Prakasam

News July 30, 2024

ఢిల్లీ స్వాతంత్ర్య వేడుకలకు దొనకొండ వారు ఎంపిక

image

ఆగస్టు 15వ తేదీన ఢిల్లీలో జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ఎంపికైన ఐదు పాఠశాలల్లో, దొనకొండ జడ్పీ పాఠశాల తరఫున గణిత ఉపాధ్యాయుడు షేక్‌ చాంద్ బాషా, పదో తరగతి విద్యార్థి హర్ష సాయి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామాంజనేయులు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలకు ఇలాంటి అవకాశం రావడం సంతోషకరమన్నారు.

News July 30, 2024

ఒంగోలు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

ఒంగోలు, సూరారెడ్డిపాలెం మధ్య రైలు పట్టాలపై ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే కదులుతున్న రైలు నుంచి సదరు వ్యక్తి జారిపడి మృతి చెందినట్లు స్థానికులు రైల్వే పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News July 30, 2024

జగన్‌పై మండిపడ్డ మంత్రి గొట్టిపాటి

image

దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ పట్టాదారు పాసు పుస్తకాలపై తన బొమ్మను ముద్రించుకొని, రూ.15 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు. పొలాల సరిహద్దు రాళ్లపై కూడా తన బొమ్మ కోసం రూ.700 కోట్లు వృథా చేశారని.. ఈ సొమ్ముతో రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేదని తెలిపారు. గతంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చూస్తే నియంత పాలనకు అద్దం పడుతుందని మండిపడ్డారు.

News July 30, 2024

నల్లమల ఫారెస్ట్‌లో 87కు చేరిన పెద్ద పులుల సంఖ్య

image

నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులుల సంఖ్య 87కి చేరిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దేశంలోనే అతి పెద్దదైన శ్రీశైలం- నాగార్జునసాగర్ టైగర్ ప్రాజెక్ట్‌లో 2014 సంవత్సరంలో పెద్ద పులుల సంఖ్య 48గా ఉండగా.. 2022కు ఆ సంఖ్య 62కు చేరిందన్నారు. ప్రస్తుతం ఆ పెద్ద పులుల సంఖ్య 87. అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణకై 800 మంది చెంచు గిరిజనులు పనిచేస్తున్నారని DFO విఘ్నేశ్ అప్పావ్ తెలిపారు.

News July 30, 2024

ప్రకాశం: 2,91,419 మందికి రూ.123.92 కోట్లు

image

ఆగస్టు నెలకు సంబంధించి జిల్లాలోని 291,419 మంది లబ్ధిదారులకు పింఛను కింద రూ.123.92 కోట్ల మేర నగదు విడుదలైనట్లు డీఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. ఒకటో తేదీ ఉదయం 6 గంటల నుంచి ఇంటి వద్దనే జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 5,723 మంది సచివాలయ, ప్రభుత్వ ఉద్యోగులతో పంపిణీ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.

News July 30, 2024

కొండపిలో రికార్డు ధర పలికిన పొగాకు

image

కొండపిలోని పొగాకు కొనుగోలు కేంద్రంలో సోమవారం నిర్వహించిన వేలంలో గరిష్ఠ ధర కేజీ రూ.359 పలికిందని వేలం నిర్వహణాధికారి జి.సునీల్ కుమార్ తెలిపారు. ముక్కోడిపాలెం, ధర్మవరం, కోయవారిపాలెం, వెంకటకృష్ణాపురం, తాటాకులపాలెం, గ్రామ పరిధిలోని రైతులు 1099 బేళ్లు వేలానికి తీసుకురాగా 982 బేళ్లు కొనుగోలయ్యాయి. వివిధ కారణాలతో 117 బేళ్లను తిరస్కరించారు. కనిష్ఠ ధర రూ.205, సరాసరి ధర రూ.278.18 పలికింది.

News July 30, 2024

ఒంగోలులో నేడు జాబ్ మేళా

image

ఒంగోలులోని పాత రిమ్స్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నేడు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి భరద్వాజ్ తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన నిరుద్యోగులు 10వ తరగతి నుంచి ఐటీఐ చదివిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలతో నేరుగా జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం ఉందని సూచించారు.

News July 30, 2024

సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే PAపై ఫిర్యాదు

image

సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుకు పీఏగా వ్యవహరించిన బండారు సురేశ్‌, సుల్తానాపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ మేరకు వారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదును ఇచ్చారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.

News July 30, 2024

ప్రకాశం ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 81 ఫిర్యాదులు

image

ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి 81 ఫిర్యాదులు అందినట్లు ఏఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన ఫిర్యాదుదారులతో ఏఎస్పీ మాట్లాడి, వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫిర్యాదులను పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.

News July 29, 2024

ప్రకాశం: ఆగస్టు 1న పింఛన్ పంపిణీకి సర్వం సిద్ధం

image

జిల్లాలో 2,91,419 మంది పింఛనుదారులకు ఆగస్ట్ ఒకటో తేదీన పింఛన్ పంపిణీకి జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, జేసీ ఆదేశాలతో ఆగస్టు 1వ తేదీన 99 శాతం పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయా సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే పింఛన్ పంపిణీకై జిల్లాకు ప్రభుత్వం రూ.123.92 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.