Visakhapatnam

News August 18, 2025

కాల్పులు జరిపి వ్యక్తిని పట్టుకున్న పోలీసులు

image

విశాఖలోని చిలకపేటలో ఆదివారం చేపల రాజేశ్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. నిందితుడు నూకరాజుని పోలీసులు శ్రీకాకుళంలో పట్టుకున్నారు. విచారణ నిమిత్తం విశాఖపట్నం తరలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 18, 2025

ఎండాడ: సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు

image

సముద్రంలో ఎండాడకు చెందిన జాలరి పిల్లా సతీష్ (24) గల్లంతయ్యాడు. అలల ఉద్ధృతికి తీరంలో ఆరబెట్టిన వలలు కొట్టుకుపోతుండగా.. వాటి కోసం వెళ్లి సముద్రంలో కొట్టుకుపోయాడు. మధ్యాహ్నం వరకూ చూసిన తండ్రి వీర్రాజు తమ వారితో తీరంలో వెతికినా జాడ లేకపోవడంతో ఎంవీపీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టారు.

News August 18, 2025

విశాఖ: గీత కులాలకు 10 మద్యం బార్లు కేటాయింపు

image

గెజిట్ బార్ పాలసీకి అనుగుణంగా జీవీఎంసీ పరిధిలో గీత కులంలోని ఉపకులాలకు పది మద్యం బార్ల కేటాయింపు ప్రక్రియ సోమవారం జరిగింది. ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు, దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టరేట్ వీసీ హాలులో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ డ్రా తీసి అర్హులను ఎంపిక చేశారు. ఈ మద్యం దుకాణాల కేటాయింపుల్లో 6 శెట్టిబలిజ, 4 యాత కులానికి దక్కినట్లు తెలిపారు.

News August 18, 2025

ఆల్ ఇండియా లిబరల్ పార్టీకి కలెక్టర్ షోకాజ్ నోటీసు

image

గడిచిన ఆరేళ్లలో ఏ ఒక్క ఎన్నికల్లో పోటీ చేయని, రిజిస్టర్ అయ్యి గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసిందని ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆల్ ఇండియా లిబరల్ పార్టీకి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఆ పార్టీ ప్రతినిధులు సెప్టెంబర్ 8వ తేదీలోగా రాష్ట్ర ఎన్నికల సంఘం ముందు హాజరు కావాలన్నారు.

News August 18, 2025

ఉక్కు ప్రైవేటీకరణ పాపం కూటమి ప్రభుత్వానిదే: అమర్నాథ్

image

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ అంశంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 34 విభాగాలను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు టెండర్లు పిలిచినా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. ప్రధాని ముందే ప్రైవేటీకరణ ఆపాలని చెప్పిన పార్టీ వైసీపీ అని అన్నారు.

News August 18, 2025

సంక్షేమ వసతి గృహాల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తాం: మంత్రి

image

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ వసతి గృహాల్లో పూర్తి స్థాయిలో వసతులు కల్పించేలా చర్యలు చేపట్టాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. విశాఖ గీతం యూనివర్సిటీ వేదికగా తొమ్మిది జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో రీజినల్ వర్క్ షాప్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వసతి గృహాలలో ఉన్న సమస్యలు, విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు.

News August 18, 2025

గంట ఆలస్యంగా బయలుదేరనున్న విశాఖ- రాజమండ్రి ప్యాసింజర్

image

విశాఖ నుంచి సోమవారం రాత్రి 7:20 గంటలకు రాజమండ్రి ప్యాసింజర్ బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రతిరోజు విశాఖ నుంచి సాయంత్రం 6:20 గంటలకు ఈ పాసింజర్ బయలుదేరుతుందని.. అయితే అనివార్య కారణాలవల్ల గంట ఆలస్యంగా సోమవారం బయలుదేరుతుందని వివరించారు. ప్రయాణికులు దీన్ని గమనించాలని కోరారు.

News August 18, 2025

విశాఖ: డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో ఉచిత శిక్షణ

image

డిజిటల్ మార్కెటింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు నేక్ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ సోమవారం తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసి 18-45 సంవత్సరాలలోపు ఎస్సీ కులాలకు చెందిన యువత అర్హులన్నారు. 3 నెలల శిక్షణ అనంతరం ప్రైవేట్ సెక్టార్‌లో ఉపాధి కల్పిస్తారన్నారు. మహారాణిపేటలోని నేక్ సెంటర్లో శిక్షణ అందిస్తామని చెప్పారు.

News August 18, 2025

అధికారులతో విశాఖ ఇన్‌ఛార్జ్ మంత్రి భేటీ

image

విశాఖ సర్క్యూట్ గెస్ట్ హౌస్‌లో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డా.డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి జిల్లా ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పాల్గొన్నారు. రెండు రోజులుగా విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకున్న చర్యలపై సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఆరా తీశారు. అనంతం గీతం కాలేజీకి బయలుదేరి వెళ్లారు.

News August 18, 2025

విశాఖలో అంగన్వాడీ కేంద్రాలకు సెలవు లేదా?

image

అల్పపీడనం నేపథ్యంలో విశాఖలో అనేక ప్రాంతాలు జలమయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సోమవారం ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. అయితే అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ఇవ్వకపోవడంతో ఏదో విధంగా తల్లిదండ్రులు చిన్నారులను పంపిస్తున్నారు. స్కూల్, కాలేజీలు సెలవులు ఇచ్చి అంగన్వాడీలకు ఇవ్వకపోవడంతో చిన్నారులకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.