Visakhapatnam

News August 17, 2025

కలెక్టరేట్లో రేపు యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజల నుంచి వినతి పత్రాల సేకరించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వాసుల సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News August 17, 2025

సమస్య ఉంటే ఫోన్ చెయ్యండి: విశాఖ మేయర్

image

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరవాసులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చిన నేరుగా తనకు తెలియజేయాలని మేయర్ పీలా శ్రీనివాసరావు కోరారు. గ్రేటర్ పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా లోతట్టు, కొండవాలు, తీర ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా 99668 29999 నంబరుకు వెంటనే సంప్రదించాలని సూచించారు.

News August 17, 2025

విశాఖ జిల్లాలో 358 మి.మీ వర్షపాతం నమోదు

image

గడిచిన 24 గంటల్లో విశాఖ జిల్లాలో 358.8 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా మహారాణిపేట మండల పరిధిలో 66.6 మి.మీ, అత్యల్పంగా ములగాడలో 14.4 మి.మీ. వర్షపాతం నమోదయింది. సీతమ్మధారలో 49.8 మి.మీ, పద్మనాభం-46.8 మి.మీ, పెందుర్తి-43.4 మీ.మీ, భీముని పట్నం-40.6 మి.మీ, ఆనందపురం-21.2మి.మీ, పెదగంట్యాడ-20 మి.మీ, గోపాలపట్నం-19.4 మి.మీ, విశాఖ రూరల్ 19.2 మి.మీ, గాజువాక మండల పరిధిలో 14.6 మి.మీ వర్షపాతం నమోదయింది.

News August 17, 2025

ఓటు గల్లంతుపై నిరసనలు చేస్తాం: కాంగ్రెస్

image

ఓట్ గల్లంతుపై రేపటి నుంచి 175 నియోజకవర్గాల్లో నిరసనలు చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. నగర కాంగ్రెస్ నేతలతో కలిసి కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీహార్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అన్యాయం చేసేలా బీజేపీ కుతంత్రాలు పాల్పడుతోందని ఆరోపించారు. సెప్టెంబర్1న పాట్నాలో భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు.

News August 17, 2025

విశాఖలో ఒ’క్కో’ చోట ఒ’క్కో’లా నాన్ వెజ్ ధరలు

image

విశాఖలో నాన్ వెజ్ ధరలు ఒక్కో చోట ఒక్కోలా ఉన్నాయి. అక్కయ్యపాలెంలో కేజీ మటన్ రూ.900-1000 మధ్య ఉండగా.. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.240, స్కిన్ రూ.230గా ఉంది. తాటిచెట్లపాలెంలో కేజీ మటన్ కొన్ని షాపుల్లో రూ.900 ఉండగా.. మరికొన్ని షాపుల్లో రూ.800గా ఉంది. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.230, స్కిన్‌ రూ.220గా ఉంది. డజన్ గుడ్లు ధర రూ.66గా ఉంది.

News August 16, 2025

విశాఖలో బంగారం చోరీ

image

విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్‌లో శనివారం చోరీ జరిగింది. సెక్టార్ 6, 105/bలో నివాసం ఉంటున్న డీజీఎం నల్లి సుందరం తన భార్యతో కలిసి బయటికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటాన్ని గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని సీఐ శ్రీనివాసరావు పరిశీలించారు. ఇంట్లో 24 తులాల బంగారం చోరీకి గురికాగా మరో 40 తులాల బంగారం బిరువాలోనే ఉన్నట్లు తెలిపారు.

News August 16, 2025

విశాఖ ప్రజలకు జీవీఎంసీ కమిషనర్ విజ్ఞప్తి

image

విశాఖ నగరంలో భారీ వర్షాలు ఉన్నందున ఇప్పటికే జీవీఎంసీ అప్రమత్తంతో ప్రత్యేక చర్యలను చేపట్టిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం తెలిపారు. ప్రజలు ఇళ్లలో విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా వాడాలని, శిథిలావస్థ భవనాల్లో ఉండరాదని కమిషనర్ సూచించారు. ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే జీవీఎంసీ కంట్రోల్ రూమ్‌ టోల్ ఫ్రీ నంబర్ 1800 4250 0009కు సమాచారం అందించాలని కోరారు.

News August 16, 2025

పెందుర్తిలో అత్యధిక వర్షపాతం నమోదు

image

పెందుర్తిలోని అత్యధికంగా వర్షపాతం నమోదయింది. బంగాళాఖాతంలోని అల్పపీడనం ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెందుర్తి పరిసర ప్రాంతాల్లోనీ 66.4 మీ.మీ.వర్షపాతం నమోదయింది. పద్మనాభంలో 28.6 మీ. మీ, ఆనందపురం 15.6 మీ.మీ, ములగాడ 8.2 మీ.మీ., గోపాలపట్నం 7.4 మీ. మీ, విశాఖపట్నం రూరల్ 6.8.మీ.మీ వర్షం పడింది. ఇల్లా వ్యాప్తంగా 24 గంటల్లో 162.0 వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News August 16, 2025

విశాఖ: పేలుడు ఘటనలో మరో వ్యక్తి మృతి

image

విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద వెల్డింగ్ దుకాణంలో పేలుడు సంభవించి ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతున్న ముగ్గురులో గంగారావు కేజీహెచ్‌లో శుక్రవారం మృతి చెందాడు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News August 16, 2025

పెద్ద సంఖ్యలో మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం: కమిషనర్

image

VMRDA పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపాదించామని కమిషనర్ విశ్వనాథన్ తెలిపారు. సిరిపురంలోని వీఎంఆర్డీఏ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెద్ద సంఖ్యలో మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మాణం చేపట్టామన్నారు. విశాఖ, విజయనగరం అనకాపల్లి జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టామన్నారు. పలు ప్రాంతాల్లో పార్కులు అభివృద్ధికి చేస్తున్నామన్నారు.