India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గార(M) శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రానికి పాలకవర్గ సభ్యులును నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్‌గా(వంశపారంపర్య ధర్మకర్త) గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు వ్వవహరిస్తారు. తొమ్మిది మంది సభ్యులుగా సంయుక్త, కుసుమకుమారి, పెంటయ్య, శ్రీనివాసరావు, మునీక, శ్వేతబిందు, సూరిబాబు, కళ్యాణచక్రవర్తి, లక్ష్మిలను నియమించింది. అఫీషియో మెంబర్‌గా సీతారామనృసింహులు ఎన్నికయ్యారు.

రైతులు ఎరువులకు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రైతులను భరోసా కల్పించారు. శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్‌కు పలువురు రైతులు తమకున్న ఎరువుల సమస్యలను ఫోన్‌లో కలెక్టర్‌కు వివరించారు. సంతబొమ్మాళి మండలం మేఘవరం గ్రామానికి చెందిన ఎల్.సోమేశ్వరరావు, శ్రీముఖలింగం గ్రామానికి చెందిన రాజశేఖర్ నాయుడు, SM పురానికి చెందిన ఈశ్వరరావుతో పాటు పలు రైతులు సమస్యలను తెలియజేశారు.

కోటబొమ్మాళి మండలం కిష్టపురానికి చెందిన జూనియర్ లైన్‌మెన్ సురేష్ (32) విద్యుత్ షాక్‌కు గురై శుక్రవారం మృతి చెందారు. స్థానిక ఏఈ ఆధ్వర్యంలో కిష్టపురంలో సూరేశ్ మరి కొంతమందితో కలిసి 33KV విద్యుత్ లైన్ల మర్మతులు చేస్తున్నాడు. కరెంటు వైర్లకు చెట్టు అడ్డు రావడంతో కత్తితో తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.

మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు DMHO డాక్టర్ అనిత తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వస్థనారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంపై ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు స్త్రీల ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను జిల్లావ్యాప్తంగా వినియోగిస్తామన్నారు.

పలాసకు చెందిన ఓ బాలుడు హైదరాబాదులో ఉంటున్న వాళ్ల పెద్దమ్మ ఇంటికి వెళ్లాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా గురువారం పలాస రైల్వే స్టేషన్‌లో విశాఖఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. గురువారం అర్ధరాత్రికి రైలు గుంటూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఒంటరిగా ప్రయాణిస్తున్న బాలుడిని గమనించిన రైల్వే పోలీసులు వివరాలను అడిగగా తనది పలాస అని చెప్పాడు. ఈ బాలుడిని గుంటూరు రైల్వే ఛైల్డ్ హెల్ప్ లైన్ సంరక్షణలో ఉంచారు.

శ్రీకాకుళం జిల్లాలోని పలు స్టేషన్ల మధ్య ట్రాక్ మరమ్మతుల కారణంగా బ్రహ్మపూర్- విశాఖ మధ్య నడిచే ప్యాసింజర్‌ను కొద్ది రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నంబర్ (58531, 58532) గల ట్రైన్‌ను ఈ నెల 15 నుంచి 27 వరకు రద్దు చేస్తున్నామని తూర్పు కోస్తా రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేసింది.

రైతులు ఎరువుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. గురువారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్‌కు పలువురు రైతులు ఫోన్ చేసి తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. రైతుల వివిధ రకాల సమస్యలను తెలుసుకుని సంబంధిత మండల వ్యవసాయ అధికారులకు రైతులకు కాన్ఫరెన్స్ ఫోన్ కాల్‌కి తీసుకొని ఎరువులకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

నేపాల్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వాసులు గురువారం సురక్షితంగా విశాఖపట్నం చేరుకున్నారు. జిల్లా వాసులను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం కలిసి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో జిల్లా వాసులను క్షేమంగా తీసుకురాగలిగామన్నారు.

ఎల్.ఎన్.పేట మండలం బసవరాజుపేట గ్రామానికి చెందిన వాన అప్పలనాయుడు (45) పాముకాటుకు గురై మృతి చెందాడు. అప్పలనాయుడు గురువారం పొలంలో ఎరువులు వేస్తున్న సమయంలో కాలుకి పాము చుట్టుకుని కాటు వేసింది. పాము కాటును గుర్తించిన అప్పలనాయుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు వెంటనే 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

నేపాల్‌లో నెలకొన్న అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్ ఆదేశాల మేరకు ఈ సేవలను తక్షణం అందుబాటులోకి తీసుకువచ్చారు. నేపాల్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులు ఈ నంబర్‌కు 94912 22122 ఫోన్ చేసి సహాయం పొందవచ్చన్నారు.
Sorry, no posts matched your criteria.