India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి డీఎస్పీ వివేకానంద పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త, భారత దేశ ఉప ప్రధాని అని అన్నారు. దళిత వర్గాల ఆశాజ్యోతి అని, వారి అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు.

నరసన్నపేటలో నాణ్యతలేని ఆహార విక్రయాలు భారీగా సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మిల్క్ షేక్, హోటల్స్, స్వీట్ స్టాల్స్, రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ అమ్మకాలలో నాణ్యతా ప్రమాణాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల సింగపురంలో జరిగిన కల్తీ బాదంపాలు ఘటన అందరికీ తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.

శ్రీకాకుళం రూరల్ మండలం సింగిపురం జాతరలో కల్తీ బాధంపాలు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో శుక్రవారం సుమారు 80 మంది పీహెచ్సీలో చేరగా.. శనివారంనాటికి కేసులు 113కు పెరిగాయి. ప్రస్తుతం బాధితులకు స్థానిక పీహెచ్సీలో వైద్య సిబ్బంది పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. అధికారులు ఘటనపై విచారణ ప్రారంభించారు.

గార మండలంలోని శ్రీకూర్మానికి చెందిన అంధవరపు రూపవతి(82) శుక్రవారం తనువుచాలించారు. దీంతో కుటుంబ సభ్యులు నేత్రదానం చేయాలని నిర్ణయించుకున్నారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్లు సుజాత, పి.చిన్ని కృష్ణల ద్వారా ఆమె కార్నియాలను సేకరించారు. ఇటీవలే భర్త బాలకృష్ణ మూర్తి (88) కూడా నేత్రదానం చేసి ఆదర్శంగా నిలిచారు.

శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస, బూర్జ, హిరమండలం, జలుమూరు, ఎల్ .ఎన్.పేట, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాలలో ఆదివారం తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ శనివారం తెలిపారు. అలాగే సోమవారం నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

శ్రీకాకుళం జడ్పీ సీఈఓగా వెంకట్రామన్ బాధ్యతలు స్వీకరించారు. రెండు రోజుల క్రిందట ప్రభుత్వం ఆయన్ను విజయనగరం నుంచి బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. తనకు శ్రీకాకుళం జిల్లాలో ఎంపీడీవోగా, ఇతర శాఖలలో పనిచేసిన అనుభవం ఉందని వెంకట్రామన్ పేర్కొన్నారు. జడ్పీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

సింగుపురం ఉత్సవాల్లో కలుషిత బాదం పాలు తాగి భక్తులు అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా ఆహార భద్రతా విభాగం నిశిత విచారణ చేపట్టింది. జిల్లా ఆహార భద్రతాధికారి లక్ష్మి శనివారం నగరంలోని బాదం పాలు తయారీ కేంద్రాలు, విక్రయించే మొబైల్ ఫుడ్ కార్టులు ముడి సరకు సరఫరా చేసే కేంద్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా అనుమానిత బాదం పాలు, కస్టర్డ్ పౌడర్ నమూనాలను అధికారి సేకరించారు.

ప్రభుత్వ సేవలు ప్రజలకు పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా అందాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. శనివారం పాతపట్నం పర్యటనలో భాగంగా ఆయన పాతపట్నం సచివాలయం-1ను ఆకస్మికంగా సందర్శించారు. ప్రవేశించిన వెంటనే సిబ్బంది హాజరు పట్టీని స్వాధీనం చేసుకుని తనిఖీ చేశారు. కొంతమంది ఫీల్డ్‌కు వెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. వారి కదలికలను తెలుసుకునేందుకు మూమెంట్ రిజిస్టర్‌ను పరిశీలించారు.

శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు ప్రస్తుతం 98 శాతం యథావిధిగా కొనసాగుతున్నాయని ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ ఎం.అవని అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల అయింది. ఈ నెల 6వ (సోమవారానికి) రాష్ట్రమంతా 100 శాతం సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. జిల్లా ప్రజలు, ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, అపోహలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

కంచిలి మండలం భైరిపురం జంక్షన్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు<<19560472>> ప్రమాదంలో<<>> ఆరవ సరియాపల్లికి చెందిన ఆశ వర్కర్ బుడ్డెపు కమల కుమారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నెల 12వ తేదీన కుమారుడు దినేశ్ రెడ్డికు పెళ్లి నిశ్చయం అయింది. జాడుపూడి గ్రామంలో వారి బంధువులకు పెళ్లి పత్రికలు ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలముకొన్నాయి.
Sorry, no posts matched your criteria.