Prakasam

News January 30, 2025

మోపాడు రిజర్వాయర్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్

image

పామూరు మండలంలోని మోపాడు రిజర్వాయర్‌ను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమిమ్ అన్సారియా రిజర్వాయర్ నీటి సామర్థ్యం, సాగు చేస్తున్న పంట పొలాల విస్తీర్ణం గురించి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

News January 29, 2025

ఈసారైనా ఒంగోలుకు RGV వస్తారా..?

image

చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై దుష్ర్పచారం చేశారంటూ ప్రకాశం(D) మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో RGVపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయనకు హైదరాబాద్ వెళ్లి మరి జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చినా విచారణకు రాలేదు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిబ్రవరి 4న జరిగే విచారణకు రావాలని RGVకి నిన్న మరోసారి వాట్సప్‌లో నోటీసులు పంపారు. ఆరోజున రాలేనని.. ఫిబ్రవరి 7వ తేదీలోపు ఎప్పుడైనా వస్తానని చెప్పినట్లు సమాచారం.

News January 29, 2025

ఒంగోలు: ‘సమస్యలకు సత్వర పరిష్కారం చూపండి’

image

ప్రజా ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపడంతోపాటు, అందుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తనకు నివేదించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. మంగళవారం అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఆమె మాట్లాడారు. గత నవంబరులో జరిగిన డి.ఆర్.సీ సమావేశంలో ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి, తీసుకున్న చర్యలపై ఆరా తీశారు.

News January 28, 2025

పొదిలి: చెల్లిని హత్య చేసిన అన్న.. ఎందుకుంటే.!

image

ఇన్సూరెన్స్ నగదు కోసం ఓ అన్న కిరాతకంగా చెల్లిని చంపిన ఘటన పొదిలిలో ఏడాది క్రితం చోటుచేసుకుంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు అతన్ని మంగళవారం అరెస్ట్ చేశారు. కనిగిరి మండలం పునుగోడుకు చెందిన మాలపాటి అశోక్ అప్పుల్లో కూరుకుపోయాడు. ఈ నేపథ్యంలో చెల్లి సంధ్య పేరుపై వివిధ కంపెనీల్లో సుమారు కోటికి ఇన్స్యూరెన్స్ కట్టాడు. దీంతో ఆమెను గత ఏడాది 2వ నెలలో హత్యచేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించాడు. 

News January 28, 2025

ప్రకాశం: మద్యం మత్తులో హల్‌చల్

image

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచర్ల మోటులో యువకులు మద్యం మత్తులో హల్‌చల్ సృష్టించారు. అర్ధరాత్రి కారులో వచ్చిన కొంతమంది యువకులు బడ్డి కొట్టు యజమానిపై దాడి చేశారు. అతని మెడలోని బంగారు చైన్ లాక్కొని పారిపోయారు. కాసేపటికి అదే కారులో తిరిగి వచ్చి తనపై బీరు సీసాలతో దాడి చేశారని యజమాని వాపోయారు.

News January 28, 2025

మార్కాపురంలో స్థలాలు మరింత ప్రియం

image

ప్రకాశం జిల్లాలో భూముల విలువ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ఫీజు పెంచడమే దీనికి ప్రధానం కారణం. గవర్నమెంట్ లెక్కల ప్రకారం కంటే ఎక్కువ ధరకు భూములు విక్రయిస్తున్న చోటే రిజిస్ట్రేషన్ విలువ పెంచనున్నారు. ఈ లెక్కన మార్కాపురంలోని స్థలాలు ప్రభుత్వ బుక్ ధర కంటే ఎక్కువ పలుకుతున్నాయి. దీంతో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్కాపురంలో రిజిస్ట్రేషన్ ధరతో పాటు భూమి విలువ పెరుగుతుంది.

News January 28, 2025

ప్రకాశం: ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి 76 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదులను పరిష్కరించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి 76 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి వారి ఫిర్యాదుల వివరాలను తెలుసుకున్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ భరోసా కల్పించారు.

News January 26, 2025

ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌లో తేనేటి విందు

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం సాయంత్రం నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమం సందడిగా సాగింది. మంత్రి స్వామి, ఎస్పీ దామోదర్, జిల్లా జడ్జి ఏ.భారతి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ, మార్కాపురం సబ్‌కలెక్టర్‌గా వెంకట త్రివినాగ్‌, MLA విజయ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

News January 26, 2025

కొండపి విద్యార్థుల క్రియేటివిటీ సూపర్

image

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని కొండపి గురుకుల పాఠశాల విద్యార్థులు వినూత్నంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో జాతీయ జెండాని పోలిన నమూనాతో పాటు జాతీయ ఓటర్ల దినోత్సవం అక్షరమాల ఆకారంలో కూర్చున్నారు. ఈ చిత్రం పలువురిని ఆకట్టుకుంటోంది. విద్యార్థుల క్రియేటివిటీని పలువురు టీచర్లు అభినందించారు. అనంతరం ఓటు గురించి విద్యార్థులకు అధికారులు అవగాహన కల్పించారు.

News January 26, 2025

ప్రకాశం కలెక్టర్‌కు అవార్డు

image

ప్రకాశం క‌లెక్ట‌ర్ తమీమ్ అన్సారియాకు బెస్ట్ ఎల‌క్టోర‌ల్ ప్రాక్టీసెస్ అవార్డు 2024 ల‌భించింది. శ‌నివారం విజ‌య‌వాడ‌లోని జ‌రిగిన 15వ జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విజ‌యానంద్ చేతుల‌మీదుగా అందుకున్నారు. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ఓట‌ర్ల జాబితా రూప‌క‌ల్ప‌న‌, అర్హులైన వారి ఓట‌రుగా న‌మోదు చేసుకునేందుకు అత్యుత్తమ పనితీరు కనపరిచినందుకు అవార్డు అందుకున్నారు.