India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ నెల అక్టోబర్ 18న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె.కవిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఫిర్యాదుదారుల నుంచి వినతుల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవిల్లి శ్రీసూర్యనారాయణ స్వామివారిని సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి గురువారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వదించారు. ఆయనకు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలు అందజేశారు. ఆలయ డీసీ వై.భాద్రజీ పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో మరో 6 రీచ్‌ల నిర్వహణ హక్కులకు సీల్డ్ టెండర్లు కోరుతున్నట్టు మైన్స్ శాఖ DD మోహనరావు తెలిపారు. పురుషోత్తపురం-1, పురుషోత్తమపురం-2 (సరుబుజ్జిలి), ముద్దాడపేట (ఎచ్చెర్ల), కిల్లిపాలెం(శ్రీకాకుళం), ముద్దాడపేట(అమదాలవలస), పర్లాం(నరసన్నపేట) రీచ్‌ల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 18న ఉదయం11 గంటల లోపు టెండర్లు దాఖలు చేయాలన్నారు.
టెక్కలి జిల్లా ఆసుపత్రిలోని ట్రామాకేర్ విభాగంపై నిర్లక్ష్యం ఉందని పలువురు రోగులు వాపోతున్నారు. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి సత్వర చికిత్స అందించేందుకు ఈ విభాగం పని చేస్తుంది. ప్రస్తుతం ఈ విభాగంలో వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదని రోగులు వాపోతున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యారావు మాట్లాడుతూ.. ట్రామాకేర్‌లో ప్రస్తుతం ఐదుగురు ఉన్నారన్నారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినప్పటికీ మధ్యాహ్నం వరకు సముద్రంపై ఆ ప్రభావం కొనసాగుతూనే ఉంటుందని వెల్లడించింది. సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొంది. సాధారణ రోజుల కంటే 1.5 మీటర్ల ఎత్తు అదనంగా అలలు ఎగసిపడే అవకాశం ఉందని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రజలు బీచ్‌ల వద్దకు వెళ్లకపోవడం మంచిది.
బాలికను మోసం చేసిన ఓ యువకుడిపై పలు కేసులు నమోదు అయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. సారవకోట మండలానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో తన గ్రామంలోని బాలికకు దగ్గరయ్యాడు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె గర్భం దాల్చినట్లు తెలిసింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో యువకుడిపై పోక్సో, అత్యాచారం, అట్రాసిటీ కేసులు నమోదు చేశామని SI అనిల్ కుమార్ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు నిక్షిప్తమైన సీసీ కెమెరాలు పూర్తిగా పరిశీలించి, జిల్లాలోని నిర్మానుష్యమైన ప్రదేశాలలో కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఎస్పీ మహేశ్వర రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ..జిల్లాలోని అన్ని సీసీ కెమెరాలు జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కి అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షణలో ఉండేటట్లు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
సారవకోట మండలం అర్లి గ్రామం నుంచి గోవర్థనపురం గ్రామానికి బీటీ, సీసీ రోడ్డు పనులకు బగ్గు రమణమూర్తితో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ..పల్లె పండుగ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఇప్పటివరకు రూ.261 కోట్లతో 3,071 పనులు మంజూరు చేయడం జరిగిందన్నారు. మరిన్ని పనులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. ఆర్డీవో కృష్ణమూర్తి, ప్రతినిధులు పాల్గొన్నారు.
శ్రీకాకుళంలోని గవర్నమెంట్ DLTC కాలేజీలో ఈనెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ హబ్ కోఆర్డినేటర్ N.శేషగిరి తెలిపారు. పలు కంపెనీలు పాల్గొంటాయన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ITI, పూర్తి చేసి 18-24 ఏళ్లు కలిగిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ LLB 3 సంవత్సరానికి సంబంధించి 2, 4 సెమిస్టర్ల పరీక్ష టైం టేబుల్ విడుదలైంది. వర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ.. 2వ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, 4వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షలు ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు ఉంటాయన్నారు.
Sorry, no posts matched your criteria.