Srikakulam

News March 9, 2025

శ్రీకాకుళం : ఇద్దరు మృతి .. నేత్రాలు సజీవం

image

శ్రీకాకుళం పట్టణంలోని మంగువారితోటకు చెందిన గుడ్ల లక్ష్మణరావు (69), ఎల్.బి.ఎస్ కాలనీకి చెందిన వడ్డీ పద్మావతి(80) ఆదివారం మృతి చెందారు. వీరి నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ జగన్మోహన్ రావుకు సమాచారమిచ్చారు . మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రానికి చెందిన ఐ టెక్నీషియన్ సుజాత, ఉమా శంకర్ ఆధ్వర్యంలో వారి కళ్లు సేకరించారు.

News March 9, 2025

కవిటి : మరణంలోనూ తోడు వీడని అన్నదమ్ములు

image

కవిటి మండలం దూగాన పుట్టుగ గ్రామానికి చెందిన అన్నదమ్ములు దూగాన తులసీదాస్, దుగాన చంద్రశేఖర్ 15 రోజులు వ్యవధిలో మరణించారు. అనారోగ్య కారణాలతో తులసీదాస్ ఫిబ్రవరి 11న మరణించగా.. 15 రోజులకు మహా శివరాత్రి (ఫిబ్రవరి 26) రోజున అన్న చంద్రశేఖర్ మరణించారు. అన్నదమ్ముల మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కాగా వారికి నేడు పెద్దకర్మ.

News March 9, 2025

కవిటి : ట్రైన్ నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

కవిటి మండలం కరాపాడు రైల్వే గేటు సమీపంలో పట్టాలపై శనివారం ఓ వ్యక్తి మృతి చెందాడు. రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పలాస జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా గోపాల్ పూర్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 9, 2025

నాటు సారా రహిత జిల్లాగా శ్రీకాకుళం: కలెక్టర్

image

నాటు సారా రహిత జిల్లాగా శ్రీకాకుళాన్ని తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం చేపట్టిన నవోదయం వెలుగు 2.0 పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రస్తుతం జిల్లాలో 110 గ్రామాలను నాటు సారా ఊరులగా గుర్తించామన్నారు. వీటిని ఏ, బీ, సీ, లుగా విభజించి సారాతో కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తామన్నారు. 

News March 8, 2025

టెక్కలిలో రైలు ఢీకొని వృద్ధుడు మృతి

image

టెక్కలి మండలం ధర్మనీలాపురానికి చెందిన కృష్ణారావు(65) శనివారం సాయంత్రం గుర్తు తెలియని రైలు ఢీకొని మృతిచెందాడు. స్థానికుల వివరాల మేరకు గ్రామానికి చెందిన కృష్ణారావు రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడని చెప్పారు. అనంతరం కుటుంబీకులకు సమాచారం అందించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 8, 2025

శ్రీకాకుళం : ఇంటర్ పరీక్షకు 711 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ పరీక్షకు 711 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఆర్ఐఓ పీ.దుర్గారావు తెలిపారు. జిల్లాలో జనరల్, ఓకేషనల్ విద్యార్థులు 20,882 మందికి గాను 20,170 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. శనివారం జరిగిన పరీక్షలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని, ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.

News March 8, 2025

శ్రీకాకుళం: కేసుల దర్యాప్తులో పురోగతి సాధించాలి

image

అపరిష్కృతంగా ఉన్న అదృశ్య (మిస్సింగ్) కేసులపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తులో పురోగతి సాధించాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయం నుంచి జామ్ మీటింగ్ నిర్వహించారు. వర్చువల్ గా డీఎస్పీ, సీఐ, ఎస్సైలు హాజరయ్యారు. మిస్సింగ్, రోడ్డు ప్రమాదాల కేసులు దర్యాప్తు, విచారణ, హిట్ అండ్ రన్ కేసుల దర్యాప్తు గురించి ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.

News March 7, 2025

కవిటి: ఇరాక్‌లో వలస కూలీ మృతి

image

విదేశాలకు కూలీ పనికి వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కవిటి మండలంలో జరిగింది. మండలంలోని ఆర్ బెలాగానికి చెందిన భుజంగరావు(43) ఇరాక్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఆయన మృతిచెందడంతో తోటి కూలీలు ఫోన్ ద్వారా కుటుంబీకులకు చెప్పారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు మృతదేహన్ని దేశానికి రప్పించి.. కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే అశోక్ బాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు.

News March 7, 2025

శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షకు 385 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ పరీక్షకు 385 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా ఆర్ఐఓ పి.దుర్గారావు తెలిపారు. జిల్లాలో మొత్తం 19,149 మంది విద్యార్థులకు గాను 18,763 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. కాగా జిల్లాలోని పొందూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి మాథ్స్ 2A పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడినట్లు ఆయన తెలిపారు.

News March 7, 2025

శ్రీకాకుళం జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

image

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. శ్రీకాకుళం వాసులు ఎక్కువగా విశాఖ, విజయనగరం జిల్లాలకు వెళ్తుంటారు. విశాఖలో ఇంజినీరింగ్ కాలేజీలు ఉండటంతో విద్యార్థినీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా విశాఖ, విజయనగరం వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై కామెంట్.

error: Content is protected !!