Srikakulam

News April 3, 2026

శ్రీకాకుళం: పంచాయతీ ఎన్నికలు ఎప్పుడో…?

image

శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీల పాలకవర్గాలు పదవీకాలం గురువారంతో ముగిసింది. నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. మండల స్థాయి గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. 1994 పంచాయతీరాజ్ చట్టం మేరకు బాధ్యతలు నిర్వహిస్తారు. జిల్లాలో 912 పంచాయతీలు ఉన్నాయి. ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారనేది గ్రామాల్లో చర్చ జరుగుతోంది.

News April 3, 2026

శ్రీకాకుళం: 5న R&B మినిస్టర్ రాక

image

రాష్ట్ర రహదారులు, భవనాలు(R&B) శాఖా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈనెల 5, 6వ తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రి 5న జిల్లాకు వస్తారని చెప్పారు. సంతబొమ్మాళి మండలం మూలపేటలో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్‌పై సమీక్షా సమావేశం 6న నిర్వహిస్తారన్నారు.

News April 3, 2026

శ్రీకాకుళంలో బీర్లు ఎక్కువగా తాగేస్తున్నారు..!

image

శ్రీకాకుళం జిల్లాలో 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1207.91 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. ఇందులో మద్యం బాక్సులు 16.97లక్షలు కాగా.. బీరు బాక్సులు రూ.8.06లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1213.06కోట్ల విక్రయాలు జరిగాయి. గతంలో పోలిస్తే 2025-26లో అమ్మకాలు పెరగలేదు. 2024-25లో బీర్లు 5.19లక్షల బాక్సులు అమ్ముడుపోగా.. 2025-26లో ఆ సంఖ్య 8.06లక్షలకు పెరిగింది.

News April 3, 2026

రేపు శ్రీకాకుళం జిల్లాలో YCP పూజలు

image

తిరుమల పవిత్రతను కాపాడే దిశగా టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి బీఆర్. నాయుడిని వెంటనే తొలగించాలని వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఈనెల 4న జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

News April 3, 2026

శ్రీకాకుళం: POLYCET..అప్‌డేట్

image

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (POLYCET -2026) దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచినట్లు జిల్లా ప్రవేశాల ఇన్‌ఛార్జి, శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. నారాయణ రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 4తో స్వీకరణ గడువు ముగుస్తుండగా, సాంకేతిక విద్యాశాఖ ఈనెల 9 వరకు పెంచిందని ప్రకటనలో వెల్లడించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 3, 2026

శ్రీకాకుళం: రానున్న రెండు రోజులు జాగ్రత్త

image

రానున్న రెండు రోజులు జిల్లాలో ఎండతీవ్రత ఎక్కువగా ఉండి 42-43°C వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనందుకు అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ గురువారం ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జిల్లాలో 13 మండలాల్లో తీవ్రవడగాలులు ,2 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. వడగాలుల కారణంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.

News April 3, 2026

SKLM: వీళ్లకు ఏమైంది.. 3నెలల్లో ముగ్గురు మృతి

image

విద్యాలయాల్లో ఉండాల్సిన కొందరు విద్యార్థులు క్షణికావేశంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో మృత్యుఒడిలోకి చేరుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరీ 15న టెక్కలి(M) పాలసింగికి చెందిన అరుణ అనే బీటెక్ విద్యార్థిని హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. టెక్కలిలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని కే.ప్రవల్లిక మార్చి 4న రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా పాతపట్నంలో 7వ తరగతి బాలిక పూజిత ప్రమాదవశాత్తూ మృతిచెందింది.