India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలిలో నోటాకు రాష్ట్రంలోనే అత్యధికంగా 3.79% ఓట్లు పడ్డాయి. మొత్తంగా 7,342 మంది నోటాకు ఓటేశారు. ఈవీఎంలలో 3,660 మంది, పోస్టల్ బ్యాలెట్లలో 3,682 మంది నోటాకు జై కొట్టారు. పోలైన 1,93,713 ఓట్లలో అచ్చెన్న 55.71% ఓట్లు సాధించి టెక్కలిలో గెలిచారు. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తన నివేదికలో వెల్లడించింది.
శ్రీకాకుళం జిల్లాలో బుధవారం కుండపోత వర్షం కురిసింది. దీంతో ఎల్ఎన్ పేట, తదితర మండలాల్లో వంద ఎకరాల పంటపొలాలు నీట మునిగాయి. ఈ ఏడాది ఖరీఫ్ సాగు సీజన్ ప్రారంభంలోనే ఇలా జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనం వేసి నెల రోజులు కూడా పూర్తి కాలేదని, మొక్కదశలో ఉన్న పంట పొలాలు నీట మునగటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పార్వతిపురం జిల్లా వైశ్య సభ్యులకు రాష్ట్ర స్థాయి వైశ్య సంఘంలో చోటు కల్పించాలని టీడీపీ బీసీ సాధికారిక జిల్లా కో-ఆర్డినేటర్ కోరాడ రాజేశ్ కోరారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు వైశ్యులకు చేరాలన్నా, జిల్లా వైశ్య కుటుంబాలు సమస్యలు చెప్పాలన్నా రాష్ట్ర కమిటీలో జిల్లా వైశ్య సభ్యులకు చోటు కల్పించాలన్నారు. వైశ్యుల సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు.
విశాఖపట్నం రేంజ్ నూతన డీఐజీగా బుధవారం బాధ్యతలు చేపట్టిన గోపీనాథ్ జెట్టిని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి బుధవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు భేటీ అయ్యి శ్రీకాకుళంలోని పలు విషయాలను ఎస్పీ మహేశ్వర రెడ్డిని డీఐజీ అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీకి సూచించారు. ఎస్పీ వెంట జిల్లాలో పలువురు పోలీసు అధికారులు ఉన్నారు.
సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మూలపేటతో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్ పోర్టులు నిర్మించేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. 1,800 ఎకరాల భూమి అవసరం అవుతుందని ప్రభుత్వానికి ఏఏఐ వర్గాలు తెలిపాయి. ఆ శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండటంతో వేగంగా ఆచరణలోకి రావొచ్చనే చర్చలు ఊపందుకున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గురువారం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడా వర్షాలు పడతాయని కూర్మనాథ్ చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఆశా కార్యకర్తలు బుధవారం మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడును కలిసి వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి కోరారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.
శ్రీకాకుళం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పీజీ ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి B.P.Ed, D.P.Ed 2వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగుతాయన్నారు.
ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఉద్యమ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలిగా సంధ్య గజపతిరావు చౌదరి బుధవారం నియామకం అయ్యారు. ఈ మేరకు విజయనగరంలోని ఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకులు ఆమెకు నియామక పత్రం అందజేశారు. ఈమె ఎచ్చెర్ల మండలంలోని సంతసీతారాంపురం గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో పలువురు ప్రశంసిస్తున్నారు. చెరువులు ఆక్రమణకు గురి కాకుండా ఉండేందుకు చర్యలు చేపడతామని సంధ్య స్పష్టం చేశారు.
ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు డాక్టర్ పారుపల్లి శ్రీనివాసరావు(పీఎస్ఆర్) విద్యా, సామాజిక రంగాల్లో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా నేషనల్ గ్లోబల్ ఐకాన్ అవార్డు లభించింది. ఈ మేరకు బుధవారం వర్చువల్ విధానంలో ఆయనకు సర్టిఫికెట్ అందించారు.
Sorry, no posts matched your criteria.