India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలోని దిగువ లైన్ వద్ద గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్ఐ మధుసూదన్ రావు మృతదేహాన్ని పరిశీలించారు. సదరు వ్యక్తి గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడిని గుర్తించిన వారు నేరుగా తమను సంప్రదించాలని ఎస్ఐ కోరారు.
దోర్నాల మండలం చిన్నారుట్ల గిరిజన గూడెంలో ఆరుబయట నిద్రిస్తున్న చిన్నారిపై చిరుత పులి దాడి చేసింది. తల్లిదండ్రులు అప్రమత్తమై కేకలు వేయడంతో పాపను విడిచి వెళ్లిపోయింది. అర్ధరాత్రి సమయంలో చిరుత పులి పాపపై దాడి చేయడంతో తల, మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ చిన్నారిని తల్లిదండ్రులు సున్నిపెంట వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో 2 రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధానంగా కంది సాగు చేసే రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ స్థితిలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు గురువారం Way2Newsకు పలు విషయాలు వెల్లడించారు. సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 70 వేల హెక్టార్ల కంది సాగవుతుందన్నారు. ప్రస్తుతం 40 శాతం సబ్సిడీపై కంది విత్తనాలు ఇవ్వనున్నట్లు, రైతులు RSK కేంద్రాలను సంప్రదించాలన్నారు.
సీఎం చంద్రబాబు కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఇప్పటికే మంత్రుల కమిటీ దీనిపై దృష్టి సారించింది. మార్కాపురం జిల్లా ఖాయమన్న వార్తలు గుప్పుమంటుండగా, కందుకూరు పరిస్థితి ఏమిటన్న చర్చలు జోరందుకున్నాయి. ఇలా కందుకూరును కలిపేస్తారా? లేక అద్దంకిని ఒంగోలులోకి మిళితం చేస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏదొక డివిజన్‌ను కలిపితే ప్రకాశం నిండుగా ఉంటుందన్నది ప్రజల వాదన.
ఈ ఏడాది జూన్ 30లోగా వేసిన అనధికార లేఅవుట్లను, ప్లాట్లను చట్టబద్ధం చేసుకోవడానికి అక్టోబర్ 24 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జేసీ గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం ఒంగోలులో సర్వేయర్లతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ స్కీం ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు.
ఈ ఏడాది జూన్ 30లోగా వేసిన అనధికార లేఅవుట్లను, ప్లాట్లను చట్టబద్ధం చేసుకోవడానికి అక్టోబర్ 24 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జేసీ గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం ఒంగోలులో సర్వేయర్లతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ స్కీం ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాతో మంత్రి డాక్టర్ స్వామి బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆయన కోరారు.
ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కమర్షియల్ టాక్స్ శాఖ అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా సమీక్ష సమావేశం నిర్వహించారు. రూ. 40 లక్షలు, రూ. 20 లక్షల టర్నోవర్ దాటిన వ్యాపార సంస్థలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. పన్ను లేకుండా సరుకుల రవాణా జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట వద్ద బుధవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒంగోలుకు చెందిన పెండ్ర కోటమ్మ (65) అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జేసీ గోపాలకృష్ణ అధ్యక్షతన జిల్లాస్థాయి పొగాకు కొనుగోలు కమిటీ సమావేశం జరిగింది. పొగాకు మిగిలిపోయిన రైతులకు కొనుగోలు షెడ్యూలు రూపొందించాలని ఈ సందర్భంగా కమిటీ నిర్ణయించింది. అదనపు కేటాయింపుల కోసం పై అధికారులకు నివేదిక పంపినట్లు కమిటీ పేర్కొంది.
Sorry, no posts matched your criteria.