవనాల్లోకి తరలించాలని అధికారులకు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ప్రకాశం జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. ఒంగోలులోని అంబేడ్కర్ భవనంలో 2 కౌంటర్ల ద్వారా ఈ ప్రక్రియ చేపట్టారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల కృష్ణ స్వయంగా లాటరీ తీస్తున్నారు. జిల్లాలోని 171 మద్యం షాపుల కోసం మొత్తం 3466 దరఖాస్తులు దాఖలయ్యాయి. అత్యంత పారదర్శకంగా అర్జీదారుల సమక్షంలో అధికారులు లాటరీ తీస్తున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలంలో విషాదం చోటుచేసుకుంది. నలదలపూరులో జరిగిన వివాహానికి కొందరు హాజరయ్యారు. తిరిగి కారులో పోకూరుకు బయల్దేరారు. కొండారెడ్డిపాలెం వద్ద సోమవారం తెల్లవారుజామున కారు బోల్తాకొట్టింది. సామ్రాజ్యం(65), సులోచన(55) ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్‌కు, మిగిలిన వారిని కందుకూరు ఆసుపత్రికి తరలించారు.
భారీ వర్షాలు, తుఫాన్ కారణంగా ప్రకాశం జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. పిడుగులు, భారీ వర్షానికి గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలన్నారు. అన్నీ ప్రయివేటు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఇవ్వాల్సిందేనన్నారు. అలాకాదని ఎవరైనా పాఠశాలలు, కాలేజీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేఫథ్యంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ తమీమ్ అన్సారియా అప్రమత్తం చేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు అత్యవసర సమయంలో కలెక్టరేట్లోని 1077కు కాల్ చేయాలన్నారు. ఒంగోలు RDO కార్యాలయంలోని 9281034437, 9281034441 నంబర్లను సైతం సంప్రదించవచ్చన్నారు. అలాగే కరెంట్ సమస్యలుంటే 9440817491 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.
కీర్తివారిపాలెం వద్ద జాతీయ రహదారిపై నిర్మిస్తున్న కల్వర్టు చప్టా కాల్వలో పులి శ్రీనివాసులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా విషయం తెలుసుకున్న MLA కొండయ్య పాపాయిపాలెంలోని శ్రీను స్వగ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్షించారు. అనంతరం శ్రీనివాసరావు పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతిపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.