Prakasam

News April 14, 2024

ప్రకాశం: రోడ్లు వేయనందుకు నిరసనగా ఎన్నికల బహిష్కరణ

image

75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో రోడ్లు వేయలేని పాలకుల అసమర్థతను నిరసిస్తూ ఆ గ్రామస్థులు రానున్న ఎన్నికలను బహిష్కరించారు. పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఫ్లెక్సీని గ్రామంలో అంటించి తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. సీఎస్ పురం మండలంలోని దర్శిగుంట్ల పంచాయతీ పరిధిలోని బొంతవారిపల్లిలో గ్రామస్థుల ఆవేదన చర్చనీయాంశమైంది.

News April 14, 2024

ప్రకాశం: బాబోయ్.. మండిపోతున్న ఎండలు

image

ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రతిరోజు 38 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇళ్లకే పరిమితమైపోతున్నారు. ఒకవైపు పాలిటిక్స్ హీట్ పుట్టిస్తుంటే మరి వైపు భానుడు తన ప్రతాపాన్ని చాటుతున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కుపోతకు గురవడంతో పాటు వృద్ధులు, చిన్న పిల్లలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.

News April 14, 2024

గిద్దలూరు: రహదారి ప్రమాదంలో వ్యక్తి మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన గిద్దలూరు పట్టణ సమీపంలో ఎడవల్లి క్రాస్ రోడ్డు వద్ద శనివారం అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకున్నది. గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఖాజావలి (38) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొనటంతో తీవ్ర గాయాలతో ఖాజావలి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 14, 2024

జగన్‌పై దాడి.. ప్రకాశం జిల్లా నేతలు ఏమన్నారంటే?

image

సీఎం జగన్‌పై విజయవాడ బస్సు యాత్రలో దాడి జరిగిన విషయం తెలిసింది. దీనిపై ప్రకాశం జిల్లాకు చెందిన నేతలు స్పందించారు. జగన్‌పై దాడి టీడీపీ మూకల పనేనని జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, శివ ప్రసాద్ అన్నారు. జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆధరణను చూసి ఓర్వలేక దాడి చేశారని జంకె వెంకటరెడ్డి, కేపీ నాగార్జునరెడ్డి, దద్దాల అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి మంచి పరిణామాలు కాదని అన్నా రాంబాబు హితవు పలికారు.

News April 14, 2024

ప్రకాశం: ఎన్నికల విధుల్లో VRO ఆకస్మిక మృతి

image

యద్దనపూడి మండలంలోని జాగర్లమూడికి చెందిన వీఆర్వో కాలేషావలి(46) ఆకస్మికంగా మృతిచెందాడు. ఎన్నికల నేపథ్యంలో బాపట్లలోని ఈవీఎంల స్ట్రాంగ్ రూం వద్ద విధులకు హాజరయ్యారని సహచర వీఆర్వోలు వెల్లడించారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురవ్వడంతో వైద్య సేవల కోసం చీరాలకు తరలించినట్లు చెప్పారు. వైద్యులు వచ్చి సేవలందించే సరికి అప్పటికే మృతిచెందినట్లు వెల్లడించారు.

News April 13, 2024

చీరాల: ఇసుకలో మృతదేహం.. స్పందించిన నారా లోకేశ్

image

మండలంలోని ఈపూరుపాలెంలో ఇసుక లోడ్‌లో మృతదేహం బయటపడిన ఘటనపై ట్విటర్(X) వేదికగా శనివారం TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఇది ఇసుక మాఫియా పననే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో ఈ ఘటన ఒక నిదర్శనమన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ భర్తలు తిరిగి వస్తారన్న నమ్మకం భార్యలకు లేకుండా పోయిందన్నారు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయని విమర్శించారు.

News April 13, 2024

ప్రకాశం: స్కూల్ బస్సును ఢీ కొట్టిన లారీ

image

సంతమాగులూరు ఎంపీడీవో కార్యాలయ సమీపంలో శనివారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. మండల కేంద్రమైన ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు పాఠశాలలోపలికి వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పాక్షికంగా దెబ్బతినగా ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 13, 2024

‘పర్చూరులో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నా’

image

పర్చూరు ఇందిరా కాలనీకి చెందిన షేక్ ఖాసిం సైదా రానున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నానని శనివారం స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా పర్చూరులో తిష్ట వేసిన సమస్యలను పట్టించుకోవడం లేదని, పేదలకు చేస్తున్నది ఏమీ లేదని ఆరోపించారు. స్థానికుడైన తనకు నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉందని, పేదల బాధలు తనకు తెలుసునని చెప్పారు. అందుకే పేదల ప్రతినిధిగా పోటీకి దిగుతున్నానన్నారు.

News April 13, 2024

ప్రకాశం: 61 రోజులు చేపల వేట నిషేధం

image

ప్రకాశం జిల్లా సముద్ర జలాల్లో పడవలు, మరబోట్ల ద్వారా నిర్వహించే చేపలవేటపై 61 రోజుల నిషేధం ఈనెల 15 నుంచి అమల్లోకి రానుందని జిల్లా మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సముద్రంలో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిషేధం విధించినట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు మత్స్యకారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా వారికి ప్రభుత్వం అందించే రాయితీలను నిలిపివేస్తామన్నారు.

News April 13, 2024

ప్రకాశం: సముద్రంలో గల్లంతైన యువకుడు మృతి

image

దొనకొండ మండల కేంద్రానికి చెందిన సయ్యద్ ఇర్ఫాన్ (38) అనే వ్యక్తి ఒంగోలు ఇస్లాంపేటలో నివాసం ఉంటున్నాడు. స్నేహితులతో సరదాగా కొత్తపట్నం కె.పల్లెపాలెం బీచ్ కు వచ్చి సముద్రంలో స్నానం చేస్తూ అలల ఉధృతికి లోపలికి కొట్టుకుపోతుండగా మత్స్యకారులు బయటకులాగారు. కొన ఊపిరితో ఉండగా, స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు.