India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీలో ఈ నెల 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలకు సారవకోట ఐసీడీఎస్ సీడీపీఓ వంశీ ప్రియకు ఆహ్వానం అందింది. ఢిల్లీలోని రెడ్ పోర్ట్‌లో నిర్వహించే ఉత్సవాలలో ఆమె బయల్దేరనున్నారు. తనని ఎంపిక చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.
జిల్లా ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా చరిత్రకు సంబంధించిన ఒక అద్భుతమైన శాసన సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఈ శిలా శాసనంలో ప్రాచీనకాలంలో శ్రీకాకుళం పేరు “సికకోలీ గడ” అని ఉన్నట్లు గుర్తించారు. పర్లాకిమిడికి చెందిన ఎపిగ్రఫిస్ట్ బిష్ణు మోహన్ గుర్తించి చదివారు. బిష్ణు మోహన్ చేస్తున్న కృషికి ఎమ్మెల్యే శంకర్ ప్రత్యేకంగా అభినందించారు.
శ్రీకాకుళం ఉమెన్స్ కళాశాలకు చెందిన విద్యార్థినిని గంగోత్రికి రాష్ట్ర స్థాయి డిబేట్ పోటీల్లో ప్రథమ బహుమతి లభించింది. ఆర్టీఐ చట్టంపై ఇటీవల రాష్ట్రస్థాయి పోటీలు విజయవాడలో నిర్వహించారు. రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్ బి.శామ్యూల్ చేతులు చేతులమీదుగా అవార్డు అందుకున్నారని స్థానిక ప్రిన్సిపల్ సూర్యచంద్రరావు మంగళవారం తెలిపారు. కళాశాలలో విద్యార్థినిని అభినందించినట్లు ఆయన పేర్కొన్నారు.
పోలీస్ కుటుంబ సభ్యులకు సమస్య ఉంటే నేరుగా తనను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని జిల్లా SP మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు శ్రీకాకుళం SP కార్యాలయంలో ఉద్యోగులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. విశ్రాంత పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటామని, బెనిఫిట్స్ సకాలంలో అందేలా సత్వర చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్, ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం కోర్ట్ ఆవరణలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా రాజీలు చేసేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కేసులు విషయంలో అధిక శ్రద్ధ వహించాలని కోరారు. రాజీయే రాజమార్గమని ఆయన అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు మంగళవారం తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులు, ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో ఉండొద్దన్నారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
నులిపురుగులను నులిమేద్దామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో జరిగిన మాత్రల పంపిణీని కలెక్టర్ ప్రారంభించారు. నులిపురుగుల వలన పిల్లలు రక్తహీనతతో నీరస పడతారని వివరించారు. శారీరక, మానసిక, ఎదుగుదల లోపం వస్తుందన్నారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలలో మాత్రలు పంపిణీ చేయాలన్నారు.
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబంలో సందడి నెలకొంది. రామ్మోహన్ దంపతులకు మంగళవారం ఉదయం కుమారుడు జన్మించాడు. ఇప్పటికే ఒక కుమార్తె ఉండగా తాజాగా కుమారుడు జన్మించడంతో కుటుంబసభ్యులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పులివెందులలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రహసనం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం ఈ ఎన్నిక అన్నారు. జడ్పీటీసీ అభ్యర్థి కూడా ఓటు వేయకుండా అడ్డుకోవడం టీడీపీకే చెల్లిందని విమర్శించారు. దిగజారిన రాజకీయాలతో ఆనందాన్ని అనుభవించడం చంద్రబాబు నైజమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలోని ఎన్టీఆర్ వైద్యసేవ విభాగానికి 14 డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకానికి ఈనెల 2వ తేదీన నోటిఫికేషన్ విడుదలైన విషయం విదితమే. కాగా డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామక ప్రక్రియకు తాజాగా బ్రేక్ పడింది. జిల్లా కలెక్టర్, ఆసుపత్రి HDS Chairman ఆదేశాల మేరకు నియామక ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని శ్రీకాకుళం సర్వజన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.