India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మద్యం మత్తులో ఓ వ్యక్తి బ్లేడుతో గొంతు కోసుకున్న సంఘటన శనివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. శింగరాయకొండ పంచాయతీలోని కందుకూరు డ్రైవర్పేట వద్ద నివాసముంటున్న తన్నీరు శివ మహేశ్ శనివారం ఫుల్గా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అనంతరం మత్తులో బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. అరుపులు విన్న చుట్టుపక్కల వారు గమనించి 108కి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు.
ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేడు జరగాల్సిన ‘మీకోసం’ (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఆర్ శ్రీలత తెలిపారు. జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం నేడు లాటరీ ప్రక్రియను నిర్వహించాల్సి ఉంది. దీంతో జిల్లా కలెక్టరుతోపాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉన్నందున ‘మీకోసం’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆమె వివరించారు.
మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ES ఖాజా మొహియుద్దీన్ వెల్లడించారు. జిల్లాలో 171 దుకాణాలకు 3466 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఒంగోలులోని అంబేడ్కర్ భవనంలో సోమవారం ఉదయం 8 గంటలకు పారదర్శకంగా లాటరీ ప్రక్రియను నిర్వహిస్తామని.. ఇందుకోసం 2 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఒకటి, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మరొకటి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
దక్షిణ కోస్తా ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికారులను కలెక్టర్ తమీమ్ అన్సారియా అప్రమత్తం చేశారు. సుమారు రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో.. ప్రత్యేక కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేశారు. ఎక్కడైనా వరద బీభత్సం వల్ల సాయం కావలసినవారు 1077 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలన్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14, 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తుఫాను వలన ముప్పు వాటిల్లకుండా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లాలోని పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు.
రాష్ట్రంలో మద్యం దుకాణాలకు ఈ నెల 12తో దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ప్రకాశం జిల్లాలో మొత్తం 171 మద్యం షాపులకు గాను 3416 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 14న ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కలెక్టర్ తమీమ్ అన్సారియా సమక్షంలో మద్యం దుకాణాలకు సంబంధించి లాటరీ తీయనున్నారు. 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలులోకి వస్తుంది. మొదటి రోజే మొదటి విడత లైసెన్స్ ఫీజు చెల్లించాలని నిబంధనలో ఉంది.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విటర్(X) వేదికగా ప్రశ్నించారు. ‘కూటమి ప్రభుత్వంలో పండుగపూట కూడా అరాచకం. శ్రీసత్యసాయి జిల్లా, చిలమత్తూరు మండలం నల్లబొమ్మయ్య పల్లిలో వాచ్మెన్, అతని కొడుకును ఐదుగురు కత్తులతో బెదిరించి అత్తాకోడళ్లపై అత్యాచారం చేసిన కామాంధులు. రాష్ట్రంలో కామాంధులు నుంచి ఆడబిడ్డలకి మీరు కల్పించే రక్షణ ఇదేనా?’ అంటూ పోస్ట్ చేశారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14, 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తుఫాను వలన ముప్పు వాటిల్లకుండా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లాలోని పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మద్యం తాగి వాహనాలను నడిపే వారిని గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. జిల్లాలో బ్రీత్ ఎనలైజర్ ద్వారా తనిఖీలు నిర్వహించి, 28 కేసులను నమోదు చేశారు. అలాగే సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 468 మంది వాహనదారులకు జరిమానా విధించామన్నారు. మొత్తం రూ.1,00,365ల జరిమానా వసూలైనట్లు, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలన్నారు.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో టమాటా ఉత్పత్తి తగ్గడం వలన సెంచరీకి చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గిద్దలూరు పట్టణంలో పండుగ సమయంలో టమాటా ధర ఒక్కసారిగా 1kg రూ.80 నుంచి రూ.30కి పడిపోయింది. దీంతో సామాన్య ప్రజలకు ఊరట లభించింది. స్థానికంగా ఉత్పత్తి పెరగడంతో టమాటా ఉత్పత్తి కూడా పెరిగిందని, దీని ద్వారా టమాటా ధరలు తగ్గాయని వ్యాపారస్థులు తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.