India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యూనియన్ బ్యాంకులో ఓ మహిళ దొంగతనానికి యత్నించిన ఘటన త్రిపురాంతకం మండలం మేడపి యూనియన్ బ్యాంకులో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ మహిళ బ్యాంక్ షటర్ తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడి లాకర్ తాళాలు రాకపోవడంతో వెనుదిరిగింది. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా బ్యాంకులో చోరీ చేసేందుకు ఓ మహిళతో పాటు మరో వ్యక్తి వచ్చినట్లు దర్శి డీఎస్పీ అశోకవర్థన్ తెలిపారు.
ప్రకాశం జిల్లాకు నేడు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం రాత్రి వెల్లడించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. కావున వర్షాలు పడే సమయంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, చెట్ల కింద, రేకుల షెడ్ల కింద ఉండకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్ట్ నిర్మాణం 2025 జూన్ నాటికి పూర్తి చేస్తామని మంత్రులు బీసీ జనార్ధన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. కలెక్టర్ ఆనంద్, కందుకూరు సబ్ కలెక్టర్ జి.విద్యాధరి, ఎమ్మెల్యలు నాగేశ్వరరావు, కృష్ణారెడ్డితో కలిసి పోర్టు నిర్మాణ పనులను వారు పరిశీలించారు.
తనకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు టీడీపీ నేత, ఆర్యవైశ్య నాయకులు సుబ్బారావు గుప్తా శుక్రవారం ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఇటీవల అవినీతిపరుల చిట్టాలను బహిర్గతం చేయడం వల్ల కొందరు తనను చంపుతామని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బెదిరించిన వారెవరో గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తనకు రక్షణ కల్పించాలని కోరారు.
ఒకటో తేదీనే పింఛన్ అందజేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది వారి విధుల్లో నిబద్ధత చాటుకుంటున్నారు. తొలి రోజు అందని వారికి కనీసం రెండో రోజైనా అందేలా చూస్తున్నారు. సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన 20మంది లబ్ధిదారులు మహారాష్ట్రలోని నాగపూర్ వెళ్లారు. ఈ నేపథ్యంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గౌస్ ఈరోజు నాగ్‌పూర్ వెళ్లి మరీ వారికి పింఛన్ అందజేశారు. దీంతో గౌస్‌ను పలువురు అభినందించారు.
బాపట్ల మండల పరిధిలోని సూర్యలంక సముద్రతీరంలో అలల తాకిడికి మునిగిపోతున్న ఓ యువకుడిని గజఈతగాళ్లు, మెరైన్ పోలీసులు కాపాడారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్లకు చెందిన అచ్యుత మహేశ్ అనే యువకుడు శుక్రవారం సూర్యలంక సముద్ర తీరానికి వచ్చాడు. సముద్రంలో స్నానం చేస్తుండగా అలలు రావడంతో యువకుడు మునిగిపోతుండగా, మెరైన్ పోలీసులు, గజఈతగాళ్లు గమనించి కాపాడారు.
సీఎస్‌పురం పర్యటన సమయంలో జాయింట్ కలెక్టర్‌కు వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ నిర్వహించి MRO నాగుల్ మీరా, VRO శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. భూముల మ్యుటేషన్లకు సంబంధించి ఓ రైతు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కనిగిరి ఆర్డీవో ద్వారా విచారణ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆ నివేదిక మేరకు MRO, VROను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
చీరాల సాయి ప్యాలెస్ థియేటర్ రోడ్డులోని బీసీ బాలికల సాంఘిక సంక్షేమ హాస్టల్లో వార్డెన్ పాలపర్తి కోటేశ్వరమ్మ కొడుతుందని ముగ్గురు బాలికలు వాపోయారు. హాస్టల్ నుంచి బయటకు వచ్చి స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద తిరుగుతుండగా స్థానికులు, పాత్రికేయులు అనుమానంతో బాలికలను వివరాలు అడిగారు. న్యాయవాది రెహమాన్ షరీఫ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పిల్లలకు ధైర్యం చెప్పి తిరిగి హాస్టల్‌కు పంపించారు.
30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సానుకూలంగా తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పోరాటానికి నాంది పలికింది ప్రకాశం జిల్లా యువకులు. నాగులుప్పలపాడు మండలం ఈదుమూడిలో 13 మంది మాదిగ యువకులు 1994 జూన్ 7న ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. దీనికి మందకృష్ణ మాదిగ వ్యవస్థాపకుడిగా పోరాడారు. 1995 మే 31న ఒంగోలులో 70 వేల మందితో ఎమ్మార్పీఎస్ తొలి సమావేశం జరిగింది.
మార్కాపురం సమీపంలో ఉన్న జార్జి ఇంజినీరింగ్ కళాశాలలోని లేడీస్ హాస్టల్ పరిసరాలలో అరుదైన జాతికి చెందిన అలుగు జంతువు విద్యార్థులకు కనిపించింది. అరుదైన జాతుల్లో ఒకటిగా గుర్తించబడ్డ ఈ అలుగు జంతువు కనిపించడంతో విద్యార్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అనంతరం కళాశాల యాజమాన్యానికి సమాచారం ఇవ్వడంతో వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.