Srikakulam

News April 4, 2026

శ్రీకాకుళం: జీడిపంటను దెబ్బతీస్తున్న తెగుళ్లు..నివారణ ఇదే!

image

శ్రీకాకుళం జిల్లాలో ఆదాయ వనరుగా నిలిచిన జీడిపంటకు క్యాటర్ పిల్లర్ తెగుళు సోకింది. జిల్లాలోని సుమారు 25వేల హెక్టార్లలో సాగు అవుతుండగా జీడిపూత, పిక్క తరుణంలో తెగుళ్ల బెడద‌తో నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీని నివారణకు ఉద్యానవన శాఖాధికారి శంకర్ దాస్‌‌ను అడుగగా..లీటర్ నీటికి ప్రోఫెక్ట్స్‌‌ 2మి.లీలు కలిపి పిచికారీ చేయాలన్నారు.

News April 4, 2026

శ్రీకాకుళం: కారు ఢీకొని మహిళ స్పాట్ డెడ్

image

కంచిలి మండలం భైరిపురం జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అరవ సిరియాపల్లికి చెందిన ఆశా వర్కర్ బుడ్డెపు కమల కుమారి (50) రోడ్డు దాటుతుండగా పలాస నుంచి ఇచ్ఛాపురం వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో కంచిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పారినాయుడు తెలిపారు.

News April 4, 2026

పాతపట్నం: ROB పనులకు రూ.15 కోట్ల నిధులు మంజూరు

image

పాతపట్నంలోని శ్రీ నీలమణి దుర్గ ఆలయం సమీపంలో జరుగుతున్న ROB పనులకు రూ.15 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు .ఈ నిధులు మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి జిల్లా ప్రజల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిధులు మంజూరు చేయడంతో నీలమణి దుర్గ అమ్మ వారి భక్తులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

News April 4, 2026

శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అలర్ట్..!

image

శ్రీకాకుళం జిల్లాలో శనివారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ ప్రఖర్ జైన్ శుక్రవారం తెలిపారు. 16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 2 మండలాల్లో వడగాల్పులకు అవకాశం ఉందని వెల్లడించారు. ఎండలు దృష్ట్యా అత్యవసమైతే తప్ప బయట తిరగరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.

News April 3, 2026

జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సిక్కోలు మహిళ

image

టెక్కలి సైనిక్ నగర్‌కు చెందిన మార్పు సాయి సృజన జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. తాజాగా గురువారం విడుదల అయిన ఫలితాల్లో ఈమె ఎంపికయ్యారు. టెక్కలిలో ప్రాథమిక, ఉన్నత విద్యను పూర్తిచేసిన ఈమె విజయవాడలో ఇంటర్ చదివారు. హైదరాబాద్ ఎన్టీఆర్ కళాశాలలో డిగ్రీ, ఢిల్లీ యూనివర్సిటీలో బీఎల్ చేశారు. ఈమె తండ్రి నారాయణమూర్తి ఆంగ్ల ఉపాధ్యాయులు కాగా, తల్లి గృహిణి. ఈమె ఎంపిక పట్ల పలువురు అభినందించారు.

News April 3, 2026

శ్రీకాకుళం: ‘నిబంధనల మేరకు ఎగ్జామినర్లను నియమించాలి’

image

పదో తరగతి మూల్యంకనం ఈ నెల 6వ తేదీ నుంచి జరగనున్న విషయం తెలిసిందే. ఈ స్పాట్ వాల్యేయేషన్ నిబంధనల మేరకు ఎగ్జామినర్ల నియమించాలని డీటీఎఫ్ నాయకులు కృష్ణారావు, హరి ప్రసన్న అన్నారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఉపాధ్యాయ సంఘ సమన్వయ కమిటీలో విద్యాశాఖ అధికారి రవిబాబు దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లారు. సబ్జెక్ట్ డీల్ చేయని వారిని ఎగ్జామినర్ల నియామకం సరికాదన్నారు.

News April 3, 2026

శ్రీకాకుళం: స్పాట్ వాల్యూయేషన్‌కు ఏర్పాట్లు

image

ఈనెల ఆరవ తేదీన పదో తరగతి జవాబు పత్రాల స్పాట్ మూల్యంకనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రభూషణ్, డీఈవో రవి బాబు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయ యూనియన్ నాయకులతో సమావేశం జరిగింది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎగ్జామినర్ల నియామకం ఉంటుందని చెప్పారు. మూల్యాంకన కేంద్రం వద్ద పూర్తిస్థాయి ఏర్పాట్లను చేస్తున్నట్లు వెల్లడించారు.