India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జరిగిన పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమానికి 86 అర్జీలు వచ్చాయి. సోమవారం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శిరీష, పలువురు దరఖాస్తులు సమర్పించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన పథకంకు సంబంధించి అత్యధికంగా 21, రెవెన్యూ విభాగానికి 20, వ్యవసాయ శాఖకు 11, విద్యుత్ తదితర శాఖలకు సంబంధించి వినతులు వచ్చాయని కలెక్టర్ అన్నారు.
అనాథ పిల్లలకు సంరక్షణ కల్పించే ఉద్దేశంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఫోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తల్లిదండ్రులు లేని పిల్లలకు తాత్కాలికంగా లేదా, శాశ్వతంగా సంరక్షించే విధానమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆయన అన్నారు.
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో నిర్వహిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలపై వినతులు ఇచ్చేందుకు Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను వినియోగించుకోవాలన్నారు. వాటి పరిష్కార స్థితి తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు.
అక్టోబర్ 4,5 తేదీల్లో సోంపేటలోని జరిగే సీఐటీయూ శ్రీకాకుళం జిల్లా 12వ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అమ్మన్నాయుడు, తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఆ సంఘం కార్యాలయంలో వారు సమావేశం నిర్వహించారు. ధరల పెరుగుదల, అవసరాలు దృష్టిలో పెట్టుకొని కార్మికుల కనీస వేతనం నెలకు రూ. 26,000లగా నిర్ణయించి అమలు చేయాలన్నారు.
రైతుల అభ్యున్నతి, వ్యవసాయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం కోటబొమ్మాళి మండలం నిమ్మడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రైతు అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లాలోని రైతులకు రూ.186 కోట్లు అన్నదాత సుఖీభవ నిధులు అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పాల్గొన్నారు.
ఆగస్టు 14న జిల్లాస్థాయి ప్రాచీన గ్రామీణ క్రీడలు పోటీలు నిర్వహిస్తామని డీఎస్‌డీఓ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఏర్పాటై 75 ఏళ్లైన సందర్భంగా ఆ రోజు ఉదయం 9 గంటలకు కోడి రామమూర్తి క్రీడా ప్రాంగణంలో పురుషులు, మహిళలకు కర్రసాము పోటీలు ఉంటాయన్నారు. సంగిడి, ముద్దార్, పిల్లిమొగ్గలు కేవలం పురుషులకు మాత్రమేనని చెప్పారు.
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సీనియర్ సహాయకుడిగా పనిచేస్తున్న శోభనాద్రిని సస్పెండ్ చేశారు. ఈవో ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయంలో పారిశుద్ధ్య లోపంపై ఉన్నతాధికారుల అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో ఈయనపై వేటు పడింది.
తోబుట్టువుల ఆప్యాయతకు ప్రతీక రక్షా బంధన్. కష్టాల్లో తోడుగా నిలుస్తానంటూ సోదరుడు చెప్పే మాట సోదరికి కొండంత బలాన్నిస్తుంది. చిన్ననాటి నుంచి ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు, అల్లరి చేష్టలు, కోపతాపాలు ఎన్నున్నా.. ఎవరికి ఇబ్బంది కలిగినా మరొకరు తల్లడిల్లిపోతారు. కళ్లు చెమ్మగిల్లుతాయి. ప్రేమలు, ఆప్యాయతల కలబోత వీరి బంధం. మరి ఈ రక్షా బంధన్‌కు మీకు రాఖీ కట్టిన సోదరికి కామెంట్ చేసి విషెస్ చెప్పండి.
రాఖీ పౌర్ణమి సందర్భంగా చాలా ఏళ్ళుగా సాంప్రదాయ పద్ధతిలో దుకాణాలు, సమీపంలో ఏర్పాటు చేసిన అంగట్లో రాఖీలు, మిఠాయిలు కొనడం ఆనవాయితీ. అయితే మారుతున్న కాలం, సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల వినియోగదారులు ఆన్లైన్ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో స్థానికంగా రాఖీల కొనుగోళ్లు మందగించాయి. చాలా చోట్ల దుకణాలు వెలవెలబోతూ కనిపించాయి. పెట్టుబడులు కూడా రావడం కష్టమేనని చిరు వ్యాపారులు దిగులు చెందుతున్నారు.
సరుబుజ్జిలిలోని నందికొండ కాలనీకి చెందిన పల్లి వీరవెంకట దుర్గాప్రసాద్‌పై బప్పడాం గ్రామానికి చెందిన పేడాడ శ్రీధర్ కత్తితో దాడి చేసినట్లు సరుబుజ్జిలి ఎస్సై హైమావతి తెలిపారు. స్నేహితులైన వీరిద్దరూ సెల్ ఫోన్ విషయంలో గొడవపడ్డారన్నారు. గురువారం రాత్రి ప్రసాద్‌ను బప్పడాం తీసుకెళ్లి దాడి చేయడం వలన శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఫిర్యాదు మేరకు శుక్రవారం శ్రీధర్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.