India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రముఖ శైవక్షేత్రాలు వద్ద నిర్వహించే తిరునాళ్ల, రథోత్సవాలు వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి భద్రతా, ట్రాఫిక్ సమస్యలు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాజధాని అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీసీఎల్ఏ జయలక్ష్మి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వ భూములన్నింటికీ పూర్తిస్థాయిలో గుర్తించటానికి రీ సర్వే చేయాలని జయలక్ష్మి ఆదేశించారు. రీ సర్వే చేస్తున్న సిబ్బంది సకాలంలో హాజరయ్యేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడుని యర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ మంగళవారం కలిశారు. ప్రోటోకాల్ ఉల్లంఘన విషయంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో జరిగే కార్యక్రమాలకు తనను పిలవట్లేదన్నారు. ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్ పర్యటనకు వచ్చినా తమకు ఎటువంటి ఆహ్వానం లేదన్నారు.
పీ-4 సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. నాగులుప్పలపాడు మండలంలోని పోతవరం గ్రామంలో మంగళవారం ఆమె పర్యటించారు. గ్రామంలో పీ-4 సర్వేతో పాటు భూముల రీసర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. పీ-4 సర్వేలో భాగంగా స్థానికులతో మాట్లాడి వారి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కమీషన్ల కక్కుర్తితో పరిశ్రమల్ని తరిమివేశారని మంత్రి స్వామి శాసన మండలిలో ధ్వజమెత్తారు. మంగళవారం మండలిలో జరిగిన గవర్నర్ ప్రసంగ ధన్యవాద తీర్మానంలో వైసీపీ సభ్యుల వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన లూలూ, అమర్ రాజా, ఏషియన్ పార్క్ ఇండస్ట్రీ లాంటి కంపెనీలన్నింటిని తరిమి వేసిన ఘనత జగన్‌దేనని అన్నారు.
గిద్దలూరులోని పీఆర్ కాలనీలో వ్యభిచారానికి పాల్పడుతున్న ఇద్దరు యువకులపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. రాబడిన సమాచారం మేరకు అర్బన్ సీఐ సురేశ్ వ్యభిచార గృహంపై దాడికి దిగారు. ఇద్దరు విటులను, మహిళలను, మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి విటులకు కౌన్సిలింగ్ ఇచ్చి యువకులపై కేసు నమోదు చేశామని సీఐ సురేశ్ తెలిపారు.
పి-4 సర్వేను వేగవంతం చేయాలని కలెక్టరు తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం మండల స్థాయి అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై ఆమె వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి ఒకటో తేదీన పెన్షన్‌ల పంపిణీ ఉంటుందని, రెండో తేదీ ఆదివారం అయినందున ఈ సర్వేను ఈవారం లోనే పూర్తి చేయాలని స్పష్టం చేసారు. క్షేత్ర స్థాయిలో సచివాలయ సిబ్బంది మరింత చురుకుగా పని చేయాలని ఆమె కోరారు.
2025-26 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో చేరటానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లుగా డీఈఓ కిరణ్ సోమవారం తెలిపారు. ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి, 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో చేరటానికి ఆసక్తి కనబరిచే విద్యార్థులు ఆన్లైన్‌లో మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
30 ఏళ్లు అధికారం నాదేనంటూ విర్రవీగిన జగన్‌ని ప్రజలు ఐదేళ్లకే భరించలేక ఛీత్కరించినా.. మళ్ళీ మరో 30 ఏళ్లు అధికారం తమదేనని జగన్ కార్యకర్తలను మభ్యపెడుతున్నాడని మంత్రి స్వామి అన్నారు. సోమవారం అసెంబ్లీలో పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేకపోయాడని ఎద్దేవా చేశారు. జగన్‌కి పదవులు మీద ఉన్న ఆరాటం ప్రజాసమస్యలపై లేకపోవడం సిగ్గుచేటన్నారు. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే తనపదవి రద్దవుతుందని వచ్చారన్నారు.
ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ సీఎం చంద్రబాబు పేరును తప్పుగా ఉచ్చరించారు. దీనిపై ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పందించారు. ‘నరేంద్ర పవన్ చంద్రబాబు నాయుడు అని చదివితే బాగుండేది. కూటమి ధర్మం కూడా నిలబడేది’ అంటూ Xలో పోస్ట్ చేశారు.
Sorry, no posts matched your criteria.