Srikakulam

News August 14, 2025

శ్రీకాకుళం: వీడియో పోటీల విజేతలు వీరే

image

శ్రీకాకుళం జిల్లా వజ్రోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా చరిత్ర, ప్రకృతి, సాంప్రదాయం ఇతర ముఖ్యమైన అంశాలపై జిల్లాకు చెందిన పలువురు Social Media Influencersకు నిర్వహించిన వీడియో పోటీలలో విజేతలు వివరాలను కలెక్టర్ కార్యాలయ అధికారులు బుధవారం తెలిపారు. జిల్లాకు చెందిన అరవింద్(మొదటి స్థానం)లో నిలవగా, పీ.ప్రశాంత్ (రెండు), ప్రనీత్ (మూడవ స్థానం)లో నిలిచారు. ఈ మేరకు విజేతలను పలువురు అభినందించారు.

News August 14, 2025

శ్రీకాకుళంలో రేపటి నుంచి మహిళలకు ఉచిత బస్సు

image

ప్రభుత్వం ప్రకటించిన ‘శ్రీ శక్తి పథకం’ ఉచిత బస్సు ప్రయాణ సేవలు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ అయిన ‘సూపర్ సిక్స్’లో ఇది ఒకటి. ఈ పథకం కింద మహిళలు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రయాణ భారం తగ్గుతుందని ప్రభుత్వం పేర్కొంది.

News August 14, 2025

శ్రీకాకుళం: ఒకే కాన్పులో రెండు దూడలు

image

శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు గ్రామంలోని రామాలయం వీధిలో రైతు కృష్ణారావుకు చెందిన ఆవు ఒకే కాన్పులో రెండు దూడలకు జన్మనిచ్చింది. గురువారం జరిగిన ఈ అరుదైన సంఘటనతో రైతు ఆనందం వ్యక్తం చేశారు. ఈ రెండు దూడల్లో ఒకటి ఆడది, మరొకటి మగది అని రైతు తెలిపారు. తల్లి గోవు, 2 దూడలు ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు. గోవును దైవంగా భావించే తనకు ఈ విషయం సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

News August 14, 2025

తిలారులో పెళ్లిరోజే మహిళ సూసైడ్

image

కోటబొమ్మాలి (M) తిలారుకు చెందిన వివాహిత లావణ్య (22) ఆత్మహత్యకు పాల్పడింది. నరసన్నపేటకు చెందిన పల్లి శ్రీనివాసరావు కుమార్తె లావణ్యను 2021 ఆగస్టు 14వ తేదీన సవర రాజారావుకు ఇచ్చి వివాహం చేశారు. అయితే వివాహం జరిగిన నాటి నుంచి గొడవలు జరుగుతుండడంతో తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News August 14, 2025

పోలాకి: ఆక్వా రంగం అభివృద్ధిపై మంత్రి అచ్చెన్న సమీక్ష

image

మత్స్య, ఆక్వా రంగం అభివృద్ధిపై సంబంధిత అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఆక్వా కల్చర్ యూనిట్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కావాలని, లైసెన్స్ జారీ ప్రక్రియ సులభతరం చేయాలని అధిరులకు ఆయన సూచించారు. రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ ద్వారా 5 లక్షలు టన్నులు చేపలు ఉత్పత్తి పెంపు లక్ష్యంగా ప్రణాళిక రూపొందించాలని అన్నారు.

News August 14, 2025

SKLM: సందడిగా ప్రారంభమైన వజ్రోత్సవ ఫెయిర్, ఎగ్జిబిషన్లు

image

జిల్లా వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా స్వర్ణ శ్రీకాకుళం ఫెయిర్, ఎగ్జిబిషన్ బుధవారం సాయంత్రం సందడిగా స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో ప్రారంభమైంది. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్విరాజ్ కుమార్ ఈ స్టాళ్లను ప్రారంభించారు. జిల్లాను ప్రతిబింబించే సాంప్రదాయ హస్తకళలు, ఆధునిక పరిశ్రమలు, వ్యవసాయ పరికరాలు స్టాల్స్‌ను వీరు పరిశీలించారు. అధికారులు పాల్గొన్నారు.

News August 13, 2025

SKLM: పరిశ్రమల స్థాపనకు సహకారం అందిస్తాం

image

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే అన్నివిధాల సహాయసహకారాలు అందిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హామీ ఇచ్చారు. జిల్లా ఏర్పడి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించారు. కోస్టల్ కారిడార్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో తీరప్రాంత వెంబడి పరిశ్రమలు స్థాపిస్తే ఏపీఐఐసీ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. MLA శంకర్ పాల్గొన్నారు.

News August 13, 2025

విజయనగరం పైడితల్లమ్మ పండగ తేదీలు ఇవే

image

ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబర్ 7న(మంగళవారం) ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శిరీష తెలిపారు. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 22 వరకు మండల దీక్ష ప్రారంభం అవుతుందన్నారు. అక్టోబర్ 6న (సోమవారం) తొలేళ్ల ఉత్సవం, 14న తెప్పోత్సవం, 21న ఉయ్యాల కంబాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. >Share it

News August 13, 2025

ఢిల్లీలో జరిగే వేడుకలకు సారవకోట సీడీపీఓకు ఆహ్వానం

image

ఢిల్లీలో ఈ నెల 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలకు సారవకోట ఐసీడీఎస్ సీడీపీఓ వంశీ ప్రియకు ఆహ్వానం అందింది. ఢిల్లీలోని రెడ్ పోర్ట్‌లో నిర్వహించే ఉత్సవాలలో ఆమె బయల్దేరనున్నారు. తనని ఎంపిక చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.

News August 13, 2025

శ్రీకాకుళానికి ప్రాచీనకాలంలో ఉన్న పేరు ఇదే..!

image

జిల్లా ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా చరిత్రకు సంబంధించిన ఒక అద్భుతమైన శాసన సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఈ శిలా శాసనంలో ప్రాచీనకాలంలో శ్రీకాకుళం పేరు “సికకోలీ గడ” అని ఉన్నట్లు గుర్తించారు. పర్లాకిమిడికి చెందిన ఎపిగ్రఫిస్ట్‌ బిష్ణు మోహన్ గుర్తించి చదివారు. బిష్ణు మోహన్ చేస్తున్న కృషికి ఎమ్మెల్యే శంకర్ ప్రత్యేకంగా అభినందించారు.