India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం జిల్లా ఫారెస్ట్ పరిధిలో 75 బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా నిన్నటితో ఆ గడువు ముగియనుంది. కాగా గడువును ఈనెల 10 వరకు APPSC పొడిగించింది. ఇంటర్ పాసై 18-30 ఏళ్లలోపు వయసు ఉన్న యువతీ, యువకులు APPSC వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
(1)*బీట్ ఆఫీసర్ (CF): 10 (2)*బీట్ ఆఫీసర్ (ఫ్రెషర్): 23
(3)*అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (CF):5 (4)అసిస్టెంట్ బీట్ ఆఫీసర్(ఫ్రెషర్): 37
జిల్లా పోలీస్ విభాగంలో హోంగార్డ్స్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ నియామక పరీక్షలో ఉద్యోగం సాధించిన 9 మంది హోంగార్డులను జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో తనను కలిసిన హోంగార్డులను ఎస్పీ అభినందించి, ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఇదే ఆదర్శాన్ని కొనసాగిస్తూ నియమ నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలన్నారు.
ప్రకాశం జిల్లాలో బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ మంగళవారం ప్రకటించింది. రాయలసీమ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందన్నారు. దీని ప్రభావంతో ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం బుధవారం ఉన్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి పరీక్షల నియంత్రణాధికారిగా ప్రకాశం జిల్లా కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎ. సైమన్ విక్టర్‌ను నియమిస్తూ ఇంటర్ విద్య డైరెక్టర్ డా. కృతికా శుక్లా ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సైమన్ విక్టర్ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
టంగుటూరు మండలంలోని రెండు రొయ్యల పరిశ్రమలలో వెట్టి చాకిరి చేస్తున్న 40 మంది ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్ వాసులకు మంగళవారం విముక్తి లభించింది. ఒరిస్సా నుంచి 17, చత్తీస్‌ఘడ్ నుంచి 23 మంది రొయ్యల పరిశ్రమలలో పనిచేస్తున్నట్లు, వారి చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నట్లు కలెక్టర్‌కు సమాచారం అందింది. దీంతో కలెక్టర్ తమీమ్ అన్సారియా జోక్యం చేసుకొని 40 మందికి రిలీఫ్ సర్టిఫికెట్లను మంగళవారం ఒంగోలులో అందజేశారు.
ప్రకాశం జిల్లాలో 74,911 బంగారు కుటుంబాలను అధికారులు గుర్తించారు. వారిలో 37,389 కుటుంబాలను 6350 మంది మార్గదర్శకులకు అనుసంధానం చేసినట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం సీఎం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అధికారులు మిగిలిన బంగారు కుటుంబాల కోసం మార్గదర్శకులను గుర్తించాలన్నారు.
ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో జరిగే 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొననున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరణ చేసి, సందేశాలను ఇచ్చే మంత్రుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. ఒంగోలులో జరిగే జిల్లాస్థాయి వేడుకల్లో మంత్రి స్వామి పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు.
ATMలో డబ్బులు జమ చేసేందుకు వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి మోసపోయిన ఘటనపై సోమవారం SP దామోదర్‌కు ఫిర్యాదు చేశాడు. ఒంగోలులోని వేంకటేశ్వర కాలనీకి చెందిన బాధితుడు ఓ ఏటీఎం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగుడు నగదు ట్రాన్స్‌ఫర్ చేస్తానని నమ్మించాడు. ఆ తర్వాత మెసేజ్ చూపించి, డబ్బులు పడినట్లు నమ్మబలికాడు. చివరికి నగదు జమ కాకపోవడంతో బాధితుడు SPకి ఫిర్యాదు చేశాడు.
79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పండగ వాతావరణంలో నిర్వహించే ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి అన్ని శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రత్యేక శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రోటోకాల్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి 67 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. ఎస్పీ దామోదర్ నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు వచ్చి అర్జీలు అందించారన్నారు. అర్జీదారుల సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకుని, ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత పోలీస్ స్టేషన్‌ల సిబ్బందిన ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.