India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావం కోనసాగుతోంది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారి మంగళవారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ ‘X’ ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ ప్రభావంతో విశాఖ, అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్, శ్రీకాకుళం, అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బహిర్భూమికి వెళ్లి నాగవళి నదిలో ప్రమాదవశాత్తూ జారిపడి వృద్ధుడు గల్లంతైన ఘటన ఆదివారం సంతకవిటిలో జరిగింది. మండలంలోని పొడలి గ్రామానికి చెందిన ఉరదండ పోలయ్య (76) ఆదివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకుక నది తీరానికి వెళ్లాడు. ఎప్పటికీ రాకపోవడంతో వృద్ధుడు కోసం కుటుంబీకులు వెతికానా దొరకలేదు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు జరుగుతున్నాయి.
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదివారం విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో ఎంపీ కేశినేని శివనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఎంపీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గౌతు శిరీషను ఎంపీ శాలువాతో సత్కరించి, కొండపల్లి బొమ్మను బహుకరించారు.
టెక్కలి – మెలియాపుట్టి రోడ్డు ఫ్లైఓవర్ సమీపంలో ఆదివారం వేకువజామున డీజిల్ ట్యాంకర్ లారీ బోల్తా పడింది. విశాఖ నుంచి పలాస వైపు వెళ్తున్న AP39 UU 7060 నంబరు లారీ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పగా, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 1033 హైవే అంబులెన్స్
ద్వారా అతన్ని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై టెక్కలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం చికెన్, మటన్, చేపల ధరలు పెరిగాయి. బాయిలర్ స్కిన్ చికెన్ కిలో రూ. 210, స్కిన్లెస్ రూ.220, నాటుకోడి రూ.800కి విక్రయించారు. గత వారంతో పోలిస్తే ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. మటన్ కిలో రూ. 900, చేపలలో బొచ్చలు రూ.250, కోరమీను రూ.450కి అమ్మకాలు జరుగుతున్నాయి. సాధారణ వినియోగదారులు ఖర్చులు భారమవుతున్నాయని అంటున్నారు.
రాష్ట్ర విజిలెన్స్ కమీషనర్ అనిల్ చంద్ర పునేఠ శనివారం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, SP కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ ఈయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
⍟జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
⍟ జిల్లాలో పలు చోట్ల సర్ధార్ గౌతు లచ్చన్న జయంతి
⍟ టీడీపీ ఎమ్మెల్యే కూన రవి తీరుపై వైసీపీ మండిపాటు
⍟ ఎల్.ఎన్ పేట: భారీ గుంతతో ప్రమాదం తప్పదా ?
⍟ టెక్కలి: షాపు తెరవకపోయినా.. రూ.7వేలు విద్యుత్ బిల్లు
⍟కిడ్నీ వ్యాధిగ్రస్థుల మృత్యుఘోష పట్టదా: సీపీఎం
⍟ కాశీబుగ్గలో 20 కేజీల గంజాయి స్వాధీనం
⍟ శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు
పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై నిరాధారణమైన ఆరోపణలు చేయడం తగదని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీత అన్నారు. ఆమదాలవలస టీడీపీ కార్యాలయంలో శనివారం మీడియాతో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే రవికుమార్ తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ రోజు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించలేదని అన్నారు. ప్రిన్సిపల్ తన ఉద్యోగరీత్యా అవినీతికి పాల్పడ్డారన్నారు. ఎమ్మెల్యేపై YCP ఆరోపణల్లో నిజం లేదన్నారు.
ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మహిళా ఉద్యోగులకు ఫోన్లు చేసి వేధిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. ‘కేజీబీవీ ప్రిన్సిపల్‌కు కూడా ఆయన వేధింపులు తప్పడం లేదు. మహిళా ఉద్యోగులు లొంగకుంటే బదిలీ చేయిస్తానని బెదిరిస్తున్నారు’ అని ట్వీట్ చేసింది. ఎమ్మెల్యే తన శాడిజం చూపుతున్నారని మండిపడింది.
ఒడిశాకు చెందిన నలుగురు గంజాయి అక్రమ రవాణాదారులను పలాస రైల్వే స్టేషన్లో అరెస్టు చేసినట్టు కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. మోహనా బ్లాక్ పడొవ గ్రామానికి చెందిన నాయక్, రాహిత్ బిర, జునైలు, గుమ్మా గ్రామానికి చెందిన సురుసింగ్ వద్ద 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అరెస్టు చేసి పలాస కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జైలుకి పంపించామని అన్నారు.
Sorry, no posts matched your criteria.