India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం జిల్లాలో పల్నాడు జిల్లా యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాళ్లూరు మండలానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోయాడు. దీంతో ఆమె కనిగిరిలోని పుట్టింటికి వచ్చింది. ఆమెకు సత్తెనపల్లికి చెందిన రవితేజ(28) పరిచయమమ్యాడు. ‘నిన్నే పెళ్లి చేసుకుంటా. మీ అమ్మానాన్నతో మాట్లాడతా’ అంటూ రవితేజ కనిగిరికి వచ్చాడు. ఆమె వద్దని చెప్పడంతో వెళ్లి ఫుల్‌గా మద్యం తాగాడు. మరోసారి ఆమె ఇంటికి వచ్చి చేయి కోసుకోవడంతో చనిపోయాడు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండల కేంద్రంలోని ఓ భూమి విషయంలో జరిగింది. ఇందులో సర్వేయర్ వెంకటేశ్వర రెడ్డి పాత్రపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇదే స్థల వివాదంలో తహశీల్దార్ బాల కిషోర్, వీఆర్వోను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సస్పెండ్ అయిన అధికారుల సంఖ్య 3కి చేరింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి ఆర్ధిక తోడ్పాటు కల్పిస్తూ అదనపు సాయంగా రూ.50 వేల నుంచి లక్ష రూపాయలు మంజూరు చేస్తుంది. క్షేత్ర స్థాయిలో గృహ నిర్మాణ లబ్దిదారులకు అవగాహన కల్పిస్తూ త్వరగా ఇల్లు నిర్మించుకునేలా దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మతసామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని, ఇబ్బంది కలిగించవద్దని తెలిపారు. సంప్రదాయ పండుగలు ఏవైనా ప్రజలు కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఇలాంటి పండుగల సమయంలో యువత ఆదర్శంగా మెలగాలని సూచించారు.
ఒంగోలులో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.
బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్‌కు చెందిన సంజీవ కుమార్ ఒంగోలు రైల్వే స్టేషన్‌కు అతి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న GRPS పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరు తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, అడిషనల్ ఎస్పీ నాగేశ్వర రావులతో కలసి భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణ పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భూఅక్రమాలపై నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
ప్రకాశం జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. జిల్లాలో 6 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కొమరోలు గవర్నమెంట్ హైస్కూల్, బెస్తవారిపేట మండలం పిటికాయగుళ్ల, పెద్దారవీడు మండలం వైడిపాడు, అర్ధవీడు మండలం మాచవరం, రాచర్ల, CSపురం జిల్లా పరిషత్ పాఠశాలలను సమస్యాత్మకమైన కేంద్రాలుగా గుర్తించారు. ఆయా సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
గిద్దలూరులో హైటెన్షన్ కరెంట్ వైర్ పట్టుకున్న విద్యార్థి చనిపోయాడు. కంభం(M) రావిపాడుకు చెందిన అమరనాథ్(22) బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. రూ.40 లక్షల జీతంతో జాబ్‌కు సెలెక్టయ్యాడు. HYDలో అన్నను చూసొస్తానని చెప్పి వెళ్లాడు. అన్నను కలవకుండానే ఫ్రెండ్‌తో కలిసి నిన్న గిద్దలూరు వచ్చాడు. ఫ్రెండ్‌ని వాటర్ బాటిల్‌కి పంపి అతను గూడ్స్ రైలెక్కి వైర్లు పట్టుకున్నాడు. కర్నూలులో చికిత్స పొందుతూ చనిపోయాడు.
జగన్ పెట్టిన బకాయిలకు ఆయనే ధర్నాలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని మంత్రి స్వామి విమర్శించారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.4,271 కోట్ల బకాయి పెట్టింది జగన్ కాదా? ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పడానికి.. ఇలా ధర్నాకు పిలుపు ఇవ్వడమే నిదర్శనం. వైసీపీ హయాంలో ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదు. మేము ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తుండటంతో ధర్నాలు చేసుకుంటున్నారు’ అని మంత్రి అన్నారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మార్కెట్లు, దుకాణాల వద్ద ఇందుకు అవసరమైన ప్రత్యామ్నాయాలు కల్పించాలని చెప్పారు. బుధవారం అమరావతి సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.