India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలీస్ సిబ్బందికి సంబంధించిన అన్ని రికార్డులను డీపీఓ కార్యాలయంలో ఎప్పటికప్పుడు వివరాలు నమోదయ్యేలా చూడాలని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని డీపీఓ కార్యాలయంలో సిబ్బందితో ఎస్పీ ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
చీమకుర్తి మండలం కూనంనేని వారిపాలెంలో గురువారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ కార్యక్రమాన్ని ప్రారంభించగా,, ఎస్పీ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
ఉలవపాడు యువకుడు ఒంగోలులో నర్సింగ్ చదువుతున్నాడు. అతని ప్రవర్తనను స్నేహితులు హేళన చేశారు. ఇదే సమయంలో అతడికి హిజ్రాలు పరిచయం కావడంతో ఇంటికి రావడం, తల్లిదండ్రలతో మాట్లాడటం మానేశాడు. మిస్సింగ్ కేసు ఉండటంతో నిన్న అతడిని ఉలవపాడు స్టేషన్‌కు తీసుకొచ్చారు. 150 మంది హిజ్రాలు అక్కడికి చేరుకుని గొడవ చేశారు. ఎవరితో వెళ్లాలి అనే నిర్ణయం అతడికి వదిలేయగా హిజ్రాలతో వెళ్లడంతో తల్లిదండ్రులు విలపించారు.
టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో బుధవారం పొగాకు గరిష్ఠ ధర రూ.360 పలికింది. ఎం.నిడమానూరు క్లస్టర్ గ్రామాలకు చెందిన రైతులు 1041 బేళ్లను వేలానికి తీసుకువచ్చారు. వాటిలో 965 బేళ్లు కొనుగోలయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 76 బేళ్లను తిరస్కరించారు. పొగాకు సరాసరి ధర కేజీ రూ.313.79, కనిష్ఠ ధర రూ.205 పలికిందని పొగాకు వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో 6385 మంది వాలంటీర్ల ఆశలు చిగురించాయి. దీనికి ప్రధాన కారణం తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాలంటీర్లను కొనసాగిస్తామని ప్రకటించడమే. ఎన్నికల సమయంలో జిల్లా వ్యాప్తంగా రాజీనామా చేయకుండా 6385 మంది వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, అందుకు గల విధివిధానాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు ప్రభుత్వం సైతం ప్రకటించింది. అయితే జిల్లాలో రాజీనామా చేసిన వాలంటీర్‌ల పరిస్థితి తేలాల్సి ఉంది.
ప్రకాశం జిల్లాకు నేడు పిడుగులతో కూడిన భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని ప్రకటించిన విపత్తుల సంస్థ జిల్లాలోని పలు మండలాలలో ఇదే పరిస్థితి ఉంటుందని ప్రకటన విడుదల చేసింది. పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ మోటార్ల వద్దకు వెళ్ళవద్దని వెళ్లొద్దని సూచించింది.
తక్కువ మొత్తంలో పెట్టుబడులు-ఎక్కువ మొత్తంలో ఆదాయాల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP దామోదర్ కోరారు. ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు, యాప్‌లు, వాట్సాప్ గ్రూప్‌లు, టెలిగ్రామ్ ఛానెల్‌లు, కంపెనీ బ్రాండ్‌ను పోలిన వెబ్‌సైట్‌లను రూపొందించి సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారని అన్నారు. వాటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధికి ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో మొత్తం 27 రాష్ట్ర రహదారులను P.P.P స్కీం ద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఓడరేవు నుంచి చీరాల-పర్చూరు-చిలకలూరిపేట-నరసరావుపేట మీదగా పిడుగురాళ్ల చేరుకునే 81.42 కి. మీ రహదారి అభివృద్ధికి ఆమోదముద్ర తెలిపింది.
నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విహార ప్రదేశాలను నెల రోజుల పాటు మూసివేస్తున్నట్లు దోర్నాల అటవీ రేంజ్ అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. శ్రీశైలం రహదారిలోని తుమ్మలబైలు సమీపంలో ఉన్న జంగిల్ సఫారీని ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు మూసివేయనున్నారు. వర్షాకాలంతో పాటు పులుల ఏకాంతానికి భంగం కలగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఆ అధికారి అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ద్విసభ్య కమిటీ విచారణ చేపట్టింది. ప్రకాశం జిల్లా సహకార శాఖ డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి తోట సాయినాథ్ పై పలు ఆరోపణలు రాగా, జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. DCO, విభిన్న ప్రతిభావంతులు సహాయ సంచాలకులు ఇప్పటికే విచారణను వేగవంతం చేశారు. ఈ విచారణకు పలువురు బాధితులు హాజరై తమ వాదన వినిపించినట్లు సమాచారం. ఇక అవినీతికి పాల్పడ్డారా లేదా అనేది తేలాల్సిఉంది.
Sorry, no posts matched your criteria.