Prakasam

News August 14, 2025

ఒంగోలు: అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం

image

ఈ ఏడాది జూన్ 30లోగా వేసిన అనధికార లేఅవుట్లను, ప్లాట్లను చట్టబద్ధం చేసుకోవడానికి అక్టోబర్ 24 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జేసీ గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం ఒంగోలులో సర్వేయర్లతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ స్కీం ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు.

News August 14, 2025

ఒంగోలు: అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం

image

ఈ ఏడాది జూన్ 30లోగా వేసిన అనధికార లేఅవుట్లను, ప్లాట్లను చట్టబద్ధం చేసుకోవడానికి అక్టోబర్ 24 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జేసీ గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం ఒంగోలులో సర్వేయర్లతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ స్కీం ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు.

News August 13, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. ప్రకాశం కలెక్టర్‌కు మంత్రి స్వామి ఫోన్..!

image

ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాతో మంత్రి డాక్టర్ స్వామి బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆయన కోరారు.

News August 13, 2025

జిల్లాలో జీఎస్టీ వసూళ్లు పెంచాలి: కలెక్టర్

image

ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కమర్షియల్ టాక్స్ శాఖ అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా సమీక్ష సమావేశం నిర్వహించారు. రూ. 40 లక్షలు, రూ. 20 లక్షల టర్నోవర్ దాటిన వ్యాపార సంస్థలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. పన్ను లేకుండా సరుకుల రవాణా జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

News August 13, 2025

సంతనూతలపాడు: ఆటో బోల్తా.. మహిళ మృతి

image

సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట వద్ద బుధవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒంగోలుకు చెందిన పెండ్ర కోటమ్మ (65) అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 13, 2025

ఒంగోలులో జిల్లా స్థాయి పొగాకు కమిటీ సమావేశం

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జేసీ గోపాలకృష్ణ అధ్యక్షతన జిల్లాస్థాయి పొగాకు కొనుగోలు కమిటీ సమావేశం జరిగింది. పొగాకు మిగిలిపోయిన రైతులకు కొనుగోలు షెడ్యూలు రూపొందించాలని ఈ సందర్భంగా కమిటీ నిర్ణయించింది. అదనపు కేటాయింపుల కోసం పై అధికారులకు నివేదిక పంపినట్లు కమిటీ పేర్కొంది.

News August 13, 2025

ప్రకాశం: తుఫాన్ ఎఫెక్ట్.. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. బుధవారం తహశీల్దార్లతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. తుఫాన్ కారణంగా ఏమైనా సమస్యలు ఎదురైతే, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 1077కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

News August 13, 2025

ప్రకాశం: భారీ వర్షాలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం

image

రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం తహశీల్దార్లకు సూచించారు. లోతట్టు ప్రాంతాలు, కూలిపోయే స్థితిలో ఉన్న పాత ఇళ్లలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన ఆదేశించారు.

News August 13, 2025

తర్లుపాడు రైల్వే ట్రాక్‌పై మృతదేహం లభ్యం

image

తర్లుపాడు పరిధిలోని రైల్వే ట్రాక్‌పై బుధవారం ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి పంచనామా చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడు రైలులో వెళ్తూ ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడు గిద్దలూరుకు చెందిన వాడిగా సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 13, 2025

‘కొండపిలోని గ్రామాలను ప్రకాశం జిల్లాలో కలపాలి’

image

కొండపి నియోజకవర్గంలోని పలు గ్రామాలను తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై ఏర్పాటైన మంత్రుల కమిటీని కోరారు. నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలం రామనాథపురంలో ఒక వీధి ప్రకాశం జిల్లా, మరొక వీధి పలుకూరు పంచాయతీ నెల్లూరు జిల్లా పరిధిలో ఉందన్నారు. జరుగుమల్లి మండలంలోని ఏడ్లూరుపాడును పొన్నలూరు మండలంలో కలపాలని కోరారు.