Visakhapatnam

News September 10, 2024

పల్లా శ్రీనివాసరావుకు అస్వస్థత..!

image

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల విజయవాడ వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ఆయన మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయనకు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన అవసరం లేదని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

News September 10, 2024

అల్లూరి: అలిగి పుట్టింటికి వచ్చి మృతి

image

గూడెం కొత్తవీధి మండలం చట్రాపల్లికి చెందిన పండన్న పెద్ద కుమార్తె కొర్ర కుమారి(20)కి రెండేళ్ల క్రితం చింతపల్లి మండలం దోమలగొందికి చెందిన రాజుతో వివాహమైంది. భర్త తరచూ తాగి ఇంటికి వస్తుండడంతో గొడవలు జరుగుతున్నాయి. దీంతో వారం రోజుల క్రితం కుమారి భర్తపై అలిగి చట్రాపల్లి పట్టింటికి వచ్చేసింది. కొండచరియలు పండన్న ఇంటిపై పడడంతో నిద్రలోనే ఆమె మృతి చెందింది. కుమారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 10, 2024

విశాఖ రేంజ్ పరిధిలో 9 మంది సీఐలు బదిలీ

image

విశాఖ రేంజ్ పరిధిలో 9 మంది సీఐలను బదిలీ చేస్తూ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఉత్తర్వులను జారీ చేశారు. నర్సీపట్నం టౌన్లో పనిచేస్తున్న త్రిపురాన క్రాంతికుమార్‌ను వీఆర్‌కు, వీఆర్‌లో ఉన్న సీఐ వానపల్లి నాగరాజును శ్రీకాకుళం ట్రాఫిక్ సీఐగా, ఎంవీవీ రమణమూర్తిని విజయనగరానికి, బుచ్చిరాజును అనకాపల్లి పీసీఆర్ సీఐగా, జీ.దుర్గాప్రసాద్‌ను అల్లూరి సోషల్ మీడియా సైబర్ సెల్ సీఐగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 10, 2024

నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాస్తారోకో

image

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూర్మన్నపాలెం వద్ద నేడు రాస్తారోకో నిర్వహించనున్నారు. ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని 1306 రోజుల నుంచి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని, పూర్తి సామర్థ్యంతో నడపాలని వేతనాలు సక్రమంగా చెల్లించాలని రాస్తారోకో చేస్తున్నట్లు కార్మికులు తెలిపారు.

News September 10, 2024

విశాఖ: సెలవుపై వెళ్లాలంటూ సీఎండీకి ఆదేశం?

image

విశాఖ స్టీల్ ప్లాంట్ సిఎండి అతుల్ భట్‌ను సెలవుపై వెళ్లాలని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సీఎండీ బాధ్యతలను వెంటనే అదనపు డైరెక్టర్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా సీఎండీపై కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ తీవ్ర అసంతృప్తితో ఉండడం వల్లే ఆయనను సెలవు వెళ్లాలని ఆదేశించినట్లు తెలిసింది. సీఎండీగా అతుల్ భట్ 2021 సెప్టెంబర్ 13న బాధ్యతలు స్వీకరించారు.

News September 9, 2024

అనకాపల్లి: 1,528 హెక్టార్లలో నష్టం..!

image

భారీ వర్షాలకు అనకాపల్లి జిల్లాలో 4,420 మంది రైతులకు సంబంధించిన 1,528 హెక్టార్లలో వరి పంట నీట మునిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు తెలిపారు. పొలాల్లో నీరు బయటకు పోయిన తర్వాత ఎకరం విస్తీర్ణం వరి పొలంలో 20 కిలోల యూరియా, 20 కిలోల పొటాష్ ఎరువులు వేయాలన్నారు. చీడపీడలు సోకకుండా గ్రాము కార్బండిజం పొడిని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు.

News September 9, 2024

పాడేరు: రేపు కూడా సెలవు

image

అల్లూరు జిల్లాలో మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలకు సెలవు వర్తిస్తుందని చెప్పారు.

News September 9, 2024

కైలాసగిరిపై ప్రమాదం… క్షతగాత్రులకు సీపీ పరామర్శ

image

విశాఖ కైలాసగిరిపై ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది వరకు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.

News September 9, 2024

కైలాసగిరిపై బస్సుకు బ్రేక్ ఫెయిల్

image

విశాఖ కైలాసగిరి కొండపై సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపై నుంచి కిందకు దిగుతున్న బస్సుకు బ్రేక్ ఫెయిల్ అయ్యింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి మొదటి మలుపు వద్ద గోడను ఢీకొట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న 16 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. బాధితులను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 9, 2024

వారికి సందేశాలు పంపి అలెర్ట్ చేయాలి: హోం మంత్రి

image

కోస్తాంధ్రలోను అతి భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ సమాచరం నేపథ్యంలో రాబోయే 72 గంటలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హోం మంత్రి అనిత సూచించారు. ఉత్తరాంధ్రను వానలు ముంచెత్తడంతో విజయవాడ నుంచి ఆమె విశాఖకు బయలుదేరారు. విపత్తుల నిర్వహణ శాఖను అప్రమత్తం చేశారు. వంశధార, నాగావళి, బహుదా పరివాహక ప్రాంతాల ప్రజల మొబైళ్లకు ఎప్పటికప్పుడు అలెర్ట్ సందేశాలు పంపి అప్రమత్తం చేయాలని సూచించారు.