India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు శ్రీకాకుళం ఏపీసీ పి. వేణుగోపాలరావు గురువారం చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి, ఇంటర్మీడియట్ , 7,8,9,10 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికల నుంచి 25 కేజీబీవీలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు.

శ్రీకాకుళం జిల్లాలో గురువారం తీవ్ర వడగాల్పుల వీచే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ బుధవారం తెలిపారు. ప్రధానంగా ఆమదాలవలస, బూర్జ మండలాల్లో వడగాల్పులకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎండలు దృష్ట్యా అత్యవసరం అయితే తప్ప బయట తిరగరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రమాదం సంభవించినప్పుడు తక్షణ సహాయంపై తగిన సూచనలు చేశారు. పెండింగ్ కేసులపై దర్యాప్తు, డ్రోన్లు సాంకేతిక అప్లికేషన్లు వినియోగంపై సమీక్షించారు. ట్రాఫిక్ నియంత్రణ భద్రత మరింత కఠిన తరం చేయాలన్నారు.

జిల్లాలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఆర్థిక భరోసా కల్పించేందుకు ‘ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్’ పథకం కింద మెగా రిజిస్ట్రేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు.సాయి కుమార్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 2, ఏప్రిల్ 4వ తేదీల్లో శ్రీకాకుళం DRDA కాంప్లెక్స్‌లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో జరుగుతుందన్నారు.18-25 ఏళ్ల వయస్సు గలవారు అర్హులన్నారు.

మద్యం విక్రయాల్లో రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా 22వ స్థానంలో నిలిచింది. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1207.91 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. ఇందులో మద్యం బాక్సులు 1697849, బీర్ 806243బాక్సులు ఉన్నాయి. 2024-25లో 1213.06కోట్ల 1207.91మద్యం విక్రయాలు జరగ్గా.. 2025-26లో దీనిపై పెద్దగా మార్పు లేదు . 2024-25తో పోలిస్తే 2025-26లో 55శాతం బీర్లు ఎక్కువగా అమ్ముడుపోవడం విశేషం.

పంచాయతీల పాలకవర్గాల ఐదేళ్ల పాలన ఈనెల రెండుతో ముగియనుంది. గురువారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లో 912 గ్రామపంచాయతీలు ఉన్నాయి. రెండు లేదా మూడు పంచాయతీలకు ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించారు. మండలంలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్లకు స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఇటీవల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పిల్లలకు ఆపద వస్తే కన్నతల్లి మనస్సు విలవిల్లాడిపోతోంది. ఆ ప్రమాదానికి ఎదురెళ్లి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కుటుంబ తగాదాలకు మనస్సును చిన్నబుచ్చుకుంది. ప్రాణమైన చిన్నారులను రైలు కింద తోసి తనూ ఆత్మహత్య చేసుకున్న ఘటన <<19529246>>నరసన్నపేటలో<<>> మంగళవారం జరిగింది. భర్త మద్యం తాగొచ్చాడని జరిగిన గొడవలో మనస్తాపం చెందింది. క్షణికావేశంలో ఈమె తీసుకున్న నిర్ణయం పిల్లలను ఒంటరి చేసింది.
Sorry, no posts matched your criteria.