India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్వర్ణాంధ్ర @ 2047 కార్యాచరణలో భాగంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన జీరో పావర్టీ-పీ4 విధానం ప్రక్రియ జిల్లాలో మొదలైందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్ (పీ4) విధానానికి ఉగాది నుంచి ప్రారంభం కానుందని కలెక్టర్ తెలిపారు.
పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులను సత్వరమే మంజూరు చేసి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జూమ్ ద్వారా సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై కలెక్టర్ జిల్లాలోని ఆయా ఉన్నతాధికారులతో కలిసి చర్చించారు.
ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ఫిర్యాదులు చేశారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. మొత్తం 52 వినతిపత్రాలు స్వీకరించామన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ పరీక్షకు 351 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా ఆర్ఐఓ పీ.దుర్గారావు తెలిపారు. జిల్లాలో జనరల్, ఒకేషనల్ కలిపి 17,523 మందికి గాను 17,171 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని తెలిపారు. కాగా సోమవారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఆర్ఐఓ పేర్కొన్నారు.
సోంపేట మండలం కొర్లాం పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీగా పనిచేసిన తామాడ గణపతి సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన భార్య తామాడ భారతి కూడా సరిగా 5 రోజుల ముందు మరణించడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా పనిచేశారు.
అరసవల్లి సూర్యభగవానుడు రెండో రోజు కూడా భక్తులను కరుణించలేదు. వాతావరణం మబ్బులతో ఉండటంతో సూర్యకిరణాలు ఆదివారం ఆదిత్యుడిని తాకలేదు. దీంతో ఎంతో ఆశతో దర్శనానికి వచ్చిన భక్తులకు నిరాశే ఎదురైంది. రెండో రోజు సోమవారం కూడా మంచు, మబ్బులు కారణంగా భానుడు ఆదిత్యుని పాదాలు తాకలేదు.
గార మండలంలోని చిన్నవత్సవలస రాజమ్మ తల్లి జాతర సముద్ర స్నానాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం జి. సిగడాం మండలం దేవరవలసకు చెందిన తండ్రీ, కొడుకులు కొడమటి ఈశ్వరరావు, అశోక్(23) సముద్ర స్నానానికి వెళ్లగా అలల తాకిడికి గల్లంతయ్యారు. తోటివారు కేకలు వేయడంతో మెరైన్ పోలీసులు స్పందించి, తండ్రి ఈశ్వరరావును ఒడ్డుకు తీసుకొచ్చారు. అశోక్ ఆచూకీ దొరకలేదు. ఎస్ఐ జనార్దన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రేపు (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జడ్పీ సమావేశ మందిరంలో జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలోని సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందని డీసీహెచ్ కళ్యాణ బాబు ఆదివారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 10-15 తేదీల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియేటర్ అసిస్టెంట్, ఆడియోమెట్రీషియన్, ఎలక్ట్రీషియన్, జనరల్ డ్యూటీ అటెండర్, ప్రింటర్ పోస్టులకు ఖాళీలకు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
టెక్కలి మండలం గోపినాధపురానికి చెందిన బెండి దీపక్ (16) అనే బాలుడు ఆదివారం నూతిలో పడి మృతి చెందాడు. స్థానికుల కథనం.. దీపక్ తన స్నేహితులతో కలిసి గోపీనాథపురం సమీపంలో ఉన్న నూతికి స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నూతిలో పడిపోయాడని తెలిపారు. దీంతో స్థానికులు హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.