Prakasam

News July 2, 2024

అద్దంకి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

అద్దంకి పట్టణంలో వైయస్సార్ అపార్ట్మెంట్ దగ్గర మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 2, 2024

ప్రకాశం: స్వగ్రామంలో సందడి చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి

image

సినీ దర్శకుడు అనిల్ రావిపూడి స్వగ్రామం యద్దనపూడి మండలంలోని చిలుకూరివారిపాలెం ఆంజనేయస్వామి ఆలయంలో, అనంతవరంలోని శివాలయంలో విశేషపూజలు నిర్వహించారు. త్వరలో తన దర్శకత్వంలో నిర్మించే సినిమా స్క్రిప్ట్‌కు తల్లిదండ్రులతో కలిసి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనిల్ కుటుంబ సభ్యులను వేద పండితులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

News July 2, 2024

హనుమంతునిపాడు: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

హనుమంతునిపాడు మండలం వేములపాడులో సోమవారం వేకువజామున విద్యుత్ తీగలు తగిలి లారీ క్లీనర్ మృతి చెందాడు. మండల ఎస్సై శివనాగరాజు వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన తిప్పస్వామి కుశ సోమవారం తెల్లవారుజామున వర్షం కురుస్తుండటంతో లారీలో లోడ్ చేసిన ఎరువు తడవకుండా ఉండేందుకు పట్ట కప్పుతున్నాడు. చీకట్లో అతనికి విద్యుత్ తీగ మెడకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్సై వివరించారు.

News July 2, 2024

ఒంగోలు: స్పాట్‌లో సమస్యను పరిష్కరించిన కలెక్టర్

image

ఒంగోలు స్థానిక పట్నంలోని గ్రీవెన్స్ హాలులో సోమవారం జరిగిన ‘మీ కోసం’ కార్యక్రమంలో ఇద్దరు దివ్యాంగులు తమకు వీల్ ఛైర్, రెండు శ్రవణ యంత్రాలు కావాలని కలెక్టర్ తమీమ్ అన్సారియాకు అర్జీ అందజేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ దివ్యాంగుల సంక్షేమ శాఖను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఆ శాఖ సహాయ సంచాలకులు అర్చన వీల్ ఛైర్, వినికిడి పరికరాలు సమకూర్చి కలెక్టర్ వారికి అక్కడే అందజేశారు.

News July 2, 2024

చీరాల లాడ్జిలో యువకుడి సూసైడ్

image

చీరాల సాయికృష్ణ లాడ్జిలో సోమవారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను బ్లేడుతో ముంజేయి కోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడిని తాడేపల్లి వాసి అయ్యప్ప(32)గా గుర్తించారు. అయ్యప్ప చీరాలలోని ఓ ప్రైవేట్ హౌసింగ్ బ్యాంక్‌లో పనిచేస్తున్నాడని సమాచారం. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News July 1, 2024

చిన్నగంజాం ఎంపీడీవో వరప్రసాద్ మృతి

image

చిన్నగంజాం మండల పరిషత్ అభివృద్ధి అధికారి యుబి. వరప్రసాద్ మృతి చెందారు. సాధారణ ఎన్నికల బదిలీల్లో భాగంగా పల్నాడు జిల్లా మాచవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తూ ఆయన చిన్నగంజాం మండలానికి వచ్చారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు చికిత్స పొందుతూ ఎంపీడీవో మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ఎంపీడీవో మృతి పట్ల పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

News July 1, 2024

ప్రకాశం జిల్లాలో 93.89% పింఛన్లు పంపిణీ

image

ప్రకాశం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ సోమవారం సాయంత్రానికి 93.89 శాతం పూర్తి చేసినట్లు జిల్లా స్థాయి అధికారులు తెలిపారు. జిల్లాలో 2,91,524 మంది పింఛన్‌దారులు ఉండగా, 2,73,604 మంది లబ్ధిదారులకు సచివాలయ సిబ్బందితో కలిసి రాజకీయ నాయకులు అందజేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి రేపు పంపిణీ చేయనున్నారన్నారు.

News July 1, 2024

ప్రకాశం జిల్లాలో పెన్షన్ పంపిణి @1 PM

image

జిల్లాలో జూలైకి సంబంధించిన సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంటకు 291524 మంది పెన్షన్ దారులకు గాను 142517 మందికి పంపిణీ పూర్తి చేసి 48.89 శాతంగా నమోదైంది. జిల్లాలోని అన్ని గ్రామ, వార్డ్ సచివాలయ పరిధిలో అధికారులు ఇంటి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. పింఛన్ల పంపిణీలో రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా 18వ స్థానంలో కొనసాగుతోంది. ఇక బాపట్ల జిల్లా 20వ స్థానంలో ఉంది.

News July 1, 2024

ప్రకాశం: జిల్లాలో 3.6 మి.మీ వర్షపాతం నమోదు

image

ప్రకాశం జిల్లాలో గడిచిన 24 గంటల్లో 3.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని పలు మండలాలలో ఓ మోస్తరు జల్లులు పడ్డాయి. తాళ్లూరు మండలంలో 24.2 మి.మీ., జరుగుమల్లిలో 27.4 మి.మీ., నాగులుప్పలపాడులో 16.0మి.మీ., మద్దిపాడులో 12.4 మి.మీ., ఒంగోలులో 11.2 మి.మీ., తర్లుపాడులో 11.1మి.మీ వర్షం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరో ఎనిమిది మండలాలలో చిరుజల్లులు పడ్డాయి.

News July 1, 2024

ప్రకాశం: వెబ్‌సైట్లో టెన్త్ మార్కుల జాబితా

image

పదోతరగతి మార్కుల జాబితా www.bse.ap.gov.in వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు డీఈవో సుభద్ర ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల లాగిన్ ద్వారా విద్యార్థుల హాల్ టికెట్ ఉపయోగించి మార్కుల జాబితాను పొందవచ్చని పేర్కొన్నారు. మార్కుల జాబితాలో ఏదైనా తప్పులు ఉంటే విద్యార్థులు సరైన రికార్డులతో నేరుగా ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులకు తెలియజేయాలన్నారు.